18/02/2013

స్వార్ధంవేకువ చీకటిని చీల్చే క్షణంలో
మంచుతెరలను తొలగిస్తూ 
నీ నుదుటిని తాకే తొలికిరణం 
నేనే కావాలనుకొనే స్వార్ధం నాది.

నిదుర లేచిన నీ కనులు 
మొదట చూసే దృశ్యం 
నా ముఖమవ్వాలనుకొనే స్వార్ధం నాది.

నీ తడికురులు నా పెదవులపై 
చేసే లాస్యంతో 
మేలుకోవాలనే స్వార్ధం.నాది.

కన్ను తెరిచి మబ్బుకమ్మిన 
మచ్చలేని చందమామను 
ఉదయాన్నేచూడాలనే 
స్వార్ధం నాది.

చక్కర కలిపిన తేనీటికి
తేనెల మాధుర్యం తోడుగా 
నిత్యం నాకందించాలనే స్వార్ధం నాది.

ఈ కుందనపు బొమ్మనొదిలి 
ఏ కొమ్మతో ఉన్నావో ?
అనే అపనమ్మకపు మాటల్లో
తొణికిసలాడే ప్రేమను 
నేనే అవ్వాలనే స్వార్ధం నాది.

ప్రతి రాత్రి నీ చెవి నా గుండెసవ్వడి వింటూ 
నీతల నా ఎదనే తలగడగ చేసుకోవాలనే 
అందమైన స్వార్ధం నాది.

నీ ప్రతి ఆనందానికీ కారణం నేనే కావాలనీ 
ఎ చిన్ని బాధకూ కారణం నే కారాదనీ 
కోరుకునే స్వార్ధం నాది.

నా ప్రేమలోని నిస్వార్ధాన్ని నువ్వెప్పుడూ గుర్తిస్తూ 
నీ ప్రేమనంతా  నేనే పొందాలనే 
నిస్వార్ధమైన స్వార్ధం నాది.

(నా బ్లాగ్ లోని కవితలను ఆదరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు...అభివాదాలు.మీ వలెనే నేను ఎదిగింది.అందుకే నన్ను ప్రోత్సహించిన మిత్రులకి అందరికీ నా వ్రాతలు అంకితం.)...@శ్రీ 17/02/2013

కౌగిలింత

కౌగిలింత అంటే...
ఆకుపచ్చని తీగ పైకి పాకుతూ 
పందిరిలోని ప్రతి కర్రనూ 

ఆధారంగా చేసుకుంటూ
అల్లుకుపోవడమే.

ఉరుముతోనే పుట్టినా 

ఆ గర్జనకు భయపడుతూ
పరుగుపరుగున వచ్చి 

నల్ల మేఘాన్ని
మెరుపుతీగ 

చుట్టుకోవడమే.

పున్నమి వెలుగుల్లో 

మెరిసే తరగలు 

వడివడిగా ముందుకి కదులుతూ
ఎగసి పడుతూ
తీరాన్ని కమ్మేసుకోవడమే.

స్వాతిచినుకు కోసం 

ఆర్తిగా ఎదురు చూస్తూ
చినుకు పడిన వెంటనే 

ముత్యంగా మారకముందే 

తుళ్ళిపోతుందనే భయంతో 

చిప్పల మూతలతో 

బంధించేయడమే...

కన్నులు తెరిచి నిన్నే చూస్తూ 

నీ రూపాన్ని టక్కున పట్టేసి 

కనుపాపల్లో దాచేసుకుంటూ
రెప్పల చేతులతో 

నిను కదలనివ్వక బంధించేదే... 


నిన్న నీ తోడైనాను, 

నేడు నీ నీడైనాను,
రేపు నీతోనే ఉంటాను 

అంటూ ప్రతినిత్యం 

నిన్నల్లుకునే 

కాంక్ష లేని నా ప్రేమపాశమే... ...@శ్రీ14/02/2013

ప్రేమ ప్రేమ ప్రేమఆకాశం ఔన్నత్యంతో పోటీ పడేది ప్రేమ.
పృథ్వికున్న క్షమతో సమానంగా నిలబడేది ప్రేమ.
అగ్నిశిఖలా ప్రజ్వలించేది ప్రేమ.
శీతల సమీరంలా స్పృశించేది ప్రేమ.
జలధితరంగంలా ఎగసిపడేది ప్రేమ.
పంచభూతాల సమాహారం ప్రేమ...

కంటికి నచ్చిన వారిని కన్నుల్లో నింపుకొనేది ప్రేమ.
చెవికి ఇంపైన మాటలు ఎప్పుడూ వినాలనిపించే భావం ప్రేమ.
పెదవులు తీయగా ఆ పేరునే పిలవాలనిపించడమే ప్రేమ.
ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసించేది ప్రేమ.
నచ్చినవారి వెచ్చని స్పర్శను మళ్ళీ మళ్ళీ కోరుకొనేది ప్రేమ.
పంచేంద్రియాల ఏకత్వం ప్రేమ... 

ఊదాలోని సున్నితత్వం ప్రేమ.
నీలిమందు (వర్ణం)లోని నిజాయితీ ప్రేమ.
నీలిరంగులోని నమ్మకం ప్రేమ.
హరితంలోని  ప్రకృతి ఆరాధన ప్రేమ.
పసుపులోని సృజనాత్మకత ప్రేమ.
కెంజాయలోని ధనాత్మకత ప్రేమ.
ఎరుపురంగులోని ఉత్తేజం ప్రేమ.
హరివిల్లులోని అన్నివర్ణాలు కలిసిన శ్వేతవర్ణమంత స్వచ్చమైనది ప్రేమ.

ప్రేమికుల మనసులో... 
నిరంతరం వెలిగే  'అఖండజ్యోతి' ప్రేమ.
ప్రేమికుల భావగీతి ప్రేమ.
ప్రేమికులు ఉన్నా లేకున్నా ఈవిశ్వంలో శాశ్వతంగా నిలిచిపోయేది ప్రేమ....@శ్రీ 10/02/2013

అందాలతో వేట
లేడిని వేటాడ వచ్చా

,
లేడి కనుల చినదానికి చిక్కా

.
త్రుటిలో సింహం తప్పించుకుం
ది,


సింగపు నడుము చిన్నది దొరికింది.
చేతనున్నవి సుమాలు

,చూపులు మాత్రం.
..


పంచ బాణుని శరాలు

,
ముదిత వదిలే ముద్గరాలు,

  
తలోదరి వేసే తోమరాలు

,
భామిని ప్రయోగించే భల్లాలు.

  

తనువంతా అందాల అతిశయాలు

.
సౌందర్యాల జలపాతాలు 

,
ప్రకృతికి ప్రతి రూపాలు,


లావణ్యానికి నెలవులు

.

వేటాడదామని వచ్చా 

,
నీ అందాలచే వేటాడ బడ్డా...
@శ్రీ