31/10/2012

తీయని తెలుగు



సహ్యాద్రి గిరులలో ప్రతిధ్వనించేది  తెలుగు.
తిమ్మమ్మ మర్రిమాను నీడలో సేద తీరేది తెలుగు.

శ్రీ వేంకటేశుని  గానామృతంలో తడిసేది తెలుగు.
పావన గోదావరి వేదనాదాలలో ఎగసేది తెలుగు.

అమరావతి కథలలో మెరిసేది తెలుగు.
భాగ్యనగరంలో భాసించేది తెలుగు.

కాకతీయుల కాలంలో కాకలు తీరింది తెలుగు.
భీమకవి పాండిత్యంలో ప్రకాశించింది తెలుగు.

నేలకొండపల్లి శాంతి స్తూపాలలో దాగింది తెలుగు.
రామదాసు కీర్తనల్లో ప్రాణం పోసుకుంది తెలుగు.

కృష్ణమ్మ పరవళ్ళలో పరవశించేది తెలుగు.
సిద్దేంద్రయోగి నృత్యంతో పదం కలిపింది తెలుగు 

శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్మయమయ్యేది  తెలుగు.
నల్లమల  కోకిల నోట మధుర గీతమయ్యింది తెలుగు...

నీలిగిరుల సౌందర్యాన్ని తనలో దాచుకుంది తెలుగు.
'బాసర భారతి'కి అక్షర నీరాజనమిచ్చింది తెలుగు...

మొల్ల రామాయణంలో మల్లియలై పరిమళించింది తెలుగు.
మంజీర నాదాలలో అడుగు కలిపి నర్తించింది తెలుగు 

త్యాగయ్య గొంతులో సరిగమలు పాడింది  తెలుగు.
కవిత్రయం కావ్యంలో కమనీయమైంది  తెలుగు 

నాగావళీ తీరాన నాట్యమాడింది  తెలుగు.
ఘంటసాల గళంతో  గొంతు కలిపింది తెలుగు.

విశాఖ సాగర ఘోషయై పలికింది తెలుగు.
రామప్ప గుడిలోన రాగమాలపించింది తెలుగు.

నన్నయ నోట శబ్దశాసనమయ్యింది  తెలుగు
శ్రీ కృష్ణ దేవరాయల స్తుతి అందుకుంది తెలుగు  

కృష్ణ శాస్త్రి భావుకతలో భావమైనది  తెలుగు...
శ్రీ శ్రీ చేతిలో అక్షర ఖడ్గమయ్యింది  తెలుగు.

తేనెకన్న తీయనిది  తెలుగు...
మధురిమకే మాధుర్యం నేర్పినది  తెలుగు...
సుకవులకి అలవోకగా పదాలనందించేది  తెలుగు.
అజంతమైన భాష మన తెలుగు...
అనంతమైన భాష మన తెలుగు...                 @  శ్రీ 

(మన తెలుగు భాష ...ప్రపంచ భాషల్లో
 "ద్వితీయ అత్యుత్తమమైన లిపి "ఉన్న భాషగా
 సత్కరించబడిన నేపథ్యంలో 
తెలుగు మాట్లాడే అందరికీ గర్వకారణం 
అనే భావాన్ని చెప్పాలనుకొని 
తెలుగు భాషా సరస్వతికి అర్పించే అక్షర సుమహారం)

30 comments:

  1. అద్భుతం, ఆకర్షణీయం, సుమనోహరమ్, సుకుమారం, సౌమ్యం, ప్రవాహం, మంజీరనాదం, ఆనందహేల - మన తెలుగు - అత్యద్భుతం మీ తెలుగు - మీ భావం.

    ReplyDelete

  2. "తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
    తెలుగు రేడ నేను తెలుగొకండ
    ఎల్లవారు వినగా ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స...."
    మన భాషలోని మాధుర్యాన్ని
    ఎలుగెత్తి చెప్పిన శ్రీకృష్ణ దేవరాయలు మనకు ఆదర్శం కావాలి...
    మీ అద్భుతమైన ప్రశంసకి పులకించి వెంటనే స్పందించేసాను...
    ధన్యవాదాలు రాజారావు గారూ!

    ReplyDelete
  3. "తెలుగుభాష గొప్పదనం,తెలుగుభాష తియ్యదనం"
    అంతా మీ కవితలో తెలుస్తుంది.
    మీరు "తెలుగు భాషా సరస్వతికి అర్పించిన అక్షర సుమహారం" అపూర్వమైనది..

    ReplyDelete
    Replies
    1. ఈ పాట ఎంత ట్రై చేసినా డౌన్లోడ్ అవలేదు...
      మీ సహాయం తీసుకుందామనే లోపు
      లక్కీగా దొరికింది...
      మీకు నా భావాలు నచ్చినందుకు
      ధన్యవాదాలు రాజి గారూ!...@శ్రీ

      Delete
    2. అద్భుతమైనది మనతెలుగు భాష మంచి భావాన్ని అందించిన మీకు ధన్యవాదాలు

      Delete
  4. Replies
    1. వనజ గారూ!
      మనమంతా ప్రయత్నిస్తే...
      మనతో ఇంకా జనం తోడైతే...
      తెలుగు వైభవాన్ని కాపాడగలుగుతాం..
      ధన్యవాదాలు మీ ప్రశంసకు...

      Delete
  5. sri gaaru ekkadoo tech chesharu andi...:)

    ReplyDelete
    Replies
    1. అన్ని చోట్లా...టచ్ చేసాను...:-)
      అన్ని ప్రాంతాలనూ టచ్ చేసాను...
      ధన్యవాదాలు మీ స్పందనకు ప్రిన్స్....@శ్రీ

      Delete
  6. చాలా చక్కగా వ్రాసారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనూరాధ గారూ!
      మీకు తెలుగు విశిష్టతపై వ్రాసిన ఈ కవిత నచ్చినందుకు...@శ్రీ

      Delete
  7. Replies
    1. చాలా కాలానికి సూపర్బ్ వ్యాఖ్యతో వచ్చారు :-)
      వేరే దేశంలో ఉన్నా బ్లాగ్స్ ద్వారా
      తెలుగుని వెలుగులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్న మీకు...
      ఇంకా అందరికీ
      ధన్యవాదాలు వెన్నెల గారూ!...@శ్రీ

      Delete
  8. శ్రీగారు!
    తెలుగు భాష ఘనతను చాలా చక్కగా చెప్పారండి.

    ReplyDelete
    Replies
    1. అవును భారతి గారూ!
      మన తెలుగుని మనం కాపాడుకోవాలి...
      వేగంగా కనుమరుగవుతున్న భాషల్లో మన తెలుగు ఉందిట...
      ధన్యవాదాలు మీ స్పందనకు,ప్రోత్సాహానికి...@శ్రీ

      Delete
  9. తెలుగులోని తీపి అంతా మీ పోస్ట్ లో వెల్లివిరిసిందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సృజన గారూ!
      నా కవిత మీకు మాధుర్యాన్ని పంచితే
      అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి...
      తెలుగులోనే ఉంది ఆ మాధుర్యం...@శ్రీ

      Delete
  10. అయితే ఇక "దేశ భాషలందు..." కాదు, కాదు...
    "భాషలందు తెలుగు లెస్స" అనమాట.
    అమితానందం. గర్విస్తూ కాపాడుకోవలసిన భాష మనది.
    కవిత్వంలో తెలుగులో రాష్ట్రం అంతా తిప్పారు శ్రీ గారూ!
    చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అవును చిన్ని ఆశ గారూ!
      మీరన్నట్లుగా..."విశ్వ భాషలందు తెలుగు లెస్స"
      అనేయవచ్చు...
      అన్ని ప్రాంతాలలోనూ ఉన్న తెలుగుని స్పృశించే చిన్న ప్రయత్నం...
      ఒక్క జిల్లా పట్టుకున్నా ఇంత పెద్ద కవిత అయిపోతుంది...:-)
      అందుకే ఒక్కో జిల్లాలోనూ ఒక్కోటి తీసుకొని వ్రాసాను...
      మీకు నా ప్రయత్నం నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  11. చాలా చాలా బాగుంది శ్రీ గారు :)

    ReplyDelete
    Replies
    1. కావ్య గారూ!
      బోలెడు ధన్యవాదాలు మీకు.
      భారతీయ భాషల్లో
      ఎక్కువ అక్షరాలున్న వర్ణమాల మనదే...
      తెలుగుని కాపాడదాం...@శ్రీ

      Delete
  12. తెలుగు భాషామ తల్లికి చేసిన మీ అక్షరాంజలి చాలా బాగుంది శ్రీ గారు.. తెలుగు చరిత్ర అంతా మీ అంజలిలో కనిపించింది..

    ReplyDelete
    Replies

    1. మీకు అలా కనిపిస్తే...నా ప్రయత్నం సఫలమైనట్లే...
      మీరిచ్చిన చక్కని ప్రశంసకు
      ధన్యవాదాలు సుభగారూ!.....@శ్రీ

      Delete
  13. చాలా చాలా బాగుంది. తెలుగు భాష గొప్పదనము మొత్తం ఒక్క కవితలో అద్భుతముగా చెప్పారు సర్.. :)

    ReplyDelete
  14. నా బ్లాగ్ కు స్వగతం ప్రసూన మాలికలు గారూ!...
    మనః పూర్వక ధన్యవాదాలు మీ అద్భుతమైన ప్రశంసకు...@శ్రీ

    ReplyDelete
  15. తెలుగంత తియ్యగా ఉంది మీ కవిత. చాలా సార్లు నా వ్యాఖ్య రాద్దామని ప్రయత్నించినా ఏదో సాంకేతిక లోపం వల్ల మీ బ్లాగ్ ఓపెన్ చేసిన వెంటనే క్రాష్ అవుతుంది.

    ReplyDelete
  16. ధన్యవాదాలు కి(శో)షోర్ గారూ!...
    మీ చక్కని స్పందనకు...
    మీ స్పందనకు...ఈ ప్రాబ్లం కొంతమందికి వస్తోందంటున్నారు...
    కారణం మాత్రం తెలియడం లేదు...
    నేను కూడా సొల్యూషన్ కోసం చూస్తున్నాను...@శ్రీ

    ReplyDelete
  17. Wonderful, very well nerrated.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కోదండరావు గారూ!...నా బ్లాగ్ కి స్వాగతం...@శ్రీ

      Delete
  18. తెలుగు వారందరినీ దగ్గర చేశారు సార్. ధన్యవాదములు
    ఇట్లు: బాలగౌని మధు

    ReplyDelete