09/10/2012

వాస్తవాన్ని గ్రహించని మానవజాతిచేపను తింటే  గుండెకు మంచిదని...
పావురం  రక్తం పక్షవాతానికి మందు అని...

కుందేలు మాంసం సంతానోత్పత్తికి ఉత్ప్రేరకమనీ...
మొసలి చర్మం డబ్బు దాచేందుకు అనీ...

పాము చర్మం నడుమును  చుట్టేందుకు అనీ...
ఏనుగు దంతం షోకేసులకి శోభనిస్తుందనీ...

లేడి కొమ్ము గుమ్మానికి అలంకారమనీ...
పులితోలు గోడకి అందమనీ...

ఔషధ విలువలున్నాయని తిమింగలాలని వేటాడి చంపేస్తూ 
నక్షత్రాల తాబేటి చిప్పల్ని డ్రాయింగు రూముల్లో అలంకరిస్తూ

ఇలా అన్ని జీవుల్నీ చంపుకుంటూ,
అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కబళిస్తూ,
అన్నీ పోయినా, నేను మాత్రం ఉంటాననే భ్రమలో 
బతుకుతోంది వాస్తవాన్ని గ్రహించని మానవజాతి...  @శ్రీ