27/02/2012
మువ్వల సవ్వడి
వెన్నెల
పుచ్చపూవులా పరుచుకుంది....
పుచ్చపూవులా పరుచుకుంది....
నీ రాక కోసం ఎదురు చూసే
నా కన్నులకి అమృత వర్షంలా కనిపిస్తోంది....
నా కన్నులకి అమృత వర్షంలా కనిపిస్తోంది....
నెలరాజు నీకోసమే
కాంతిబాటలు పరిచినట్లుంది,
కాంతిబాటలు పరిచినట్లుంది,
నక్షత్రాల వీధి దీపాలను
నీకోసమే అమర్చినట్లుంది...
నీకోసమే అమర్చినట్లుంది...
ఘల్లు ఘల్లుమని సవ్వడి చేసే
నీ కాలి అందెల మువ్వలు
నీ కాలి అందెల మువ్వలు
తళతళలాడుతుంటాయి...
ఈ వెన్నెల్లో
మిలమిల మెరుస్తుంటాయి.....
మిలమిల మెరుస్తుంటాయి.....
ఆ మువ్వల సవ్వడులు
ప్రతినిత్యం నా ఇంట్లో వినపడనీ....
ఆ మువ్వల మెరుపులు
అనుక్షణం నా కంట్లో కనపడనీ....
నల్లని జలపాతం

ఈ లోకానికి తెల్లవారుతుంది సూర్యోదయంతో....
నాకు తెల్లవారుతుంది నీ ముఖ చంద్రోదయంతో....
ప్రత్యూష సమయంలో..
నీ నల్లని జలపాతం లాటి కురులు
చేసే అల్లరికి నిద్ర లేవటం అలవాటుగా మారి పోయింది ప్రియా.....
అలిసి సొలిసి నిద్రించే నన్ను...
నీ నీలి కురుల జలపాతపు తుంపర్లు తాకి...
నా అలసటను దూరం చేస్తూ నిద్ర లేపుతాయి...
అలా ప్రతి రోజు నిద్ర లేపుతానని బాస చేస్తే
నీతో మళ్లీ అలిసిపోతాను ప్రియా...
నీలో మళ్లీ కలిసిపోతాను ప్రియా...
Subscribe to:
Posts (Atom)