05/04/2012

భయంతో.....


మనసు పొరల్లో నిక్షిప్తమైన 
నీ జ్ఞాపకాలను తీసి వేద్దామని 
నా గుండె గదుల తలుపులు తెరుస్తుంటాను.

తెరిచిన ప్రతిసారీ,
నీ స్మృతులు....
నన్ను ప్రేమగా పలకరిస్తాయి,
నావైపు సజల నయనాలతో చూస్తాయి,
మృదువుగా నా మనసుని స్పృశిస్తాయి,
ప్రేమ కుసుమాలతో నన్ను అర్చిస్తాయి.వెంటనే మూసేస్తాను ఆ తలుపుల్ని.
...............
నీ తీపి జ్ఞాపకాలు....
బైటికెళ్లి పోతాయనే భయంతో,
నాకు.... దూరమైపోతాయన్న దిగులుతో....