నీ చిరునవ్వుని.. నీలాంబరానికిచ్చేస్తే...
తన సిగపాయలో, నెలవంకను
చేసి ముడుచుకుంది........
నీ కంటి మెరుపులను ... తారలకిచ్చేస్తే...అవి విద్యుత్ ప్రభలతో
తళుకుమంటున్నాయి ...
నీ నడుము వంపుసొంపులను ...
నదులకిచ్చేస్తే...
అవి మరింత వయ్యారంగా
ప్రవహిస్తున్నాయి....

నీ పెదవుల ఎరుపును....
తామరలకిచ్చేస్తే ..
అవి కెందామరలై విరబూసాయి...

అందరికీ ఇచ్చేయడమేనా???
అంటూ నీపై అలిగితే,..........
"నాదగ్గర నువ్వున్నావుగా!"
అంటూ నా ఎదపై వాలిపోతావు.
@శ్రీ