02/05/2012

కను రెప్పల మధ్య దూరం...


మన  ప్రేమల మాట  ఎలా ఉన్నా,
మనం ఒకరికొకరు  దూరంగా.. 
ఉన్నామన్నది మాత్రం పచ్చి నిజం.


ప్రపంచం చిన్నది అయిపోయింది..
దూరాలు తగ్గిపోయాయి...
అని అందరూ అంటున్నారు.


ఇప్పుడు కూడా.........                               
నది.... సముద్రంలో కలవాలంటే
వేల మైళ్ళు  పరుగులెత్తాల్సిందే ....
వెన్నెలకాంతులు.... కలువని తాకాలంటే...
లక్షల మైళ్ళు పయనించాల్సిందే...

నిన్ను నేను చేరాలంటే ఎంత దూరం 
వెళ్ళాలో చెప్పగలనేమో కానీ,

రాత్రి అయితే చాలు, 
నీకోసం చూసి చూసి,
ఒకదానికొకటి దూరమైపోతున్న 
నా కను రెప్పలను కలపాలంటే....
వాటినెంత దూరం ప్రయాణం చేయించాలో 
మాత్రం చెప్పలేక పోతున్నా...... 


                               



                                                                                                @శ్రీ 

  
 






 

 






 






10 comments:

  1. chala baga rasaru.... too gud......

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హను గారూ!
      @శ్రీ

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు వెన్నెలగారూ!
      @శ్రీ

      Delete
  3. దూరమెంతో కాలమే నిర్ణయించాలేమో:)

    ReplyDelete
  4. బహుశా మీరన్నది నిజమేనేమో!!
    :)...@శ్రీ

    ReplyDelete
  5. मिलनेकी घड़ियाँ छोटी है, और रात जुदाई की लम्बी, जब सारी दुनियां सोती है हम तारे गिनते रहते है. శ్రీ గారూ, మనసుల వేగాన్నీ , దూరాన్నీ కొలిచే సాధనాలు ఇంకా రాలేదు, రావేమో కూడా. చాలా బాగా రాసారు.

    ReplyDelete
  6. छोटी छोटी इंतज़ार अब
    लम्बी रात लगती है.....
    तेरे ना मिलने से ये दिन छोटी लगती है........

    మీ ప్రశంసకి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
    @శ్రీ

    ReplyDelete
  7. ప్రపంచం చిన్నది అయిపోయింది..
    దూరాలు తగ్గిపోయాయి...
    అని అందరూ అంటున్నారు.


    ఇప్పుడు కూడా.........
    నది.... సముద్రంలో కలవాలంటే
    వేల మైళ్ళు పరుగులెత్తాల్సిందే ....
    వెన్నెలకాంతులు.... కలువని తాకాలంటే...
    లక్షల మైళ్ళు పయనించాల్సిందే......చాలా బాగా వ్రాసారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ! మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete