26/05/2012

మల్లెల మాలిక.....


మండువేసవిలో...
కనువిందు చేసే ధవళ కుసుమాలు...
స్వచ్ఛతకు  ప్రతీకలు,
సుగంధాలకి  నెలవులు,
పరిమళాలకు చిరునామాలు.

పడతుల  నీలికురుల తరగల  మెరిసే 'తెల్లని నురుగులు'...
మదనుడు సంధించిన 'శృంగార అస్త్రాలు.'..

చెలి జడలో శోభిల్లే  'చిరు కాగడాలు'...
మనసుల చెలరేగే కోరికలకు 'ఉత్ప్రేరకాలు'....

కన్నెల కొప్పులకు ప్రకృతి ప్రసాదించిన  'శ్వేతాభరణాలు'...
తెల్లని పానుపుపై తనువుని నొప్పించని 'వెన్నెల తునకలు'...

చీకటిలో వెలిగే 'వెన్నెల పుష్పాలు'...
మగువల  చిరు కోపాలకు 'దివ్యౌషధులు'....

ఏకాంతంలో...
నీకోసమే ఎదురు చూసే నాకు మాత్రం....
'విరహాగ్ని'ని మరింత   పెంచే 'ఆజ్యపు చుక్కలు'...

                                                                                          


                                                             @శ్రీ 


19 comments:

 1. శ్రీ గారూ చక్కని భావన , విరహాన్ని అందంగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. నా భావ పుష్పమాలికా పరిమళం మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు ఫాతిమా గారూ!
   @శ్రీ

   Delete
 2. శ్రీ గారూ మీ కవిత వేసవిలో మల్లెల పరిమళంలా ఉందండీ..

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంస కూడా అలాగే ఉంది జ్యోతిర్మయి గారూ!
   :-)
   ధన్యవాదాలతో ...@శ్రీ

   Delete
 3. పూల పరిమళాల్ని పుటల పై చల్లేవాడు కవి అని నేను "కవితారవి " అనే కవితలో వ్రాసాను.అలా మీరు కవితలో వాటి సుగంధాన్ని చల్లారు.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసలో ముందుకు సాగిపోమ్మనే ప్రోత్సాహం కనిపిస్తుంది ఎప్పుడూ...
   ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
   @శ్రీ

   Delete
 4. mallepoola vasava muripam ga undandi,

  ReplyDelete
  Replies
  1. కవితా పరిమళం మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
   ..:-)
   @శ్రీ

   Delete
 5. విరహము కూడా సుఖఃమేకాదా!!!
  మీ కవిత నిరూపించిందికదా!!!:-)

  ReplyDelete
  Replies
  1. మంటలు రేపే నెల రాజా...
   అనుకుంటూ..:-)
   మీ వ్యాఖ్య సరైనదని ఒప్పేసుకుంటున్నానండీ పద్మ గారూ!
   @శ్రీ

   Delete
 6. Replies
  1. :-)...
   చాలా ధన్యవాదాలు వెన్నెలగారూ!
   మీరు కవితని మెచ్చినందుకు...

   చిన్న రిక్వెస్ట్....
   మీరు మీ బ్లాగ్ లో అమ్మ చిత్రాలు పెట్టారు కదా! నేను నెట్ లో సెర్చ్ చేశాను కొన్ని దొరికాయి కాని,
   మీరు పోస్ట్ చేసిన చిత్రాలు కొన్ని బాగున్నాయండీ!
   నా కవిత కోసం కొన్ని కావాలి...
   మీరు ప్రతి చిత్రానికి లింక్ ఇచ్చినా పరవాలేదు,
   లేకుంటే మీకు అభ్యంతరం లేకపోతె...
   rvsssrinivas666@gmail.com
   కి ఆ చిత్రాలు పంపగలరు...
   మెయిల్ కి పంపమన్నానని వనజ గారి మొబైల్ నెంబర్ ఆర్టికల్
   గుర్తు చేసుకోకండి సుమా!...:-))...:-))
   @శ్రీ

   Delete
 7. బాగుందండీ, బాగా వ్రాశారు.

  ReplyDelete
  Replies
  1. మీరు నా కవిత మెచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ!
   @శ్రీ

   Delete
 8. thank you vanaja gaaroo!
  @sri

  ReplyDelete
 9. nice feeling presented so lovely.
  very very nice sri gaaru

  ReplyDelete
  Replies
  1. సీత గారూ!
   మీ చక్కని ప్రశంస కు ..
   ధన్యవాదాలు..
   :-)
   @శ్రీ

   Delete