పిల్లల్ని నవమాసాలు మోసిన అమ్మ గొప్పతనం ఒక వైపుంటే,
ఆ సంతానాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే నాన్న గొప్పతనం వేరొకవైపు ఉంది.
మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,
ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా!
దెబ్బ తగిలితే అమ్మా!అంటూ అరుస్తాం...
కాని మందు వేయించేది నాన్నే కదా!
పాకెట్ మనీ కోసం రికమండేషన్ చేసేది అమ్మ అయితే..
మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా!
చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది...
సమస్య జటిలమైతే పరుగెత్తేది నాన్న వద్దకే కదా!
భూదేవంత ఓర్పు, సహనం అమ్మదైతే
ఆకాశమంత ఔన్నత్యం నాన్నది.
చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం...
పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారాన్ని పంచుకునే
ప్రయత్నం కూడా చేయం...
కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....
'అమ్మ' వర్తమానాన్ని చూస్తే...
మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేదీ,
మనకు లక్ష్యాలను చూపేదీ,
వాటిని సాధించుకొనేందుకు బంగారు బాటలు వేసేది 'నాన్నే' కదా!
(నేను పురుషుడిని కావటం వలన ఈ కవిత వ్రాయలేదు...
నాకు దొరికినట్లుగా మంచి తండ్రిని పొందిన ప్రతి ఆడవారు, మగవారు
నాతొ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను....ఈ నెల 17వ తేదీ "ఫాదర్స్ డే "
సందర్భంగా మా నాన్న కోసం వ్రాసిన చిరు కవిత...@శ్రీ )
చాలా చాలా బాగుంది.. శ్రీగారు...మీ కవిత..
ReplyDeleteమీకు Father's day subhakanshalu....
ధన్యవాదాలు సాయీ ....కవిత నచ్చినందుకు,
Deleteమరియు father'sday wish కి.
@శ్రీ
నాన్న ప్రేమను తెలిపే కవిత ఇది
DeleteSri Gaaru Yekkadanoo Tech Chesharu andi....
ReplyDeleteela cheppalo kuda maatalu ravatam ledu andi...
chaalaa chaalaa bagundi andi...
ధన్యవాదాలు ప్రిన్స్..మీ భావాత్మకమైన స్పందనకు,
Deleteమీకు కవిత నచ్చినందుకు...
@శ్రీ
మీకు కూడా...
ReplyDeleteపితృదినోత్సవ శుభాకాంక్షలు!
ధన్యవాదాలు అనికేత్!
Deleteకవిత మీకు నచ్చినందుకు,
శుభాకాంక్షలు అందించినందుకు....
@శ్రీ
Wishing U Happy Father's Day.
ReplyDeletethank you padma gaaroo!
Delete@sri
శ్రీగారు, మీ కవిత మనసుని కదిలించింది, అమ్మా ,నాన్నల ప్రేమలో వ్యత్యాసం ఉండదు, కాని కొన్ని వరాలు బాద్యతలు అమ్మకు ప్రకృతి ఇచ్చిన వరాలు అంతే, ఇకపోతే మీ ఆవేదన , ఆప్యాయత చూస్తే మీరు కుడా ఓ మంచి తండ్రి అనుకుంటున్నాను. మీ చల్లని నీడ మీ సంతానానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ .. మీకు పిత్రుదినోత్శవ శుబాకాంక్షలు.
ReplyDeleteఫాతిమా గారూ!
Deleteకవితకి మీరు స్పందించిన తీరుకి ధన్యవాదాలు...
అభినందనలకి మరోసారి ధన్యవాదాలు...
@శ్రీ
motham meda amma mundu naannani nilabetti, nuvvu kooda o.k nanna anntludandi naaku, nice one, keep writing, happy fathers day.
ReplyDeleteభాస్కర్ గారూ!
Deleteమీరు వ్రాసినది నా కవితా భావం కాదండోయ్...
ఆలోచించి మరోసారి చదవండి...
అవన్నీ నిజాలని మీరే అంటారు..:-)
మీ అభినందనలకి ధన్యవాదాలు మీకు....
@శ్రీ
chaalaa chakkaga amma naannala gurinchi chepparu....
ReplyDeletemiku kuda happy fathers day andi
నాకు తోచిన భావాలకు అక్షర రూపం ఇచ్చానండీ!
Deleteమీ అభినందనలకు, ప్రశంసకు
ధన్యవాదాలు మంజు గారూ!
@శ్రీ
అమ్మ నాన్నల గురించి చాలా బాగా వ్రాసారు .
ReplyDeleteహాపీ ఫాదర్స్ డే .
మీ ప్రశంసకు,
Deleteఅభినందనలకి,
ధన్యవాదాలు మాలా కుమార్ గారూ!
@శ్రీ
శ్రీ గారూ,
ReplyDeleteఅమ్మా నాన్న పిల్లలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు.
ఈరోజు నాన్నగారికోసం రాస్తూ ఇద్దరి ప్రేమనీ చాలా చక్కగా మాటల్లో పొందుపరిచారు. ప్రేమని పంచటంలో అమ్మా, నాన్నా ఇద్దరూ ఒకటే. అమ్మ జన్మనిచ్చి నాన్నకన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనే నిలుస్తుంది.
అందుకే 'మాతృదేవోభవ' తరువాతే 'పితృదేవోభవ'.
కానీ అమ్మా నాన్నా అన్నీ నాన్నే అయ్యి అమ్మలా చూసుకునే తండ్రులూ ఉన్నారు. ఇలా ఈ నాడు తండ్రి ని గుర్తుచేసుకోవటం ఓ ఆనందమైన అనుభూతి.
Happy Fathers Day to You!
మీ విశ్లేషణ చాలా బాగుంది చిన్ని ఆశ గారూ!
Deleteమీరు నా కవితని మెచ్చినందుకు,
మీరు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు...
నా బ్లాగ్ మిత్రులలో...తండ్రులయిన అందరికీ...
మీ వ్యాఖ్యకి చేసే ప్రతిస్పందనలోనే
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను....
@శ్రీ
శ్రీ గారు,
ReplyDeleteచాలా చాలా చాలా చాలా బాగా రాసారు అండీ....!!
మీకు happy fathers day ...:):):)
చిన్ని ఆశ గారి విశ్లేషణ బాగుంది......!!
-- సీత.....
అమ్మో సీతగారూ!
Deleteఅన్ని "చాలా"లు పెట్టేసారు...:-))
కవిత మీకు నచ్చినందుకు బో........లెడు ధన్యవాదాలు... :-)
@శ్రీ
బాగుంది శ్రీ గారు ....కృష్ణప్రియ
ReplyDeleteకవిత మీరు మెచ్చినందుకు
Deleteధన్యవాదాలు కృష్ణ ప్రియా!
@శ్రీ
Happy Father's day Sri gaaru. Late gaa wishes cheppanu.Sorry!
ReplyDeletekavita baagundi. chitraalu kooDaa baagunnaayi.
మీ స్పందనకి ధన్యవాదాలు వెన్నెలగారూ!
Deleteమీ అభినందనలకి కూడా ధన్యవాదాలు...
@శ్రీ
హాయి శ్రీనివాస్,
ReplyDeleteభావాల్ని అందరితో పంచుకుంటూ.....
నీ బాధ్యతల్ని పెంచుకుంటున్నావ్ :-)
మనల్ని ప్రేమించేవారు పెరుగుతున్న కొద్దీ...
ఆ ప్రెమల్ని పదిలంగా చూసుకోడం బాద్యతే కదా!
ఎప్పుడూ నిన్ను ఇలాగే సంతోషంగా చూడాలని కోరుకుంటున్న...
నీ..
బాల్య నేస్తం
నా మిత్రుడిగా, నా శ్రేయోభిలాషిగా
Deleteనా సంతోషం కోరుకుంటున్నందుకు
నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను నేస్తం...
నీవన్నది నిజమే...
నాకిప్పుడు మంచి బ్లాగ్ మిత్రులు కూడా ఉన్నారు...
ధన్యవాదాలు నీ స్పందనకు...
@శ్రీ
కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
ReplyDeleteవెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....
చాలా గొప్ప పద ప్రయోగం..చాలా బాగుంది.
నా పద ప్రయోగం మీకు నచ్చినందుకు
Deleteధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
@శ్రీ
చాలా బాగున్నాయి మీ కవితలు. మీ బ్లాగ్ నాకు నచింది.మంచి పాట కుడా
ReplyDeleteనా కవితలు , నా బ్లాగ్ నచ్చినందుకు మీకు ధన్యవాదాలు 123 గారూ!
Deleteమీపేరు తెలియదు కదండీ!:-)
నా బ్లాగ్ కి స్వాగతం....మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ ఉండండి....:-)
@శ్రీ
"పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారాన్ని పంచుకునే ప్రయత్నం కూడా చేయం..." Very True.
ReplyDeleteఫణి గారూ!
Deleteనా భావం మీకు నిజమనిపించిది కదూ!
ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళముందే కనపడుతూ ఉంటాయండీ మనకు...
ధన్యవాదాలు...
అన్నట్లు మీ ఇంటి పేరుతొ మాకు చాలామంది చుట్టాలు ఉన్నారండీ...
అందుకే మిమ్మల్ని క్రిందటి సారి మీ వివరాలడిగాను..
ప్రొఫైల్ లో నా మెయిల్ ఐ డీ ఉంది...
మీకు అభ్యంతరం లేకపోతె మీ వివరాలు తెలియ జేయ గలరు...
@శ్రీ
This comment has been removed by the author.
ReplyDeleteమీ కవితలు ఇప్పుడే చూసాను
ReplyDeleteచాలా బాగున్నాయి
సుబ్రహ్మణ్యం,ఖరగపూర్
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ!...@శ్రీ
ReplyDeleteWonderful tribute to a great and loving father.
ReplyDeleteరత్నశిఖామణి
అమ్మ నాన్న లా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇ కవిత్వము లో కుడా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది
ReplyDeleteధన్యవాదాలు సార్ మంచి అమ్మ నాన్న గురించి మనం ఎంత చెప్పిన రాశినా తక్కువే సార్
ధన్యవాదాలు మీకు.
Deleteఅవునండీ మీరన్నది నిజమే. 🙏😊
మీ కవిత చదువుతుంటే నా కంట్లో నీళ్ళు ఆగడంలేదు..
ReplyDeleteఇంతగా నా మనసును కదిలించి నందుకు ధన్యవాదాలు..
మీకు ధన్యవాదాలు🙏
Deleteమీ మాటలతో కళ్ళు చెమర్చాయి.. మీకు శతకోటి వందనాలు..
ReplyDeleteమీకు ధన్యవాదాలు... 🙏😊
Delete