10/07/2012

శ్రీకృష్ణ జననం





తమ కళ్ళముందే..
ఆరుగురు శిశువులను
కంసుని కర్కశ ఖడ్గం బలితీసుకోగా......
సప్తమ గర్భం విచ్చిన్నం కాగా...

అష్టమ గర్భంతో దేవకి...
కోటి ఆశలతో వసుదేవుడు...
ఈ సారి జన్మించే శిశువు 
కంసుని పాలిటి మృత్యువు కావాలని ప్రార్థిస్తూ 
ఎదురు చూసే సమయంలో....

శ్రావణ బహుళ అష్టమి...
అర్ధరాత్రి...
చెరసాలలో...
సప్తఋషుల  మంత్రపఠనం వినిపిస్తుండగా...
వేదనాదాలు ప్రతిధ్వనిస్తుండగా...
దేవతలు సుమవర్షం కురిపిస్తుండగా...
గంధర్వులు గానం చేస్తుండగా...
అప్సరాంగనలు   నాట్యం చేస్తుండగా...

కనులు మిరిమిట్లు గొలిపే దివ్య ప్రభలతో...
ఒక ఇంద్రనీలమణి
ఉద్భవించినట్లుగా,....  
విద్యుల్లతలతో  మెరుస్తూ
ఒక నీలమేఘం...
నింగి నుండి నేలను వ్రాలినట్లుగా...

నల్లని పూర్ణచంద్రునికి 
నెలవంక అద్దినట్లుండే చిరునవ్వుల మోముతో...
అరవింద దళాయతాక్షుని  జననం...

దుష్ట శిక్షణకు...శిష్ట రక్షణకు నడుము  బిగించి 
శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారం...
అదే....శ్రీ కృష్ణావతారం........ 

(శ్రీకృష్ణాష్టమి రోజు నాటికి ఆయనకిష్టమైన అష్టమ సంఖ్యలో కవితాసుమాలను  సమర్పించుకుందామనే   ప్రయత్నంలో...
 మొదటి కవితను సమర్పిస్తున్నాను మీ ముందు...@శ్రీ )

36 comments:

  1. అష్టమి శుభలగ్నాన కృష్ణ మూర్తి
    చెరసాలలో వెలసాడు విష్ణుమూర్తి...

    శ్రీ గారు,
    మనిద్దరికీ ఒకటే ఆలోచన వచ్చింది.
    నేను రోజు కోకటి అనుకున్నా...!!

    మీ ప్రయత్నానికి నా పూర్తి సహకారం ఇలా....
    చాలా బాగుంది అండీ..
    ఇలాగే రాస్తూ ఉండండి...
    ఓం శ్రీ కృష్ణ..:))
    ఆయన ఆశీస్సులు సదా మీ వెంట ఉండుగాక ....!!
    పాట భావం కుడా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. సీత గారూ!
      ఎందుకో మొదటి కామెంట్ ఈసారి మీనుంచే వస్తుందనుకున్నాను...
      కృష్ణుడి కవిత కదా అందుకని...:-)
      నేను మొదట అలాగే అనుకున్నాను...
      ఈ అష్టమి నుంచి వచ్చే అష్టమి దాకా అయితే బాగుంటుందని..
      మొదలు పెట్టాను...
      మీ చక్కటి స్పందనకి బోలెడు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  2. మీ మొదటి కవితాసుమం బాగుంది. చక్కగా ఉంది. చిత్రం కూడా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెన్నెలగారూ!
      కవిత, పాట, చిత్రం నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  3. ayyababooy meeru ila elaa vrastunnaru andi.... sri gaaru meeru maaku paricheyam kaavatam mee kaviatalu chadavagalatam ma adrustamu andi

    ReplyDelete
    Replies
    1. అంత లేదు లెండి ప్రిన్స్...అది మీ అభిమానం..
      చాలా సంతోషం..
      కవిత నచ్చినందుకు ధన్యవాదాలు మీకు
      @శ్రీ

      Delete
  4. మీ ప్రయత్నం సదా ప్రశంసనీయం . ముందస్తుగా అభినందనలు. విజయవంతంగా మంచి కవిత్వంతో.. ఆ నందనందుడిని కీర్తించాలని ఆశిస్తూ.. ఆ వనమాలీ ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ..
    కానీ ఒక చిన్న సవరణ శ్రీ కృష్ణాష్టమి.. శ్రావణ బహుళ అష్టమి కదా!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజ గారూ!
      నా తప్పు సవరించినందుకు...
      నాకు మీరిస్తున్న ప్రోత్సాహానికి...
      కవిత మీరు మెచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  5. కృష్ణం వందే జగద్గురుం ...@కృష్ణప్రియ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ ప్రియ గారూ!
      నమో కృష్ణ ! నమో కృష్ణ!
      @శ్రీ

      Delete
  6. best of luck sree garu, keep writing,
    17 days to go. kavitha chaduvvuthu krisnaastami ee roje anukunnanu,
    advanced happy krishnastami. good work.

    ReplyDelete
    Replies
    1. కృష్ణాష్టమి వచ్చే నెల 9 న అవుతుంది...
      ముందస్తు శుభాకాంక్షలకి..
      ధన్యవాదాలు భాస్కర్ గారూ!
      @శ్రీ

      Delete
  7. మీ మొదటి కవితా సుమం తో పాటు, పాట కూడా చాలా బాగుంది శ్రీ గారు..!!

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతం నా బ్లాగ్ కి...
      గన్నుతో వచ్చారో...పెన్నుతో వచ్చారో...
      అని చూస్తున్నాను...:-)
      మీ అభినందనలకి ధన్యవాదాలు హర్ష గారూ!
      @శ్రీ

      Delete
    2. గన్ను తో వచ్చినా మీరు పెన్ను పట్టేలా చేసారు శ్రీ గారు, ఇక్కడ :)
      పాట మరీ నచ్చేసింది నాకు :)

      Delete
    3. హహాహ..
      నిజం చెప్పొద్దూ!
      పాట వెతకడానికి చాలా శ్రమ పడ్డాను...
      ధన్యవాదాలు హర్షా! మీరు పెన్ను పట్టినందుకు...:-))
      @శ్రీ

      Delete
  8. పాట ఇప్పుడే విన్నానండి.
    చాలా బాగుంది.....సుశీల గారేనా పాడింది?

    ReplyDelete
    Replies
    1. అవును వెన్నెల గారూ!
      సుశీల గారు పాడినదేనండి
      @శ్రీ

      Delete
  9. "శ్రీకృష్ణాష్టమి" పుట్టినరోజు సందర్భంగా కృష్ణయ్యకి మీరిస్తున్న కానుక చాలా బాగుందండీ..
    కవిత, పాట చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారూ!
      మీ ప్రశంసకి...
      పాట ఎంపిక మీకు నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  10. ఏమండొయ్ శ్రీ గారు,
    మంచి పని.
    శుభారంభమూనూ...!!
    చక్క గా ఉంది:)

    ReplyDelete
    Replies
    1. ఆరంభం శుభం ఆన్నారు కాబట్టి
      నిర్విఘ్నంగా పని పరిసమాప్తి అయిపోతుందన్నమాట!:-)
      ధన్యవాదాలు 123 గారూ!
      @శ్రీ

      Delete
  11. మంచి ప్రయత్నం శ్రీ గారు! మీ మెదటి కవితతో పాటు మంచి పాటను వినిపించినందుకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి..
      పాట ఎంపిక మీకు నచ్చినందుకు
      ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
      @శ్రీ

      Delete
  12. శ్రీ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం, కానీ ఓ కవయిత్రి గా నాకు తెలిసినది చెప్తాను. మీ కవితలలో మీరు ఎన్నుకొనే పదాల పొందిక , మీరు ఆ పదాలను కూర్చే శైలి అందంగా ఉంటుంది. ప్రతి పాదంలో కవితా సమయం ఉండేలా చూసుకొనే మీ నేర్పు పొగడదగినది.

    ReplyDelete
  13. మీ ప్రశంసకి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
    మీ లాంటి వారి పొగడ్తలు పొందగలిగానంటే
    నేను ఎంచుకునే పదాలదే ఆ గొప్పతనం
    భాష గొప్పతనం అంటానండి...
    @శ్రీ

    ReplyDelete
  14. "నల్లని పూర్ణచంద్రునికి
    నెలవంక అద్దినట్లుండే ...."
    చాలా చక్కగా రాశారు శ్రీ గారూ, మహావతారం శిశువుగా జన్మించి ఉదయించిన తరుణం...
    శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

    ReplyDelete
  15. ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!
    మీకు నా భావం నచ్చినందుకు...
    మీకు కూడా ముందస్తు శుభాకాంక్షలు...
    @శ్రీ

    ReplyDelete
  16. Nice Attempt. All the best.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫణి గారూ!
      మీరు కష్టేఫలె కి ఇచ్చిన కామెంట్లో చూసాను...
      మీ మాతామహులది ఖండవిల్లి అని...
      మా నాన్నగారు అక్కడే పుట్టి పెరిగారు..
      మీకు వీలయితే..
      rvsssrinivas666@gmail.com కి
      ఒక టెస్ట్ మెయిల్ పంపించండి...
      @శ్రీ

      Delete
  17. Replies
    1. thank you very much for your compliment aniket...
      @sri

      Delete
  18. అయ్యో. నేను చాలా లేటుగా చూసాను అండీ...
    చాలా చాలా బాగుంది శ్రీగారు.. మరిన్ని కుసుమాలకోసం ఎదురుచూస్తూ....
    --సాయి

    ReplyDelete
  19. ధన్యవాదాలు సాయీ!
    స్పందనకు,
    కవితా సుమం నచ్చినందుకు..
    @శ్రీ

    ReplyDelete
  20. విభిన్న మైన కవితాలోకం లోకి ప్రవేశించారు.కొనసాగించండి.మీ వర్ణన బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
      మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete