23/07/2012

బృందావనం
కోమలితో కోలాటాలు...
సరసిజతో సల్లాపాలు...
మందాకినితో మదన క్రీడలు...
జలజాక్షితో జలక్రీడలు...

పద్మాక్షితో పూబంతులాట...
పావనితో పాచికలాట...
వయ్యారితో ఒప్పులకుప్పలు...
చంద్రముఖితో చెమ్మచెక్కలు...

హాసినితో పరిహాసాలు..
దామినితో దాగుడుమూతలు...
ఊర్వశితో ఉయ్యాలాటలు 
గీతికతో గానలహరులు...
నందినితో నౌకా విహారాలు...
వనజతో వన విహారాలు...

ఓ లలన బుగ్గల సిగ్గులు చిదుముతూ ఒక చోట...
ఓ చంచల  చెంగు లాగుతూ వేరొక చోట...
ముద్దులు దొంగిలిస్తూ ఒకచోట...
ఆలింగన సుఖమిస్తూ మరొక చోట...
అలుక తీరుస్తూ ఒక చోట...
కొప్పున పూలచెండు పెడుతూ వేరొకచోట..

మాలినితో మణిమండపంలో...
సారణితో సైకత వేదికలపై...
కౌముదితో  క్రీడాపర్వతాలపై...
లహరితో లతా మండపాలపై...

ఇటు చూస్తే...కృష్ణుడు...
అటుచూస్తే కృష్ణుడు....
సర్వం కృష్ణ మయం..
బృందావనం... సరస సల్లాపాల కేళీవనం..
మురళీరవాల మోహన సంగీత మయం....

అందరికీ ఒక్కరు...ఒక్కరికీ అందరుగా కనిపించే దృశ్యం...
మాయలమారి మాయా వినోదం...
పదహారు వేలమంది కృష్ణుల సందర్శనం...
అపురూపం...అద్భుతం...అనిర్వచనీయం....28 comments:

 1. చాలా బాగుంది శ్రీ గారు!
  (పాట మార్చలేదు ఇంకా.. :)))

  ReplyDelete
  Replies
  1. మీకు కవిత నచ్చినందుకు
   ధన్యవాదాలు హర్షా!
   మార్చిన పాట వినేసే ఉంటారు...:-))
   @శ్రీ

   Delete
 2. మీ కవిత నిండా మన బ్లాగుల పేర్లే కనిపిస్తున్నట్లున్నాయ్, చక్కగా రాశారు, అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. కన్నయ్య చేసే చర్యలకి , ప్రాసతో పేర్లు వ్రాసేశాను అంతే.
   మీరేమో బ్లాగుల పేర్లంటారు..
   వాళ్ళ పేర్లు లేవని కొంత మంది యుద్ధం ప్రకటిస్తున్నారు..:-))
   ఎలా చెప్పండి...
   మీ అభినందనలకి, ప్రశంసకి ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   @శ్రీ

   Delete
 3. మీ కవిత చాలా చాలా బాగుందండీ! చదువుతుంటే దృశ్యం కళ్ళముందు కనిపిస్తోంది.
  మీ పద్ధతే నాకేం నచ్చలేదు :( శ్రీకృష్ణునికి ఆటలు వారితోనేనా? మాతో లేవా?
  మధురవాణి గారూ ఒకసారి రండి. మనిద్దరం దీనిని తీవ్రంగా ఖండిద్దాం.

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ!
   మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు...
   ముఖ్యమైన వాళ్ళ పేర్లు అష్ట భార్యల కవితలో బ్రాకెట్లో వ్రాద్దామని చిన్న ఆలోచన.
   అన్నట్లు రాధ మాధవుల కవిత కూడా ఉందండోయ్...:-)
   ఇద్దరి అప్లికేషన్స్ వచ్చాయి మరో ఆరు కావాలి...:-))...
   అందుకే ఈ కవితలో ఆ పేర్లు వ్రాయలేదు అంతే...:-))
   @శ్రీ

   Delete
 4. సర్వం కృష్ణ మయం.
  అయినవాడే అందరికి
  ఎవరికీ చెందని వాడు..
  అందరికి ఆనందం ఇచ్చేవాడు. ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం ని నింపేవాడు.
  కృష్ణ లీలల పరమార్ధం తెలుసుకుంటే ఆంతా ఆనందమయం.
  చాలా బాగుంది. సంతోషం . శ్రీ గారు. ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. నంద నంద గోపాలా..
   ఆనంద నంద గోపాలా...
   ఆనంద నంద యదునంద గోపాలా...
   అంతే వనజ గారూ!
   మీరన్నది నిజం...
   మీ ప్రశంసకి ధన్య వాదాలు మీకు..
   @శ్రీ

   Delete
 5. రసజ్ఞగారు,
  నేనూ ఖండించేశా.
  (అయినా మన బ్లాగులో వచ్చి మనతో ఆడతాడుగా, వదిలేద్దాం.)

  ReplyDelete
  Replies
  1. నా లక్ష్మితో నేను బృందావన విహారం చేయాలి గాని,
   ఆ క్రిష్ణయ్య ఎవరు??
   వ్రాసిందెవరు??
   అంటూ నాపైకి మీవారు యుద్ధానికి వస్తే నేనేమి చెయ్యాలి చెప్పండి???:-))
   (just kidding..:-)))...)
   మీ వ్యాఖ్యకి ధన్య వాదాలు లక్ష్మీదేవి గారూ!
   @శ్రీ

   Delete
 6. గోపికలతో జలకాలాటలు కడు రమణీయం ...కమనీయం...
  మీ నాలుగో కవిత ఎంతో మధురంగా...మనోహరంగా వుంది.

  ReplyDelete
  Replies
  1. తొలకరి జల్లులా ఉంది మీ వ్యాఖ్య నాగేంద్ర గారూ!
   ధన్యవాదాలు కవిత, చిత్రం మీకు నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 7. నల్లనయ్య లా మనం అందరికి అన్నీ అయి బతకాలి.

  ReplyDelete
  Replies
  1. అంతే శర్మ గారూ!
   అందరికీ అన్నీ అయి బ్రతికితేనే ఆ బ్రతుకుకి సార్థకత...
   ధన్యవాదాలు మీకు...
   @శ్రీ

   Delete
 8. అన్ని పనులు చేస్తూ అందరినీ అలా అలరించడం మన కృష్ణయ్య వల్లనే సాధ్యం...!!
  ఇలా కృష్ణకవితలు రాసి మదిని ఆనందింపచేయడం మీ వల్లనే
  సాధ్యం .!!
  సూపర్ అండీ :)
  జై శ్రీ కృష్ణ

  ReplyDelete
  Replies
  1. సీత గారు కవిత ఇంకా చూడలేదేమిటా అనుకుంటున్నాను...:-)
   ధన్యవాదాలు చక్కని మీ ప్రశంసకి...:-)
   నా సంకల్పానికి అక్షర రూపం యివ్వడం కన్నయ్య దీవెనలతోనే సాధ్యమౌతోంది..
   @శ్రీ

   Delete
 9. చాలా బాగుంది... శ్రీ గారు...
  ధ్యాంక్యూ pics సూపర్ గా ఉన్నాయి..

  ReplyDelete
  Replies
  1. కవిత, చిత్రాలు నచ్చినందుకు
   ధన్యవాదాలు సాయీ!
   @శ్రీ

   Delete
 10. శ్రీ గారూ, కవిత రాయటం అందరు కవులూ చేస్తారు . కానీ దాన్ని ఓ యజ్ఞంగా తీసుకొని, భక్తిగా, రాయటం కొందరికే సాద్యం, భాహుసా ఆ కొందరిలో మీరు ఒకరు కావచ్చు.కవితల్లో భక్తి ని మన మిత్రులంతా పొగిడారు. చిత్రాలు చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా రాయండి. మీ పదాల అల్లిక బాగుంది

  ReplyDelete
  Replies
  1. మీ విశ్లేషణకి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
   మీ ప్రోత్సాహం నాకు కొత్తవి వ్రాసేందుకు బాటలు వేస్తోంది..
   @శ్రీ

   Delete
 11. శ్రీ గారూ,
  వరుసగా 'కృష్ణ' 'శ్రీ' కవితలు భలే రాస్తున్నారు, మంచి గానంలా ఆలపించటానికి తగ్గట్టుగా ఉన్నాయనిపిస్తుంది. రాగం కట్టటం వచ్చి ఉంటే వెంటనే ఆపనిలో ఉండేవాళ్ళం అనిపించింది. చాలా బాగుంది. బొమ్మల్లో కృష్ణున్ని భామాకలాపాలు చక్కగా చిత్రించారు చిత్రకారులు.
  సరసిజ అంటే ఏంటా అని ఎంత ఆలోచించినా అర్ధం బోధపడలేదు.

  ReplyDelete
 12. శ్రీ కృష్ణుని సందర్శనమేమో కానీ మీ కవితా దర్శనం తో అందరికి అలా జలకాలాడాలని కోరికలు కలుగుతున్నాయి.ఎంత మధురమైన అనుభవం.చాలా బాగా వ్రాసారు.

  ReplyDelete
  Replies
  1. రవి శేఖర్ గారూ!
   ధన్యవాదాలు మీ ప్రశంసకి...
   కన్నయ్య ఆశీస్సులతో నీ ఆయన లీలలలు మీ అందరితో పంచుకోవాలనే
   నా చిన్న ప్రయత్నాన్ని బ్లాగ్ మిత్రులంతా ప్రోత్సహిస్తున్నారు..
   క్రిష్ణయ్యలా జలకాలాటలు ఆడండి...కాని ఒక్కరితోనే సుమా!...:-))
   @శ్రీ

   Delete
 13. ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!
  మీకు కవితలు నచ్చినందుకు...
  హృదయపూర్వకమైన మీ ప్రశంసకి...
  చిత్రాలలో కొన్ని నేను సేకరించినవి.
  మరికొన్ని వెన్నెల గారు krishna mukunda muraari ppt లోవి
  నేను చూసి రిక్వెస్ట్ చేస్తే నాకు పంపించారు..
  'సరసిజ' ఆంటే సరస్సు నుండి పుట్టినది..(కమల..నీరజ..పద్మ...వగైరా)
  శృంగార భావం కావాలనుకుంటే సరసం నుంచి పుట్టినదని కూడా అనుకోవచ్చు...:-)
  @శ్రీ

  ReplyDelete
 14. శ్రీ గారు, కృష్ణయ్య మీద కవితలన్ని చాలా బాగున్నాయండి.
  ఈ కవిత చాలా బాగుంది. భాస్కర్ గారు చెప్పింది నిజం. మరి నా బ్లాగ్ పేరు, భాస్కర్ గారి బ్లాగ్ పేర్లు ఏవి , చెప్పండి? :))
  పాట చక్కగా ఉంది.. కవిత అంతకంటే బాగుంది. మీకు అభినందనలు.

  ReplyDelete
 15. ధన్యవాదాలు వెన్నెల ప్రసరించినందుకు...:-)
  మీరు చూడకుండా అభాండాలు వేస్తున్నారు.
  'జలతారు వెన్నెల' లోనే కదండీ జలక్రీడలు...:-)
  'చెట్టు' నీడలో, చెట్ల చాటునే కదా రాసలీలలు..(THE TREE)...:-)
  పాట ఎంపిక, కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
  @శ్రీ

  ReplyDelete
 16. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ"
  అంటూ కన్నయ్య బృందావనంలో ఆటలాడేస్తున్నాడన్నమాట..
  బాగున్నాయండీ కృష్ణలీలలు!!కవిత చాలా బాగుంది.

  ReplyDelete
 17. కన్నయ్య బృందావన లీలలు మీకు నచ్చినందుకు,
  కవితని మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు రాజి గారు...
  @శ్రీ

  ReplyDelete