31/08/2012

అదే...అదే...అదే...



రవి కిరణం...
ముకుళించిన 
అరవిందాన్ని
వెచ్చగా స్పృశిస్తూ...
చెప్పేది...

చల్లని వెన్నెల... 
కొలను లోని 
కలువబాలను 
మెత్తగా తాకుతూ...
రహస్యంగా 
చెప్పేది....

నదీనదాలు... 
తమ వయ్యారపు  
వంపుసొంపులు 
చూపుతూ...
తమ ప్రియుని చేరే వేళ 
గలగలలాడుతూ 
చెప్పేది...

నురుగుల తరగ...
వడి వడి నడకలతో
ఉత్తేజంగా కదులుతూ 
తీరాన్ని తాకుతూ
చెప్పేది...

కరిమబ్బు...
మెరుపు తీగల 
వెలుగులతో 
నిశను ఝల్లున తాకుతూ
చెప్పేది...

పరిమళ భరిత
మకరందాన్ని గ్రోలుతూ
మత్తెక్కిన భ్రమరం..
విరికన్యకు తీయగా 
చెప్పేది...

ఆర్తిగా నోరు తెరిచిన
ముత్యపు చిప్పలో 
జారుతూ... ముత్యమయ్యే 
స్వాతి చినుకు చెప్పేది....

అనుక్షణం...
నా మనసు నీ మనసుకు 
చెప్పేది...
అదే....అదే...అదే..














32 comments:

  1. ఎన్నో పోలికలతో ,చక్కగా కవితను చెక్కేసారండి, అదే,అదే, అదే అంటూ....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారూ!
      ఆత్మీయమైన మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete
  2. కవిత చాలా బాగుందండి శ్రీ గారు..కాని సస్పెన్స్ ఇంకా కొన సాగుతూనె ఉంది.
    అదే అదే! ఏది?

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ!
      మీ ప్రశంసకి చాలా ధన్యవాదాలు...:-)
      అదే... అదే... అంటే...అదే మరి....:-))
      @శ్రీ

      Delete
  3. శ్రీనివాస్ గారు,
    అందరి పేర్లు చెప్పారు కానీ కడలి పేరు చెప్పకుండా సూచించి విడిచి పెట్టినారు.
    బాగుంది. మనసూ మనసూ కలిసే వారి వివరాలన్నీ చెప్పేస్తిరి.
    ఈ పోస్ట్ లో సమస్య లేదు. కానీ మీరందరూ అంతగా మెచ్చిన వెన్నెల వీడియో మాత్రం నేను చూడలేకపో్యినాను. పోనియ్యండి.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ దేవి గారూ!
      మీరే చెప్పారు మనసు మనసు కలిసే వారి వివరాలు చెప్పానని.
      అన్ని చెప్పాక ఆఖరున మళ్ళీ చెప్పాలంటారా???..:-))
      మీకు రెండు లింక్స్ ఇస్తున్నాను..
      ఇవి you tube links..
      http://youtu.be/aprytRU0VOE
      http://youtu.be/fUA-kQ7kg3o
      ఒకటి వెన్నెల వీడియో
      రెండవది రాదా కృష్ణుల వీడియో
      ఇపుడు కూడా మీకు ఇబ్బంది వస్తే..
      మీ సిస్టం లో వేరే సమస్య ఉందేమో చూడండి...
      మీ ప్రశంసకి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  4. శ్రీ గారు..అదే అదే ..నేను కోరుకున్నదీ.. అనలేదా మీరు!? నేను నమ్మలేదండీ! :) :)

    ReplyDelete
    Replies
    1. అన్నీ తెలిసిన వారు...
      మీరు కూడా అలా అడిగేస్తే ఎలా చెప్పండి వనజ గారూ!:-))
      ధన్యవాదాలు మీ సరదా స్పందనకు...
      @శ్రీ

      Delete
  5. శ్రీ గారూ, రెండక్షరాల బంధాన్ని ఇన్నివిదాలుగా చెప్పటం ఎంత భావుకత కదా.
    ప్రతి పదాన్నీ అందంగా తీర్చిదిద్దారు మీ కవితలో, ముఖ్యంగా ముత్యపు చిప్పలో పడే స్వాతి చినుకు గూర్చి.
    అందమైన భావాలను చక్కటి భాషతో అలవోకగా పలికారు.......మెరాజ్.

    ReplyDelete
    Replies
    1. నా పద ప్రయోగం నచ్చినందుకు
      కవితను మెచ్చినందుకు
      ధన్యవాదాలు మెరాజ్ గారూ!
      @శ్రీ

      Delete
  6. అదే....నాలో ఉన్నది!
    అదే....మీలో దాగింది!
    అదే....అందరూ కోరేది!
    అదే మీరు రాసింది....
    అందుకే చాలాబాగున్నది.

    ReplyDelete
    Replies
    1. అదే అందరికి నచ్చేది..
      అదే అందరూ మెచ్చేది..
      అందరిలో ఉండేది...
      అందరికీ కావాల్సినది...
      అదే...అదే...అదే...:-)...:-)
      మీ ప్రశంసకి
      ధన్యవాదాలు పద్మ గారూ!

      Delete
  7. చక్కని పోలికలతో, మనసుని కట్టిపడేసే కవితాభావం. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ!
      నా కవితాభావం..
      మీ మనసుకి నచ్చినందుకు
      చాలా ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  8. బాగుందండీ! ఇంతకీ ఏంటది? నాకేమీ అర్థం కాలేదు సుమీ :)
    ఉదయకిరణాల నులువెచ్చని కౌగిలింతలో కరిగిపోయే మంచుగడ్డ చెప్పేది అదే అదే .... అదేనంటారా?

    ReplyDelete
    Replies
    1. నవరసభరితమైన రసజ్ఞకి అందని భావమా అది?
      ఎంత మాట...ఎంత మాట...:-))
      మీరన్న భావం అయితే...
      "కరిగి పోయాను కర్పూర వీణలా
      కలిసిపోయాను నీ వంశధారలా."...
      ఈ పాట పెట్టాల్సి వచ్చేది...
      ధన్యవాదాలు మీ రసజ్ఞమైన స్పందనకు...
      @శ్రీ

      Delete
  9. అందరు అది ఏదో చెప్పకుండా ఎవరికీ వారు అదే అనుకుంటూ భలే వ్రాసారండి.మీ కవిత విభిన్నం గా వుంది.మంచి ప్రయోగాలు .ఇంకా చెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. రవి శేఖర్ గారూ!
      మీ స్నేహ పూర్వకమైన స్పందనకు
      ప్రోత్సాహానికి
      ధన్యవాదాలు...
      వాళ్ళందరూ అదే... అదే... అదే... అనుకున్నది
      మీకు మాత్రం చెప్పేస్తున్నా...
      ఈ లింక్ చూసేయండి...
      http://www.memrise.com/set/10012714/i-love-you-in-100-languages/?page=1&limit=100
      :-)).(just kidding)
      @శ్రీ

      Delete
  10. "శ్రీ" గారూ..
    అదే... అదే... అదే... రాముడు భీముడు పాట గుర్తుకొచ్చింది...
    కానీ మీ కవితకి ఆ పాట కంటే మీరు సెలెక్ట్ చేసిన పాటే బాగుంది సున్నితంగా..
    మొత్తానికి ఒక మంచి భావాన్ని వందభాషల్లో చెప్పేశారన్నమాట :)
    చాలా బాగుంది కవిత..

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!
      అవును మీరు (వనజ గారు కూడా) చెప్పిన పాట కూడా బాగుంటుంది.
      వంద భాషల లింక్ క్లిక్ చేసేసారన్న మాట...:-))
      మీ ప్రశంసకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  11. 'అదె 'రమణీయ ప్రకృతి హృదంతర నర్తితభావ దీప్తి - అ
    య్యదె ప్రియురాలు ప్రేమికుడు హాయికి హాయిగ తీయు దారి - అ
    య్యదె పరమాత్మ కాత్మకు సమాగమ సిధ్ధి లభించు యోగ - మ
    య్యదె మన 'శ్రీ 'కలమ్మున మహాధ్బుత దృశ్యము గీచి చూపెడిన్ .

    ReplyDelete
    Replies
    1. హృదయాంతరంగాన నాట్యమాడే భావ దీప్తులను
      దాచగాలమా??? చెప్పండి...
      మీ ప్రశంసా పూర్వకమైన పద్యం చాలా బాగుంది
      రాజా రావు గారూ!
      ధన్యవాదాలు మీకు.
      @శ్రీ

      Delete
  12. "అదే..అదే..అదే.." అంటూ బ్లాగర్ల మెదడుకు పని కల్పించారు.
    చాలా బాగా రాసారు . అభినందనలు శ్రీనివాస్ గారు!

    ReplyDelete
  13. నాగేంద్ర గారూ!
    నా కవితా భావం నచ్చినందుకు ధన్యవాదాలు మీకు...
    బ్లాగర్ల మెదడుకు పని అంటారా?
    అందరికీ తెలిసే నన్ను ఆట పట్టిస్తున్నారని మీకూ తెలిసి పోయి ఉంటుంది...:-))
    @శ్రీ

    ReplyDelete
  14. అందరికీ తెలిసిన విషయం మరియు అవసరమైనది అదే అదే అని నాకు తెలిసిపోయిందిలెండి:) కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ!
      అంతా అదే...అదే..అదే.. ఏమిటి అన్నారు...
      మీరు మాత్రం
      తెలిసిపోయింది అన్నారు...:-)
      మీ ప్రశంసకి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  15. చిన్ని చిన్ని పదాలతో చక్కగా ఉందండి మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. యోహంత్ గారూ!
      నా కవితలో పదాలు మీకు నచ్చినందుకు,
      మీ ప్రశంసకి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  16. Sorry,
    meeku intha Popularity Craze ani telidu.
    But better publish this comment,
    that beginners should be committed to write
    poetry, not for the crave for the Popularity,
    Still, If U are committed,
    then this comment shall be published.

    If U have any queries Plz. don't hesitate to write to
    dearsridhar@gmail.com

    ReplyDelete
    Replies
    1. dear sridhar,
      meerevaro teliyadu naaku
      nenu vraasevanne naa aanandam kosam vraasukuntunnaanu.
      evari blog lonaina kotta vishayam (technical gaa) chooste adopt chesukuntaanu...
      alaage nenu chesinadi verevarainaa anukariste,
      adi evarikainaa nachchite santoshapadataanu...
      lekunte okka spandana lekapoyinaa nenemee anukonu...
      naavi kavitala? kada? annavi naake teliyadu....
      nenu 30 yella kritam vraasukunnavi,ipudu nenu vraasina vaatilo
      o 40 daakaa unnaayi...
      popularity kaavaalanukunte raadande...
      ee populaarity vishayam prakkanai pedadam kaasepu...
      naaku ee blog valla chaalaa mandi snehitulayyaaru...
      vaari blogs choodatam, naaku nachchinadi cheppadam santoshakaramaina vishayam...
      naa blog naa bhaavaalanu choope diary laantidi..nenu naa bhaavaalu vraasukuntunnaanu...
      nenu naa bhaavaalu akshara roopam lo mari kontakaalam vraaya galugutaanemo..tarvaata naaku nachchina blogs lo naa spandana teliyajestoo...vaaru vraasevi chadivi aanandistaanu..
      ide vishayaanni meeku mail chesaanu...
      reply mail cheste ikkada charchani akkada konasaagiddaamu...
      adala unchite...meeku na blog swagatam palukutondi sreedhar gaaroo!
      mee mansuki tochinatlugaa meeru spandinchaaru..
      dhanyavaadaalu...
      @sri

      Delete
  17. శ్రీ గారు చాలా భాలా బాగుంది మీ కవిత

    ReplyDelete
  18. ధన్యవాదాలు డేవిడ్ గారూ!
    నా కవిత మీరు మెచ్చినందుకు...
    నా బ్లాగ్ కి స్వాగతం...
    @శ్రీ

    ReplyDelete