24/08/2012

చంద్ర హాసాల "చంద్ర హాసాలు".వెన్నెల రాత్రుల చిత్రాలు ఇక్కడ ఈ వీడియోలో  చూడండి.

వెన్నెల 

క్షీర సాగరాన్ని
చిలికితే వచ్చిన వెన్న గోళం చిమ్మే 
దివ్య కాంతి పుంజాలు...

రజనీకాంతకు శశికాంతుడు పంపిన 
వెలుగు జిలుగుల 
పాల నురుగుల  జలతారు వలువలు...

ప్రకృతి కన్నె  కప్పుకున్న చీకటి వస్త్రంపై 
వెండి కుంచెతో నెలరాజు 
  వ్రాసుకున్న ప్రేమ లేఖలు...

తారా శశాంకుల సరసాల సయ్యాటలలో 
  విసురుకున్న పారిజాతపు రేకుల తుఫానులు...

నీలి అంబరాన విరిసిన రజత కమలం 
వెదజల్లే శ్వేత ప్రభలు...

పగలంతా తాపంతో,
రాత్రి విరహ తాపంతో...
వేగి వేడెక్కిన 
నిశా సుందరిని చల్లబరిచే
  సోముని శీతల సుధా చంద్రికలు...

చంద్రుని చాటు చేసుకొని 
ప్రేమికులపై కాముడు  సంధించే ధవళ  శృంగార అస్త్రాలు 

నీవు నాచెంత  ఉన్నపుడు నను ముంచెత్తే 
నీ ప్రేమ వెలుగుల పరవళ్ళు...

ఒంటరిగా  నేనున్నపుడు... నన్ను వెంటాడి వేటాడే 
వెండి వేట కొడవళ్ళు.....
గాయం కనపడకుండా  'నా మనసుని' 
కోసే చంద్ర హాసాల "చంద్ర హాసాలు".
ఇది నా 100వ టపా...
వంద టపాలు వ్రాయటం  కొంతమంది బ్లాగర్స్ కి  మంచినీళ్ళ ప్రాయం.
కానీ ఆ సంఖ్య  క్రికెట్లో ఎంత ప్రాముఖ్యమైనదో మనకి తెలుసు.
అందుకని ఈ వంద సంఖ్యని అందుకున్నందుకు..
నాకు చాలా సంతోషంగా ఉందండీ!
నా సంతోషాన్ని నా బ్లాగ్ మిత్రబృందంతో  పంచుకుంటున్నాను...
నా 101 వ టపా చూడటం మర్చిపోవద్దు...
@మీ మిత్రుడు 'శ్రీ' 
56 comments:

 1. శ్రీ గారూ, మొదటగా మీ కవిత గూర్చి చెప్పాలి. నిజంగా అది వెన్నెల సోయగమే.
  మంచి పదాలతో వెన్నెలలో వెన్నముద్దల తీపిదనం రుచిని మరపించింది.
  ఇకపోతే మీరన్నట్లు వంద కవితలు అందరూ రాయగలరు.
  మీలా ప్రతి కవితని తీర్చి దిద్దటం అందరికీ సాద్యం కాదేమో....మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మెరాజ్ గారూ!
   మీరు స్నేహపూర్వకంగా ఇచ్చిన ఈ
   చల్లని వెన్నెల లాంటి ప్రశంసకి,
   మీ స్పందనకు ధన్యవాదములు.
   @శ్రీ

   Delete
  2. Really a mesmorizing message by RV. Keep going.. to reach the crest in writing poetry in such a dramatic way.

   Delete
  3. rajarao gaaroo!
   thanks a lot for your encouraging compliment.
   your message also mesmarised me..:-)..
   thanks again..
   @sri

   Delete
 2. హమ్మయ్య.....ఎప్పటినుండో వెయిటింగ్
  మీ సెంచురీ సెలెబ్రెషన్స్ ఎప్పుడా అని...
  కంగ్రాట్స్ శ్రీగారు....పార్టీ ఇవ్వరా?:-):-)

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ!
   इन्तेजार का फल मीठा होता है..
   అంటారు కదా...:-))
   ధన్యవాదాలు మీ స్పందనకు...
   పార్టీ అంటారా...
   http://www.google.co.in/imgres?num=10&hl=en&biw=1024&bih=643&tbm=isch&tbnid=81khANXZtYWzBM:&imgrefurl=http://www.devyantra.com/bhandara/index.html&imgurl=http://www.devyantra.com/bhandara/images/266475-chappan-bhog-at-govindas-restaurant.JPG&w=448&h=332&ei=ePk4UIPgNMzHrQeizoHIBw&zoom=1&iact=hc&vpx=98&vpy=56&dur=2910&hovh=193&hovw=261&tx=152&ty=101&sig=101776912242126755413&sqi=2&page=1&tbnh=136&tbnw=176&start=0&ndsp=15&ved=1t:429,r:10,s:0,i:102 .....
   ప్రస్తుతానికి మీకోసం ఇలా ...:-))
   @శ్రీ

   Delete
 3. Replies
  1. thank u very much yohanth....
   hearty welcome to my blog...
   please visit again...
   @శ్రీ

   Delete
 4. అందమైన పదాలతో అద్భుతమైన కవితలల్లి వంద పూర్తిచేసినందుకు ముందుగా మీకు అభినందనలు.

  ఈ కవితలో ఏది బావుందో చెప్పండం కష్టం. వెన్నెల సోయగం మధురంగా వుంది.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ!
   మీ అభినందనలకి ,
   వెన్నెల సోయగం నచ్చినందుకు,
   నా కవితని మెచ్చినందుకు,
   మనః పూర్వకమైన ధన్యవాదాలు.
   @శ్రీ

   Delete
 5. అద్భుతంగా వ్రాశారండీ! వంద పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు! ఇలానే వందలు వేలై, వేలు లక్షలై, ఎన్నో కవితల టపాలు మీ నుంచీ రావాలని ఆశిస్తూ...

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ!
   మీ శుభాభినందనలు అందుకున్నాను...
   మీ ప్రశంసకి,
   మీ ప్రోత్సాహానికి..
   హృదయపూర్వకంగా ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 6. శతమానం భవతి, శతమనంతంభవతి,

  ReplyDelete
  Replies
  1. శర్మగారూ!
   మీ బ్లాగ్ లో కూడా నాకు అందించిన అభినందనలు చూసాను...
   మీవంటి పెద్దవారినుంచి ఆశీస్సులు పొందటం నా అదృష్టం...
   మీకు నమస్సుమాంజలి...
   @శ్రీ

   Delete
 7. శ్రీ గారు,
  ఎంత బాగా వ్రాశారండీ, చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. మీరసలు బ్లాగులో మాత్రమే కాక ఇంకా ఏమైనా రచనలు చేస్తుంటారా? కొంచెంచెప్పరూ, చేయకపోతే ఇకమీదట తప్పకుండా రచనలు చేయాలండి.
  ఇది సేవ్ చేసి దాచుకోవాల్సిన కవితండీ. చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీ దేవి గారూ!
   మొదట మీకు చాలా చాలా........చాలా ధన్యవాదాలు...:-)
   పద్యాలు...సమస్యాపూరణలు అవలీలగా వ్రాసే మీరు
   నా కవితని మెచ్చుకోవటం గొప్ప విషయం నాకు.
   చదువుకొనే రోజుల్లో వ్యాసాలు, పద్యాలు, కవితలు వ్రాసాను..
   మళ్ళీ ఇప్పుడు ఇలా బ్లాగ్ లో మాత్రం వ్రాస్తున్నాను...
   హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు...
   @శ్రీ

   Delete
 8. మీకు అభినందనలు.
  మీరు మరెన్నో చక్కటి టపాలను అందించాలని కోరుకుంటున్నానండి.

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకి ధన్యవాదాలు anrd గారూ!
   మీ వంటి మిత్రుల ప్రోత్సాహం ముందుకి నడిపిస్తుందని ఆశిస్తున్నాను...
   @శ్రీ

   Delete
 9. మీ కవితకు శతాధిక వందనాలు
  వీడియో + చిత్రాలు బాగున్నాయి
  అనతి కాలంలోనే శతకం సాధించారు
  కృష్ణ,విష్ణుప్రియ,ప్రత్యూష,హర్షిత్

  ReplyDelete
  Replies
  1. కృష్ణ,ప్రియ,ప్రత్యు,హర్షిత్...
   మీకందరికీ శతాధిక ధన్యవాదాలు...
   చిత్రాలు ,వీడియో ,కవిత నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 10. Replies
  1. అనికేత గారూ!
   మీ అభినందనలకు..
   నా ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 11. సర్, ఓ చిన్న సందేహం "మనసుని కోసే చంద్ర హాసాల చంద్రహాసాలు."అన్నారు ,ఈ చంద్ర హాసం అనేది ఖడ్గమా?
  వివరించగలరు... మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మెరాజ్ గారూ!
   చంద్రహాసాల "చంద్రహాసాలు"...
   చంద్రహాసమంటే... చంద్రుని నవ్వులు.
   చంద్రహాసమంటే..ఖడ్గం..(రావణుని ఖడ్గం పేరు కూడా చంద్రహాసమే)
   చంద్రుని నవ్వుల లాంటి వాడి ఖడ్గాలు ..
   లేక...
   వాడి ఖడ్గాల వంటి చంద్రుని నవ్వులు...
   ఇలా రెండు రకాలుగా తీసుకోవచ్చు...
   @శ్రీ

   Delete
 12. వెన్నెల సోయగాన్ని వీడియోలో చూపించారు...
  వెన్నెల కన్న హాయిని పాటలో వినిపించారు...
  మధురమైన పదాలతో అల్లిన అద్భుతమైన కవితతో మెప్పించారు...
  వంద టపాలు పూర్తిచేసిన మీకు వంద అభినందనలు !
  ఇలాంటి వందలు మరెన్నో మీ కలం నుండి జాలువారాలని
  మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ!
   మీ ప్రశంసలకి "మీ బ్లాగ్ పేరే "నా బ్లాగ్ లో కురిసినట్లుంది...
   మీ వంద అభినందనలకు...శతాధిక ధన్యవాదాలు...
   ప్రతి కవితకి వెన్ను తట్టి ప్రశంసించే మీ సహృదయానికి
   మరో సారి హృదయపూర్వక ధన్యవాదాలు..
   @శ్రీ

   Delete
 13. మీ నూరవ టపాతో మొదటి సెంచరీ సాధించినందుకు హృద్యపూర్వక చంద్రహారతులు శ్రీ గారూ..
  ఇకపై వేగం పుంజుకొని వెయ్యో టపాను ఉగాది నాటికి చూడొచ్చునని ఆశతో...
  శుభాబినందనలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నా...

  ReplyDelete
  Replies
  1. వెన్నెల దారి నుంచి వచ్చిన చల్లని చంద్రహారతుల వంటి ప్రశంసకి
   మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను వర్మ గారూ!
   మీ ప్రోత్సాహం నాచే మరిన్ని రచనలు చేయిస్తుందని అనుకుంటున్నాను...
   @శ్రీ

   Delete
 14. శ్రీ గారు 100 టపాలు పూర్తి చేసిన శుభ సందర్భాన మీకు అభినందనలు మీ కవిత వెన్నెలంత హాయిగా చల్లగా అందంగా ఉంది మీ ఈ కవిత ప్రయాణం అనంతంగా సాగి పోవాలని ఆకాంక్షిస్తూ .......:-)

  ReplyDelete
  Replies
  1. రమేష్ గారూ!..
   నా బ్లాగ్ కి స్వాగతం...
   మీ అభినందనలకి...
   మీ ప్రశంసకి,
   మీ ప్రోత్సాహానికి...
   హృదయపూర్వకమైన ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 15. మీ టపాలు 100 ను చేరిన సంతోష సమయంలో మీకు శుభాభినందనాలు video ఇంకా మీ కవిత చాలా బాగున్నాయి పవర్ కట్ పుణ్యమా అని అప్పుడప్పుడూ వెన్నెలను దర్శించే భాగ్యం కొందరికైనా దక్కుతోంది మీ కవిత చదువుతుంటే పవర్ ఉంది కూడా ఆ భాగ్యాన్ని పొందవచ్చు అనిపిస్తోంది...:-)

  ReplyDelete
  Replies
  1. వీణ గారూ!
   మీ శుభాభినందనలకు నా ధన్యవాదాలు...
   మీరు కవితలో వెన్నెలను చూడ గలిగారంటే...
   వెన్నెల గురించి నేను చెప్పడంలో సఫలీకృతుడను అయినట్లే...:-)
   ఇంతకంటే ప్రశంస ఏమి కావాలి?
   మరోసారి ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 16. congrats dad for your century.
  video chala bagundi.
  pictures bagunnayi.
  --sindhuja.

  ReplyDelete
 17. thank you very much sindhu...
  for your congrats
  and
  for your compliments.
  @sri

  ReplyDelete
 18. వేగవంతమైన సెంచురీ నే కాకుండా నాణ్యమైన వంద.. ప్రతి పరుగు కూడా అద్బుతం.
  సచిన్ వంద సెంచురీలకు (వంద వందలు కి) ఇస్పాట్ పెట్టేయండి.
  అభినందనలు శ్రీ గారు!


  ReplyDelete
  Replies

  1. హర్ష వీక్షణానికి... నా 'కవితల రాశి'లో 'వాసి' కనపడితే...:-)
   మరి నాకు ఇంతకంటే ప్రశంస ఏమి కావాలి?
   ధన్యవాదాలు హర్షా!
   మీ స్పందనకి,ప్రశంసకి...
   @శ్రీ

   Delete
 19. చాలా అద్భుతంగా వ్రాసారండి. మీ వందవ కవితలో శరత్ వెన్నెల వెలుగులనే కురిపించారు. మీకు శతాధిక అభి'వందనములు'.

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ!
   ధన్యవాదాలు మీ ప్రశంసల జల్లుకి.
   మీ అభివందనాలకు
   నా శతాధిక అభివాదాలు.
   @శ్రీ

   Delete
 20. వావ్ సెంచరీ.. కొట్టేసారు.... సూపర్..
  వీడియో కూడా సూపర్..

  Waiting for next post...

  ReplyDelete
  Replies
  1. సూపర్ సాయి ప్రశంసకి...
   వీడియో నచ్చినందుకు..
   సూపర్ ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 21. అభినందనలు, వంద టపాల క్లబ్ కు స్వాగతం.
  మరన్నీ చక్కని కవితలతో బ్లాగుల లోకంలో చందమామలా వెలగాలని ఆశిస్తూ,

  ReplyDelete
  Replies
  1. నా కవితలో వెన్నెల ఉంటే..
   మీ స్పందనలో ఆ వెన్నెల చల్లదనం ఉంది...
   మీ ప్రశంసకి..
   మీ అభినందనలకి ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   @శ్రీ

   Delete
 22. Replies
  1. welcome to my blog.
   thank you very much anupama gaaroo!
   @శ్రీ

   Delete
 23. "శ్రీ" గారూ..
  కొంచెం ఆలస్యంగా చెప్తున్నాను.
  వంద టపాలు పూర్తి చేసినందుకు అభినందనలండీ..
  మీ మనసున మల్లెలను మరెన్నో అక్షర నక్షత్రాలుగా మార్చి
  మాకందించాలని కోరుకుంటున్నాను..
  మీ కవిత, వీడియో చాలా బాగున్నాయి..
  అభినందనలు!!

  ReplyDelete
 24. రాజి గారూ!
  మీ అభినందనాక్షర మాలలు
  నా బ్లాగ్ లో పరిమళించాయి..
  మీ అభినందనలకి కృతఙ్ఞతలు..
  మీ ప్రశంసకి
  ధన్యవాదాలు...
  @శ్రీ

  ReplyDelete
 25. ప్రకృతి కన్నె కప్పుకున్న చీకటి వస్త్రంపై
  వెండి కుంచెతో నెలరాజు
  వ్రాసుకున్న ప్రేమ లేఖలు...మంచి కవితా ప్రయోగం.మిగతా వాక్యాలు కూడా దేనికవే బాగున్నాయి.100 వ కవితలో మీ కవితా విశ్వరూపం చూపించారు.పదాల తో పదనిసలు పలికించారు.మీకు అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. రవి శేఖర్ గారూ!
   మీ ప్రశంస అపురూపమైనది.
   మీకు నా పదాల అల్లిక నచ్చినందుకు...
   మీరిచ్చిన అభినందనలకు...
   మనః పూర్వకమైన ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 26. వీడియో అద్భుతం.ఎలా చేసారండి.

  ReplyDelete
  Replies
  1. windows live movie maker
   లో చేసానండి.
   అందులో మీరు స్టిల్ పిక్చర్స్ ని మీకు నచ్చిన మ్యూజిక్ తో embeded చేసుకోవచ్చు
   మీకు you tube లో tutorial link ఇస్తున్నాను
   http://www.youtube.com/watch?v=PkB728qb8os&feature=share&list=PLA7C3D46A2D608B67
   ఇంకా వేరే softwares ఉన్నాయిగానీ ...ఇది చాలా సులువుగా అయిపోతుంది ..
   తర్వాత google id తో you tube లో login అయి upload చేసుకోవచ్చు ..
   లేదంటే
   మీరు చేసిన వీడియో ని
   http://www.divshare.com/ లో కూడా upload చేసుకోవచ్చు ( అందులో sign up అయ్యాక )
   ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే..rvsssrinivas666@gmail.com కి mail చెయ్యండి ..
   @శ్రీ

   Delete
 27. అలశ్యం గా స్పందిస్తున్నందుకు మన్నించాలి. చాలా బాగున్నాయి కవిత మరియు మీ వీడీయో.Nice work! Congrats. Not an easy task to complete 100 posts. And you did it! :))

  ReplyDelete
  Replies
  1. ప్రశంసా పూర్వకమైన మీ స్పందనకు,
   అభినందనలకు ధన్యవాదాలు వెన్నెల గారూ!..:-)
   @శ్రీ

   Delete
 28. శ్రీనివాస్ గారు అందరి మనసులని దోచే మణిమాణిక్యాలు లాంటి ..వంద పోస్ట్లు వ్రాసి.. మీదైన ముద్రతో...బ్లాగర్లని అలరించినందుకు.. మనసైన అభినందనలు.
  మీరు ఇలాంటి వందలు ఇంకా ఎన్నెన్నో వ్రాసి.. అచ్చు తెనుగు నుడికారములతో.. కవితామాలికలు అల్లి..అందరిని అలరించాలని మనసారా కోరుకుంటూ ...హృదయపూర్వక శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ!
   హృదయపూర్వకమైన మీ ప్రశంస..
   నా మదిని ఆనందపు జల్లులో తడిపింది...
   మీ అభినందనలకు...
   ప్రోత్సాహాన్నిచ్చే మీ స్పందనకు...
   మనః పూర్వకమైన ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 29. ఆలస్యంగా అందుకోండి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. సృజన గారూ!
   ఆలస్యంగా ఇచ్చినా అభినందనలు..అభినందనలే...
   నా ధన్యవాదాలు...ఆలస్యం చేయకుండా అందుకోండి మరి...:-)
   @శ్రీ

   Delete