09/08/2012

శృంగారార్చన???

                                 
                                         (నేను చేసిన ఈ వీడియో తిలకించండి.)
                                            
ఆసనం ఎందుకు?
    క్రీడాపర్వతం ఉండగా...
అర్ఘ్య పాద్యాలెందుకు?
    ఎదురుగా యమున ఉందిగా...

ధ్యానం వేరే యెందుకు?..
   ఎపుడూ నీ ధ్యానమేగా...
పుష్పం కావలెనా?
    నీ హృదయ కుసుమం ఉందిగా...

పత్రం ఎందుకు?
    శతపత్ర దళ నేత్రాలుండగా...
స్నానమెందుకు?
   నీ వలపుల జల్లు ఉందిగా...

అక్షతలెందుకు?
   క్షతం కాని నీ ప్రేమ ఉండగా...
చామరమెందుకు?
   నీ నీలి కురుల వింజామర ఉందిగా...

మధుర  గీతాలు వద్దు.. 
   నీ మాటల సంగీతాలే చాలు...
అగరు పొగలు వద్దు..
   విరహపు సెగలే చాలు... 

శ్రీ చందనాలు వద్దు...
   నీ మేని పరిమళమే  చాలు 
 పంచామృతాలు వద్దు...
   నీ  పెదవుల మధువులు చాలు...

నైవేద్యం వద్దు...
   నీ సాన్నిధ్యం చాలు...
ఘంటారావాలు వద్దు...
   నీ కాలి అందెల సవ్వడులే చాలు...

మంగళ తూర్యారావాలు వద్దు...
   నీ రతనాల మొలనూలు తాళమే మేలు..
నీరాజనం వద్దు... 
  నా రాధ హా'రతులు' చాలు......

స్వస్తి వాచకం వద్దు...
  క్రియల పునరావృతమే నీ మాధవునికి ముద్దు...

( శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా...అష్టమి నాటి జన్ముడు,
అష్ట భామల నాథుడు...అష్టైశ్వర్య ప్రదాత....అయిన 
ఆ దేవదేవునికి నేను అర్పించుకొనే అష్ట కవితా సుమార్పణంలో 
సహకరించి  ప్రోత్సహించిన బ్లాగ్ మిత్రులకి కృతఙ్ఞతలు సమర్పిస్తూ..
అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ...
ఈ కవితాసుమాంజలిని శృంగారమూర్తులైన రాధాకృష్ణులకు
నీరాజనంగా సమర్పించుకుంటున్న ' శ్రీ ' )

35 comments:

 1. chala bagundi

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం...
   మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారూ!
   ఈ రోజు శ్రీ కృష్ణ సుప్రభాతం వినండి నా బ్లాగ్ లో...
   శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 2. చాలా చాలా బాగుంది.. శ్రీనివాస్ గారు. అభినందనలు. మీ ప్రయత్నం సదా హర్షణీయం. చాలా చాలా బాగా ప్రజెంట్ చేసారు. రాధామనోహరం.. మనోహరంగా ఉంది.
  అన్నమయ్య చిత్రంలో పదహారు కళల తో.. మెదిలింది.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ!
   ఇలాంటి స్నేహపూర్వకమైన ప్రశంసలు
   మరింత బాగా వ్రాసేందుకు ప్రోత్సాహానిస్తాయి...
   మనః పూర్వకమైన ధన్యవాదాలు...
   శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 3. కవిత బాగుంది, వీడియో బాగుంది, పాట బాగుంది, సమయానికి తగినది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శర్మ గారూ!
   కవిత, వీడియో పాట అన్నీ నచ్చినందుకు...
   ఈ రోజు శ్రీకృష్ణ సుప్రభాతం వినండి నా బ్లాగ్ లో...
   శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 4. ' శ్రీ ' గారూ..
  "అష్ట కవితా సుమార్పణం" తో కన్నయ్యకు మీరందించిన "కవితాసుమాంజలి" చాలా గొప్పది..

  మీరు చేసిన వీడియో,చిత్రాలు,నీరాజనంగా మీరెంచుకున్న పాట
  అన్నీ చాలా బాగున్నాయి..

  మీకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

  ReplyDelete
  Replies
  1. రాజి గారూ!
   మీకు బోలెడు ధన్యవాదాలు అన్నీ మీకు నచ్చినందుకు.
   మీ బ్లాగ్ లో జయజనార్ధనే...ఆ పాట విన్న దగ్గర్నుంచీ
   మా పాప నిన్న ఓ పది సార్లు మీ బ్లాగ్ ఓపెన్ చేయించి
   కామెంట్ పెట్టేసి...
   పాట యు ట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయించుకొని ఎడిట్ చేసి రింగ్ తోనే పెట్టుకుంది..:-)
   మీకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
  2. "శ్రీ" గారూ... ఇప్పుడే నా బ్లాగ్ లో మీ పాప కామెంట్ చూశాను .
   నా "భక్తిప్రపంచానికి" ఒక చిన్ని అభిమానిని పరిచయం చేసినందుకు థాంక్సండీ :)

   Delete
 5. అన్నీ మహాద్భుతంగా అమర్చారు అనడంకన్నా ఇంక వేరే పదమే దొరకడం లేదు. అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. మీలాంటి సీనియర్లు ఇలాంటి వ్యాఖ్య పెడితే..
   మరి అద్భుతమే...
   బోలెడు ధన్యవాదాలు పద్మ గారూ!
   శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో...
   @శ్రీ

   Delete
 6. శ్రీ గారూ, ముందుగా మీరు తలపెట్టిన ఈ కవితార్చన అందంగా ముగించినందుకు అబినందనలు.
  ఇకపోతే ఇక్కడ ఓ ఫీలింగ్ అదేమిటంటే మనం మనకు తెలీకుండానే ఏదో ఒక విషయానికి అలవాటుపడటం జరుగుతుంది.
  అదే జరిగింది మీ కవితల ప్రసారంలో, ప్రతి రోజూ ఈ సారి కృష్ణుడు ఏ కొంటె పని చేసాడో .
  ఏ అల్లరి చేష్టలు ఉన్నాయో అని మీ బ్లాగ్ చూడటం అలవాటు అయిపొయింది. మిమ్మల్ని ప్రశంసించటానికి మాటలు (రాతలు) లేవు.
  కవిత రాయటములో మీరు ఎంచుకున్న పదాలు, పెట్టిన చిత్రాలు, పాటలు, చూస్తె మీరు ఎంత యజ్ఞంలా భావించారో కదా అనిపిస్తుంది. భహుశా మీకు ఆ దేవుని అండ దండలు ఉంది ఉంటాయి. సర్, ఇదంతా నేను ముఖస్తుతికి రాయటం లేదు. మీ కవితా శక్తి అటువంటిది, చివరగా ఓ మనవి ఇంతే శ్రర్ధతో మరో కావ్యానికి శ్రీకారం చుట్టగలరని ఆశిస్తూ...ప్రోత్సహిస్తూ..

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ!
   మీ సునిశిత పరిశీలన, విశ్లేషణ., ఆత్మీయమైన ప్రోత్సాహం
   తప్పక మరో అంశంపై వ్రాసే ప్రేరణనిస్తుంది...
   బోలెడు ధన్యవాదాలు మీకు.
   శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో...
   @శ్రీ

   Delete
 7. "శ్రీ "- షోడశోపచార వి
  శేష కవిత - ' రాధ ప్రేమ కృష్ణుని కిన్ ,
  కేశవుని ప్రేమ రాధకు '
  భూషణమై యలరె - అష్ట పుష్ప ధామమై .
  -----సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. షోడశోపచారాల శృంగార భావం మీకు నచ్చినందుకు
   బోలెడు ధన్యవాదాలు రాజారావు గారూ!
   మీ పద్యాలన్నీ భద్రంగా దాచుకుంటున్నాను...
   అష్ట కవితలను అష్ట సుమ ధామంగా పోల్చారు..
   శ్రీ కృష్ణాష్టమి నాడు నమస్సుమాంజలితో...@శ్రీ

   Delete
 8. మొత్తం అన్ని కవితల్లో నేను గమనించిన అంశం ఏమిటంటే మీరు కవితల్లో ఉపయోగించే పదాలపై మీకున్న పట్టు అద్భుతం.కొనసాగించండి మీ కవితా హారతి . .

  ReplyDelete
  Replies
  1. రవి శేఖర్ గారూ!
   మీ ప్రశంసకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు....
   మీ ప్రోత్సాహంతో ముందుకి వెడుతున్నా...
   శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాభినందనలతో...
   @శ్రీ

   Delete
 9. శ్రీ గారు.... సూపర్..షోడశోపచారములు చాలా చక్కగా వర్ణించారు..

  ఆ వీడియోలో వాడిన pics ఇంకా సూపర్ అండీ..

  కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

  ReplyDelete
  Replies
  1. సాయీ!చాలా ధన్యవాదాలు.
   సూపర్ గా ఇస్తావయ్యా వ్యాఖ్య...:-)
   షోడశోపచారాల శృంగారాన్వయం నచ్చిందన్నమాట..:-)
   వీడియో..కవిత నచ్చినందుకు...
   ఆ నల్లనయ్య ఆశీస్సులతో విద్యాభివృద్ధి కలగాలని కోరుతూ...
   @శ్రీ

   Delete
 10. జూలై 10 వ తేదిన 'శ్రీకృష్ణజననం'తో మొదలైన మీ అష్ట కవితా సుమాలు నేడు 'శ్రీకృష్ణాష్టమి' పర్వదినాన
  విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందనలు శ్రీనివాస్ గారు! మీకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!!

  ReplyDelete
  Replies
  1. మీరు తేదీతో సహా గుర్తుంచుకున్నారు నాగేంద్ర గారూ!
   మీ అందరి ప్రోత్సాహమే అన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చేసింది...
   మీ అభినందనలకు చాలా ధన్యవాదాలు...
   ఆ నందనందనుని ఆశీస్సులు సదా మీపై వర్షించాలని కోరుకొంటూ...
   @శ్రీ

   Delete
 11. శ్రీ గారు
  మీ కుటుంబం పై ఆ కృష్ణమూర్తి కృప సదా కురవాలని కోరుకుంటున్నాను...!!
  చాలా చాలా బాగున్నాయి ఆ వీడియో +కవిత..
  కృష్ణాష్టమి శుభాకాంక్షలు...:-)

  ReplyDelete
  Replies
  1. సీత గారూ!
   మీకు కవిత వీడియో నచ్చినందుకు...
   చాలా చాలా ధన్యవాదాలు...:-)
   మీ విద్యాభివృద్ధికి ఆ క్రిష్ణయ్యను ప్రార్ధిస్తూ...@శ్రీ

   Delete
 12. మీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించి, విజయవంతంగా ముగించినందుకు అభినందనలు, చక్కని కవిత, కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. మిత్రుల ప్రోత్సాహంతోనే
   మరింత ఉత్సాహంతో వ్రాయగలిగాను భాస్కర్ గారూ!
   ధన్యవాదాలు మీ ప్రశంసకి.. అభినందనలకి...
   మీకు కూడా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 13. శ్రీ గారూ, మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. మీకు కూడా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
   ఫాతిమా గారూ!
   @శ్రీ

   Delete
 14. మీ కవిత చదివి చాల రోజులయింది
  మీ అష్టమ కవిత కోసం ఎదురు చూస్తూ ......krishnapriya

  ReplyDelete
 15. ప్రియ గారూ!
  మీరు గమనించాలి...
  ఇదే ఎనిమిదో కవిత...:-)
  ధన్యవాదాలు మీకు...
  శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...
  @శ్రీ

  ReplyDelete
 16. Excellent!
  Meeru maamulu manishi kadandoy,
  Chaalaa bagundi Sree garu :)

  ReplyDelete
  Replies
  1. చాలా హర్షంగా ఉంది హర్షా!
   మీ ప్రశంసకి...
   బోలెడు ధన్యవాదాలు మీకు..
   @శ్రీ

   Delete
 17. శ్రీకృష్ణ జననం, యశోద మనస్సు, వెన్న చుక్కనే అద్దాలి నీకు...., బృందావనం, ఏమిటి నీ గొప్ప కృష్ణ, భామ!సత్యభామ, రాధామోహనం, శృంగారార్చన .........మీ అష్టకవితా పుష్పార్చన లో కృష్ణుడే కాదు, మేమంతా పులకించిపోయాం. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండి.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకి నేనుకూడా పులకించిపోయానండి.
   అన్ని కవితలు సమయం వెచ్చించి చదివినందుకు
   మనఃపూర్వకమైన ధన్యవాదాలు సమర్పిస్తున్నాను...
   మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 18. చక్కటి కృష్ణ కవితకు హృదయపూర్వక అభినందనలు,గోకులాష్టమి శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకి ధన్యవాదాలు మోహన్ గారూ!
   మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete