06/09/2012

తనువే...తాంబూలంతమలపాకు... నీ అరచేతి కోమలంతో  పోటీ పడింది...
మౌక్తికం... నీ ముక్కెరకి నేనే సరిజోడు అంది...
కస్తూరి... నీ నుదుట తిలకమై వెలిగింది...

యాలకుల  సుగంధం...
నీ శ్వాసలో ఒదిగింది...
జవ్వాది... 
నీ యవ్వనంలో అమరింది...
పోకచెక్క... 
నీ నాభిలో చక్కగా ఇమిడింది...
కర్పూరం...
నీ అందానికి నీరాజనమంది...
తాంబూలపు పంట...
నీ పెదవిపై మెరిసింది...

బొటనవేలి  చిలుక - బాహులతలతో అల్లుకుంది...
చూపుడువేలి చిలుక - చనువు తీసుకొమ్మంది...
మధ్యవేలి చిలుక - మధ్య గాలిని చొరనీయనంది...
ఉంగరపువేలి చిలుక - నాతో ఉండిపొమ్మంది...
చిటికెనవేలి చిలుక - సిగ్గులొలికిస్తూ...
    'ఇకచాలు' అనే మాటే లేదంది...
(ఈ రోజు ఎవరి బ్లాగ్ లోనో  ఈ చిత్రం చూసి అల్లిన భావమాలిక....@శ్రీ)

44 comments:

 1. Replies
  1. అంటే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ సిలబస్ అని అర్థం :)))

   Delete
  2. అంతే..అంతేలే...ఇపుడు చదువు సిలబస్ ముఖ్యం...:-))
   ధన్యవాదాలు హర్షా!
   @శ్రీ

   Delete
  3. :):) నేను కూడా హర్ష గారి దారిలోనే.....

   Delete
  4. అయితే నా ప్రతిస్పందన కూడా అదే దారిలో ఉంది...:-))
   ధన్యవాదాలు రసజ్ఞ గారూ!..:-)
   @శ్రీ

   Delete
 2. అది అందించే జవరాలి జాణతం కదండీ:)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనికేత్ గారూ!
   అవును మరి..
   ఇలా అందించే జవరాలి జాణతనం చూస్తేనేగా...
   అలాంటి భావాలు పుట్టుకొచ్చేవి!...:-)
   @శ్రీ

   Delete
 3. భామచేతి కిళ్ళీ మీ కవితావేశంతో కలిసి చక్కగా పండింది:-)

  ReplyDelete
  Replies
  1. అక్షరాల పంట మీకు నచ్చినందుకు,
   కవితా భావాన్ని ఆస్వాదించిన మీకు
   ధన్యవాదాలు పద్మ గారూ!..:-)
   @శ్రీ

   Delete
 4. చిత్రం, పాట, ఇంకా పసందుగా మీ కవిత అన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి శ్రీ గారు.
  బాగుందండి కవిత

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ!
   అన్నీ నచ్చి, మీరు మెచ్చినందుకు
   చాల ధన్యవాదాలు మీకు..
   @శ్రీ

   Delete
 5. కిల్లీ తో కలగలసిన మీ కవిత బాగుంది శ్రీ గారు...అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. మొదట నా బ్లాగ్ కి స్వాగతం సురేష్ గారూ!
   వసంతం లాంటి స్పందనతో ఆనందింపజేసారు..:-)
   ధన్యవాదాలు మీకు.
   @శ్రీ

   Delete

 6. Wow!!!
  Maguve kadaa magavaaniki Madhura bhavana.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ!
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...
   మీరలా అన్నాక మరేమంటాను చెప్పండి..:-)
   @శ్రీ

   Delete
 7. శ్రీ గారూ, కవిత చాలా బాగుంది.
  అందమైన పదాలన్నీ నిఘంటువు వదలి మీ కవితలో దాగిపోతున్నాయి.
  అతిశయోక్తి కాదు, ఒక కవితలో వాడిన పదం మరోసారి ఉపయోగించకుండా అన్ని కవితలనూ రాసారు.
  ముఖ్యంగా మీరిచ్చే వ్యాఖ్యలు కూడా అర్ధవంతంగా, సంస్కారవంతంగా ఉంటాయి.
  సర్, ఒక కవిగా మీరు ముందుకెళ్లాలి అందుకోసం కొంత కష్టపడాలి, విమర్శను స్వీకరించే మీ సంస్కారం అభినందనీయం.
  ఇకపోతే చిత్రం చూసి కవిత రాయటం ఓ గొప్ప కళ......మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మెరాజ్ గారూ!
   మీ అభిమాన పూర్వకమైన స్పందనకు...
   మీ ప్రశంసకు..
   మీ సూచనకు
   ధన్యవాదాలు..అభివాదాలు..
   @శ్రీ

   Delete
 8. శ్రీ గారూ..

  "ఏమొకో చిగురుటధరమున - ఎడనెడ కస్తూరి నిండెను
  భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా"

  అంటూ అన్నమాచార్యుడు వెంకటేశ్వరస్వామికి సమర్పించిన సంకీర్తన లాగా
  మీరు ఈ చిత్రానికి రాసిన కవిత కూడా బాగుందండీ...

  ReplyDelete
  Replies
  1. రాజి గారూ!
   నేను వ్రాసిన తర్వాత పాటకోసం వెదికితే
   మొదట మనసులోనికి వచ్చింది ఈ కీర్తనే...
   అన్నమాచార్యుల కీర్తన కదా అని వేరే పాటని వెదుక్కున్నాను
   ధన్యవాదాలు మీ చక్కని ప్రశంసకు..
   @శ్రీ

   Delete
 9. కేవలము సినీ తార నూహించి నట్లు
  చిత్రమును జూసి యల్లిన మాత్ర మైన
  మెచ్చెదము గాని - సీతమ్మ మీద నగుట
  నెందుకో నాకు మనసులో కుందు గలిగె .
  ----- సుజన-సృజన

  ReplyDelete
 10. రాజా రావు గారూ!
  సినీ తార మీద కాదు...
  నా మనో తారమీద అల్లిన కవిత...:-))
  చిత్రం ఒక భావానికి రూపునిచ్చింది...
  అది నా ప్రణయినిపై కవితగా ప్రాణం పోసుకుంది...
  సీతమ్మ మాయమ్మ....(మా అమ్మగారి పేరు సీతారామం)
  మీ ప్రతిస్పందన కోరుతూ... శ్రీ

  ReplyDelete
 11. పాత్ర ధారి ఎవరైనా -
  చిత్రము సీతమ్మపాత్రది -
  అందుకే -
  నా కలా అనిపించింది .
  ----- సుజన-సృజన

  ReplyDelete
 12. రాజారావు గారూ!
  నేను శ్రీరామరాజ్యం
  అనకుండా కేవలం చిత్రం అని ఉండాల్సింది...
  ధన్యవాదాలు మీ ప్రతిస్పందనకు...
  @శ్రీ

  ReplyDelete
 13. తనువు గంధాలూ, తాంబూలం సుగంధాలతో పండించిన కవితా పంట
  బాగా పండించారు శ్రీ గారూ!

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశ గారూ!
   మీ ప్రశంస నాకు పరిమళాల పంట.
   ధన్యవాదాలు మీకు ...
   @శ్రీ

   Delete
 14. పోకచెక్క... నీ నాభిలో చక్కగా ఇమిడింది...
  If Raghavendra Rao BA sees this, he will apply o(i)n his next heroine's belly button. :) Nice.

  ReplyDelete
  Replies
  1. thanks phaneendra gaaroo!
   for your nice compliment.:-)
   but ,for him (raghavendra rao)
   this is not a new thing...:-))
   @శ్రీ

   Delete
 15. Excellent....adirindi...raasalila vela paata kuuda baagundi..! ilaya raaja stylea vearu kada..!!!

  ReplyDelete
  Replies
  1. స్వాగతం నా బ్లాగ్ కి.
   కవిత, పాట మీరు మెచ్చినందుకు...
   చాలా ధన్యవాదాలు మూర్తి గారూ!
   అవునండీ!
   పాత పాటల తర్వాత..
   నేను అభిమానించే సంగీతదర్శకుడాయన...
   ఆయన మనకు అందించిన గీతాలు...
   మరొకరు ఇవ్వలేరేమోనని అనిపిస్తుంది...
   మీ భద్రాద్రి ఎక్ష్ప్రెస్స్ ను మా బ్లాగ్ ప్లాట్ ఫారం మీదికి
   తీసుకొస్తూ ఉండండి...:-)
   @శ్రీ

   Delete
 16. మీ బ్లాగు ఇప్పటికి కరుణించింది. బాగుంది భావం

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ!
   నా బ్లాగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు
   క్షమించాలి...:-)
   ధన్యవాదాలు..అభివాదాలు
   మీకు కవితలోని భావం నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
  2. sharma gaari aasheerwaadam podatam adrustame

   Delete
  3. అవును మెరాజ్ గారూ!
   వారి ఆశీర్వాదం మరిన్ని భావాలను...
   మాలలుగా కూర్చేందుకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది...
   @శ్రీ

   Delete
 17. తాతగారిలాగే నాక్కూడా మీ బ్లాగు ఓపెన్ కావడం లేదండీ.. మొజిల్లా లో ఐతే ఓపెన్ అవుతోంది. లేకుంటే లేదు. ఒకసారి ఇదేదో కాస్త చూడండీ..

  ReplyDelete
 18. సుభ గారూ!
  స్వాగతం నా బ్లాగ్ కి...
  నేను internet explorer, google chrome, mozila, safari
  అన్నింటిలోనూ, వేరే సిస్టమ్స్ లో కూడా చెక్ చేసాను...
  ఓపెన్ అవుతోంది...
  కొంతమందికి ఎందుకు ప్రాబ్లం వస్తోందో తెలియడం లేదు...
  అది సర్వర్ ప్రాబ్లం అనుకుంటున్నాను...
  @శ్రీ

  ReplyDelete
 19. మీ కవితల్లో పదాలే కాదు భావాలు కూడా పరిమలిస్తాయి 'శ్రీ' గారు!
  మీ బ్లాగ్ ఓపెన్ చేయడానికి రోజు కుస్తీ పడుతున్నారు. ఎందుకనో ఓపెన్ కావడం లేదు. ఈ రోజు మొజిల్లా ఓపెన్ చేసి మీ కవిత చదివాను.

  ReplyDelete
 20. కే.రాఘవేంద్ర రావు గారిని గుర్తుకు తెచ్చారు.ఆయనేమో తీస్తారు.మీరు వ్రాస్తారు.చాలాబాగుంది.

  ReplyDelete
  Replies
  1. :-))...రవిశేఖర్ గారూ!
   ఉన్నట్టుండి అలా అనేసారేమిటి సార్..:-))...:-))
   మీ ప్రశంసాపూర్వకమైన స్పందనకు చాలా ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 21. నాగేంద్ర గారూ!
  అలా ఎందుకౌతోందో...
  నేను పోస్ట్ చేసిన వాటిల్లోనుంచి వీడియోస్ తీసేసి వాటికి బదులు
  నేను అప్ లోడ్ చేసిన యు ట్యూబ్ లింక్స్ పెడతాను...
  అపుడు ఒకవేళ సరి అవుతుందేమో...
  ధన్యవాదాలు మీరిచ్చిన 'సుగంధాల స్పందన'కు...
  నా బ్లాగ్ పెట్టిన ఇబ్బందిని నా ప్రతిస్పందన చూసి మర్చిపోవాలి మీరు...:-)
  @శ్రీ

  ReplyDelete
 22. చక్కగా రాశారండి, అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   చక్కని మీ ప్రశంసకి, మీ అభినందనలకి...
   @శ్రీ

   Delete
 23. ముఖపుస్తకపు మనోహరి...చాలా బావుందండీ..
  మీ మనో భావాలన్నీ...చక్కగా తెలిపారు అన్ని కవితల్లొ...

  తనువే తాంబులం అధిరి పొయింది ఇక అన్నీ చుస్తున్నాను మళ్ళి కలుస్తా...

  ReplyDelete
 24. సూపర్ చాల బాగుంది

  ReplyDelete