విరిసినమల్లెలు
నీ నీలికురులకు అందం...
విడిన
కొప్పు నా ముఖాన్ని కప్పితే ఆనందం...
నల్లని కాటుక నీ వాలు కన్నులకు అందం...
ఆ చూపుల గాలానికి నా మనసు
చిక్కుకుంటే ఆనందం...
ఎర్ర గులాబి రంగు నీ పెదవులకు అందం...
ఆ
పెదవులు పదే పదే నా నామమే స్మరిస్తే ఆనందం...
నల్లని అంచు నీ తెల్లని చీరెకు అందం....
ఆ కొంగున
ముడిపడి నీతో ఉంటే ఆనందం...
నున్నని బుగ్గల ఎర్రని సిగ్గుల కెంపులు నీకు అందం...
ఆ
సిగ్గుల మొగ్గలు నా చెక్కిలిపై విచ్చుకుంటే ఆనందం...
తెల్లని పట్టీలు నీ అందాల పాదాలకు అందం...
వాటి
మువ్వల సవ్వడులు నా చెవులకు ఆనందం...
నందన వనమున సైతం...అందని 'అందం' నీ 'అందం'...
ఆ అందము
పొందిన డెందము పొందెను
అమితానందం....@శ్రీ
నందన వనమున సైతం...అందని 'అందం' నీ 'అందం'...
ReplyDeleteఅబ్బా.. చాలా బాగున్నాయి ఆ లైన్లు....
--సాయి
నీ ప్రశంసకు బోలెడు ధన్యవాదాలు సాయి...
Deleteచాలా రోజులకి దర్శనం....:-)
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
nice pic and very very beautiful poetry
ReplyDeleteమీ ప్రశంసకు ధన్యవాదాలు రమేష్ గారూ!
Deleteమీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
నల్లని అంచు నీ తెల్లని చీరెకు అందం....
ReplyDeleteఆ కొంగున ముడిపడి నీతో ఉంటే ఆనందం...
ide kadaa prathi stree korukonedi tana naadudu konguna kattubadi undaalani. mee prathi kavitalo manichi bhaavukatha untundi.
కొంగున ముడి పడి ఉండటం వరకే నండోయ్...
Deleteకొంగున కట్టుకుని చుట్తో తిప్పుకుంటే కష్టమండోయ్...:-)
ధన్యవాదాలు మెరాజ్ గారూ! మీ ప్రశంసకు, ప్రోత్సాహానికి.
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
sree garu, kavithalo edo maarpu kanipistundi aksharaalu andamgaa unnaayi bhaava prabhaavamaa?
ReplyDeletebapu fonts (సుగుణ) లో పోస్ట్ చేసాను....
Deleteభావాల వలన అక్షరాలు అందంగా కనిపిస్తే చాలా సంతోషం @శ్రీ
తెలుగు భాషలోని తీయటి పదాలతో అల్లిన కవిత అమితానందంగా వుంది.
ReplyDeleteఈ కవితలో పదాలు అలరించాయి... భావాలు పరిమళించాయి.
పరిమళ భరితమైన మీ ప్రశంస నా కవితను సుగంధ భరితం చేసింది
నాగేంద్ర గారూ!...ధన్యవాదాలు మీకు...@శ్రీ
అందమే అమితానందమంటూ...
ReplyDeleteకవిత పాట రెండూ బాగున్నాయండీ..
ధన్యవాదాలు రాజి గారూ!...
Deleteకవితాభావం, ఎంచుకున్న పాత మీకు నచ్చినందుకు...
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
శ్రీ గారు వర్ణన..భావం రెండు బాగున్నాయి.
ReplyDeleteమీ కవితలు అన్నీ ఒకదానిని మించి ఒకటి ఉంటున్నాయండి.
ప్రతి టపాకీ ప్రోత్సాహాన్నిస్తూ
Deleteచేసే స్నేహపూర్వకమైన ప్రశంసకు
ధన్యవాదాలు వనజ గారూ!...
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
అందం ఆనందం అంటూ మా డెందమును ఊగించారండి.చక్కని కవిత్వం.అద్భుత మైన చిత్రం.బాపు గారిదనుకుంటా!
ReplyDeleteమీ మదిని ఆనందపరచిన నా కవితను
Deleteప్రశంసించిన మీకు ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
చిత్రం వడ్డది పాపయ్య గారిది...
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
హ హా...బాగుందండీ కవిత.
ReplyDeleteఅందము పొందిన డెందము....అన్నారు... ఇది చదివి డెందము పొందెను అమితానందం ;)
మీ ఉల్లమునకు ఉల్లాసాన్నిచ్చిన కవితను
Deleteమీరు ప్రశంసించినందుకు ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ! :-)
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
ఎంతవారుగానీ.....వేదాంతులైనగానీ
ReplyDeleteవాలుచూపు సోకగానే తేలిపోదురు:-)
ఇంతందమైతే....అమితానందమే కదా!
అలా అన్నా, ఎంతవారలైన కాంత దాసులే అన్నా..:-)
Deleteనిజంగా దాసులయ్యేది భౌతికమైన అందం
వెనుక దాగిన మనసు అందానికే కదా పద్మ గారూ!:-)
మీ స్పందనకు ధన్యవాదాలు...
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ
enta baagaa varninchaaru baavundi paata kudaa:)
ReplyDeleteకవితాభావం నచ్చినందుకు ,
ReplyDeleteఎంచుకున్న పాట మెచ్చినందుకు
ధన్యవాదాలు మంజు గారూ!...@శ్రీ
బొమ్మలోని అందాన్ని కవితలో ఆస్వాదించేలా బాగారాసారు.
ReplyDeleteనా భావాలు సమర్పించిన తీరు మీరు మెచ్చినందుకు
Deleteధన్యవాదాలు సృజన గారూ!...@శ్రీ
Sree garu sernnavaraatrulu meeku mee kuntunbaaniki subam tevaali
ReplyDeleteధన్యవాదాలు మెరాజ్ గారూ!...
ReplyDeleteమీకందరికీ ఆ అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ...@శ్రీ
pic mee kavita rendu bagunnayandi.
ReplyDeleteఎంచుకున్న చిత్రం ,
Deleteకవిత నచ్చినందుకు
ధన్యవాదాలు అనికేత్ గారూ !...@శ్రీ
మీరు రాసే అక్షరాలు మనసుకి ఎంతో అనుభూతిని కలిగిస్తున్నాయి....ధన్యవాదాలు....
ReplyDeleteధన్యవాదాలు మీకు... 😊🙏
Deleteమనస్సుమతికొచ్చినట్లు గతానుభుతులు మదిలో కలవారమాయె.
ReplyDeleteధన్యవాదాలండీ😊🙏
Delete