05/04/2012

భయంతో.....


మనసు పొరల్లో నిక్షిప్తమైన 
నీ జ్ఞాపకాలను తీసి వేద్దామని 
నా గుండె గదుల తలుపులు తెరుస్తుంటాను.

తెరిచిన ప్రతిసారీ,
నీ స్మృతులు....
నన్ను ప్రేమగా పలకరిస్తాయి,
నావైపు సజల నయనాలతో చూస్తాయి,
మృదువుగా నా మనసుని స్పృశిస్తాయి,
ప్రేమ కుసుమాలతో నన్ను అర్చిస్తాయి.వెంటనే మూసేస్తాను ఆ తలుపుల్ని.
...............
నీ తీపి జ్ఞాపకాలు....
బైటికెళ్లి పోతాయనే భయంతో,
నాకు.... దూరమైపోతాయన్న దిగులుతో....6 comments:

 1. sir ilaanti kavithalu koncham penchi raayandi, inka inka bhavaanni visadeekarinchandi

  ReplyDelete
 2. ఫాతిమా గారూ!
  ధన్యవాదాలు మీ సూచనకి.
  ఆ కవితలు మొదట్లో వ్రాసినవి...
  అంటే ఓ రెండు దశాబ్దాల క్రితం వ్రాసుకున్నవి...
  బ్లాగ్ మిత్రుల కవితలు చదువుతూ...
  ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ అక్షరాలు
  పేర్చుకుంటూ పోతున్నానిప్పుడు...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. sir, meeru aksharaalu nerchukovatam emiti chaalaa baagaa raastaaru, ayite oke rakamainavi kaaka koncham maarchi raayani, mee kavithallo mee srerda kanipisthundi, o kramasikshana,

   Delete
  2. ఫాతిమా గారూ!
   ధన్యవాదాలు...
   సీనియర్ల సూచన పాటిస్తాను తప్పకుండా...
   @శ్రీ

   Delete