20/04/2012

వెన్నెల వర్షం



వెన్నెల వర్షంలోని  ప్రతి చినుకు
నను తాకి...ఆవిరౌతుంటే.....

సుగంధభరిత శీతల పవనాలు  
నను తాకి వేసవి వడగాడ్పులౌతుంటే...

గంధపు పూత సైతం 
నా తనువుని  తాకి  పొడిపొడిగా రాలి పోతుంటే....

నీ ప్రేమామృత వర్షమే నను చల్లబరచాలి...
నీ ప్రణయ పవనమే  నా తాపాన్ని తగ్గించాలి...
నీ మేని పరిమళమే  నాకు హరిచందనమవ్వాలి ....                    @శ్రీ 






8 comments:

  1. ఈ కవిత నా బ్లాగ్ లో భలేగా ఇమిడిపోతుందండి...
    చాలా బాగుంది కవిత మరియు చిత్రం కూడా..వెన్నెల నాకు చాలా ఇష్ట్టం...

    ReplyDelete
  2. ధన్యవాదాలు వెన్నెల గారూ!
    మీ బ్లాగ్ లో ప్రొఫైల్ చిత్రం చూడగానే తెలుస్తుంది మీ ఇష్టం.
    వెన్నెల అంటే నెలరాజు కురిపించే అమృతవర్షం..
    ప్రతి ఒక్కరు తడవాలనే అనుకుంటారేమో ఆ చినుకుల్లో...
    :-)...@శ్రీ

    ReplyDelete
  3. ఎండ తాపం ఎక్కువగా ఉంది ..ఎలాగా అని సతమత మౌతుంటే
    మీ వెన్నెల వర్షం చినుకులుగా కురిసింది . మనసు తడిసింది
    శ్రీ గారు మీరే ..ఇంకా ఎదురు తెన్నులు లో ఉన్నట్టున్నారు
    మీకు 'హరిచందనం ''చేరువవ్వాలని కోరుకొంటున్నాను .
    .ఇంకొన్ని జల్లులు కురిపించండి

    ReplyDelete
  4. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారూ!
    మీలాంటి వారి ప్రోత్సాహంతో ముందు కెడుతున్నాను
    అవి కవితా చందనాలేనండోయ్...
    :-)...:-)...:-)....@శ్రీ.

    ReplyDelete
  5. ఎవరా కవితా లలామ ?
    భువిలో ప్రేమామృత ? ప్రణయ పవన ? మేనన్
    దవిలిన యరవిరి పరిమళ ?
    కవి 'శ్రీ' విరచిత మనోఙ్ఞ ? కమనీయ గదా !

    బ్లాగు సుజన-సృజన

    ReplyDelete
  6. ధన్యవాదాలు రాజారావు గారూ!
    నా కవితకి చేసే వ్యాఖ్యల కంటే,
    మీరు చేసిన వ్యాఖ్యానపు పద్యానికొచ్చే
    వ్యాఖ్యలే ఎక్కువుంటాయండీ...
    మీ వ్యాఖ్య చాలా బాగుందండీ....
    @శ్రీ

    ReplyDelete
  7. అద్భుతం...ఇంకా ఇంకా ఈ జల్లులు కురిపించ వచ్చు గా

    ReplyDelete
  8. అద్భుతం...ఇంకా ఇంకా ఈ జల్లులు కురిపించ వచ్చు గా

    ReplyDelete