26/04/2012

అలిగిన వేళ....


నీ చిరునవ్వుని.. నీలాంబరానికిచ్చేస్తే...
తన  సిగపాయలో, నెలవంకను 
చేసి ముడుచుకుంది........
 నీ కంటి మెరుపులను ... తారలకిచ్చేస్తే...
అవి విద్యుత్ ప్రభలతో
తళుకుమంటున్నాయి ...

నీ నడుము వంపుసొంపులను ...
నదులకిచ్చేస్తే...
అవి మరింత  వయ్యారంగా 
ప్రవహిస్తున్నాయి....


నీ  పెదవుల ఎరుపును....
తామరలకిచ్చేస్తే ..
అవి కెందామరలై  విరబూసాయి... 


నాకు చెప్పకుండా  అన్నీ అలా 
అందరికీ  ఇచ్చేయడమేనా???
అంటూ నీపై అలిగితే,
..........
"నాదగ్గర  నువ్వున్నావుగా!"
అంటూ నా ఎదపై వాలిపోతావు.
                                            @శ్రీ 14 comments:

 1. Replies
  1. ధన్యవాదాలు రావు గారూ!
   @శ్రీ

   Delete
 2. ధన్యవాదాలు...
  @శ్రీ

  ReplyDelete
 3. శ్రీ గారు, మీ మనసులోని భావాలన్నింటిని రంగరించి...
  కవితా రూపం గా బ్లాగ్ లో రాసేస్తే ...
  చదివే మా అందరికీ మరింత ఆనందం పంచినట్టే!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వెన్నెల గారూ!
   మనసులోని భావాలనే
   అక్షరమాలలుగా అల్లాలనేదే నా చిన్ని ప్రయత్నం.
   సాహితీ మిత్రుల ప్రోత్సాహంతో ముందుకెడుతున్నా ...
   @శ్రీ

   Delete
 4. Replies
  1. ధన్యవాదాలు పరిమళం గారూ!
   @శ్రీ

   Delete
 5. ప్రేయసి లక్షణాలను ప్రకృతి కివ్వటం చక్కని భావన !

  ReplyDelete
  Replies
  1. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
   @శ్రీ..

   Delete
 6. thank you for your compliment.
  @sri

  ReplyDelete
 7. chaalaa baagundi mukyamgaa aa chinni alaka

  ReplyDelete
 8. ధన్యవాదాలు ఫాతిమా గారూ!
  అలక నచ్చినందుకు...:-)
  @శ్రీ

  ReplyDelete