22/05/2012

ప్రేమ తపస్సుఅరచేతి వెన్నముద్దలా 'నీ ప్రేమ'ని  చూసుకుంటున్నానని మురిసి పోయాను...
కంటిలోని కాంతిలా కాపాడుకుంటూ వస్తున్నానని సంబరపడిపోయాను..

సమయం గడుస్తుంటే.... స్థితి మారిపోయింది....

అరచేతి వేడిమికి వెన్న ఎపుడు కరిగిపోయిందో తెలియలేదు...
కంటిలోని కాంతి ఎపుడు అదృశ్యమైపోయిందో అర్థం కాలేదు.. 

ఆ కరుగుదల మొదలైన తొలిక్షణం ఎపుడో నీవైనా చెప్పవూ?
మాయమైన ఆ కాంతిపుంజం ఎక్కడుందో కాస్తంత వెదికిపెట్టవూ?

గడచిన సమయం మరల  రాదని తెలుసు...

నీకు వింత అనిపించినా సరే...
కాలచక్రాన్ని  వెనక్కి తిప్పే అసాధ్యమైన పనిని మొదలెట్టేసా!
నీ ప్రేమని మళ్ళీ పొందాలనే తపస్సు నేటినుంచే ఆరంభించేసా!

10 comments:

 1. తద్ధాస్తు! కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేకున్నా, ప్రేమని మళ్ళీ పొందగలరని ఆశిస్తూ..

  ReplyDelete
  Replies
  1. నా కవితపై మీ స్పందనకు ధన్యవాదాలు వెన్నెలగారూ!
   @శ్రీ

   Delete
 2. మీ తపస్సు దిగ్విజయంగా కొనసాగాలని, తిరిగి తన ప్రేమని పొందాలని కోరుకుంటున్నాను.
  దయచేసి కాలాన్ని మాత్రం వెనక్కి తిప్పకండి. కష్టపడి ఇన్ని సెమిస్టర్లు పూర్తిచేసా. ఇంకొక్క రెండు పూర్తి చేస్తే ఇండియా వచ్చేయచ్చు. మీరిలా వెనక్కి తిప్పితే మళ్ళీ ఆ పరీక్షలన్నీ వ్రాయలేను బాబూ :(

  ReplyDelete
  Replies
  1. కాలాన్ని వెనక్కి తిప్పినా, మీ సెమిస్టరు పరీక్షల మీద
   ప్రభావం పడకుండా చూస్తాను లెండి...:-)
   మీ స్పందనకు ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
   @శ్రీ

   Delete
 3. very Good. Prayanam cheyadame.. Gelupuki Tolimettu.
  baavundi.. aashaavaadam tO..

  ReplyDelete
 4. శ్రీ గారూ సున్నితమైన బావన సులబ భాష ,అందమైన ఊహ, అపురూపమైన ప్రేమ , అరుదైన ఆత్మీయత మీ కవితలో కనిపిస్తుంది . చాల బాగుంది

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ!
   మీ పరిశీలనకు, ప్రశంసకు ధన్యవాదాలు
   @శ్రీ

   Delete
 5. నీ ప్రేమని మళ్ళీ పొందాలనే
  malli malli pondalani asisthu,
  endukandi antha asha, haiga ......

  ReplyDelete
  Replies
  1. ఆశావాదం లేకపోతే మనిషికి మనుగడే లేదండి...
   ఆశలే మనల్ని ముందుకు నడిపించేవి....
   మీ స్పందనకు ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   @శ్రీ

   Delete