04/10/2012

నా పంచప్రాణాలకు శ్వాసవు నీవేనీ  కాలి మువ్వల సవ్వడి  చాలు...
            నా మనసు సరిగమలు పలికేందుకు...

నీ కనుచూపుల దివ్వెలు చాలు
            నా మది వాకిలిని వెలుగుతో నింపేందుకు...

నీ చిరునవ్వుల విరిజల్లులు చాలు...
           చిరుకవితల మాలలు  అల్లేందుకు...

నీ పసందైన పలకరింపులు చాలు...
         ప్రణయ  ప్రబంధాలు వ్రాసేందుకు....

నీ తేనెలూరే మాటలు చాలు...
           నీ కోసం తేటగీతులు వ్రాసేందుకు...

నీ గాజుల గలగలల మ్రోత చాలు...
           నీకై గానలహరి పాడేందుకు...

నీవు ప్రేమించే ప్రేమ చాలు...
          ఆ ప్రేమను నేను ప్రేమించేందుకు...

'నీ ప్రేమను  నేనే' అనే నీ మాట  ఒక్కటి  చాలు...
          'నా పంచప్రాణాలకు  శ్వాసవు నీవే' అనేందుకు...  @శ్రీ 


           

22 comments:

 1. మీ కవిత ఒక్కటి చాలు
  అందమైన కవితా లోకంలో విహరించేందుకు
  అందమైన చిత్రం మనసు రంజింప చేసే కవిత :-)

  ReplyDelete
  Replies
  1. ఇలాంటి ప్రశంస ఒక్కటి చాలు...
   ఇంకా ఇలాంటివి వ్రాసేందుకు...:-)
   ధన్యవాదాలు వీణ గారూ!
   @శ్రీ

   Delete
 2. 'కాలి మువ్వల సవ్వడి చాలు'- నన్న
  కవితలో ప్రేమ పాళుల చవులు పెరిగె ,
  ప్రేమ చక్కెర కాస్తంత పెరిగె నేని
  'బ్రతుకు కాఫీ 'రుచించునా ? పరమ మిత్ర !

  ReplyDelete
  Replies
  1. :-)...:-)...
   అలాగంటారా?..ప్రేమకి కొలతలు పరిమాణాలు ఉండవని
   నేను అనుకుంటూ ఉంటాను రాజారావు గారూ!
   ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు....
   @శ్రీ

   Delete
 3. ఇంతందంగా మీరు చాలు చాలన్న ప్రేమను పంచకమానదు ఆ జవరాలు:-)

  ReplyDelete
  Replies
  1. మీరన్నట్లుగానే అయితే...
   అంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉంటుందంటారా?...:-)
   మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు పద్మగారూ!

   Delete
 4. బ్యూటిఫుల్ శ్రీ గారూ...
  మదిలో మెదిలే ఆ సున్నిత భావనలు చాలు...
  ప్రేమించే హృదయాన ప్రేమ చెలిని చేరేందుకు...

  ReplyDelete
  Replies
  1. అవును చిన్ని ఆశ గారూ!
   మీరన్నది నిజమే...
   నా కవితాభావం మీరు మెచ్చినందుకు
   చాలా ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 5. Replies
  1. ధన్యవాదాలు వనజ గారూ!
   మీ చక్కని ప్రశంసకు...
   @శ్రీ

   Delete
 6. శ్రీగారూ, ప్రతి పలుకూ ప్రేమగీతమై పలుకుతుంది.
  "నీ తేనెలూరు మాటలు చాలు తేటగీతి రాయటానికి" అన్నారు, నిజమే కవి హృదయం మాటలనే పాటలుగా పలుకుతుంది.
  చక్కటి భావుకత మీ కవితల్లో పలికిస్తారు, మీరు ఇంకా అందంగా రాయగలరు..రాస్తారు కూడా.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మెరాజ్ గారూ!
   నా భావాలు నచ్చినందుకు...
   మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు...
   @శ్రీ

   Delete
 7. Replies
  1. నాకు మాత్రం బాగాలేదు హర్షా!
   ఇలా కనపడకుండా మాయమైపోతే
   ఎలా చెప్పు?...:-)
   ధన్యవాదాలు నా కవితని మెచ్చినందుకు...:-)
   @శ్రీ

   Delete
 8. Replies
  1. thank you yohanth for your nice compliment...:)
   @sri

   Delete
 9. అందమైన పదాల అల్లిక ఈ కవిత.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సృజన గారూ!
   భావాల అల్లిక మీరు మెచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 10. "శ్రీ" గారూ..
  "నా పంచప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమని"
  అంటూ మీ కవిత,పాట చాలా బాగున్నాయండీ..  ReplyDelete
  Replies
  1. రాజి గారూ!
   మీ ఆపాతమధురాలు చాలా రోజులయింది చూసి...:-)
   ధన్యవాదాలు మీ ప్రశంసకు...కవిత, ఎంచుకున్న పాట నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 11. నీ పసందైన పలకరింపులు చాలు...
  ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు....
  ప్రేమింపబడితే ప్రపంచాన్ని జయించినంత సంబరంతో అంబరాన్ని చుంబించమా!ఇక కవి కలం మాటల తోరణాలు ఆకాశమంతా కట్టదా!అందమైన భావుకత్వం.

  ReplyDelete
 12. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
  మీ చక్కని ప్రశంసకు...
  మీరు వ్రాసిన రెండు లైన్లు కూడా కవితకి చేర్చేసుకోవచ్చు...:-)
  ఆ విజయానికి సాటి అయినది ఇంకో విజయం ఉంటుందా మరి???...:-)
  @శ్రీ

  ReplyDelete