09/10/2012

వాస్తవాన్ని గ్రహించని మానవజాతిచేపను తింటే  గుండెకు మంచిదని...
పావురం  రక్తం పక్షవాతానికి మందు అని...

కుందేలు మాంసం సంతానోత్పత్తికి ఉత్ప్రేరకమనీ...
మొసలి చర్మం డబ్బు దాచేందుకు అనీ...

పాము చర్మం నడుమును  చుట్టేందుకు అనీ...
ఏనుగు దంతం షోకేసులకి శోభనిస్తుందనీ...

లేడి కొమ్ము గుమ్మానికి అలంకారమనీ...
పులితోలు గోడకి అందమనీ...

ఔషధ విలువలున్నాయని తిమింగలాలని వేటాడి చంపేస్తూ 
నక్షత్రాల తాబేటి చిప్పల్ని డ్రాయింగు రూముల్లో అలంకరిస్తూ

ఇలా అన్ని జీవుల్నీ చంపుకుంటూ,
అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కబళిస్తూ,
అన్నీ పోయినా, నేను మాత్రం ఉంటాననే భ్రమలో 
బతుకుతోంది వాస్తవాన్ని గ్రహించని మానవజాతి...  @శ్రీ

22 comments:

 1. చక్కగా వ్రాసారండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనూరాధ గారూ!
   నా భావాలు నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 2. ikkada oka vishayam emiti ante manishi tappa prapanchamulo prati di edo oka vidamuga use avutundi manishine deiniki paniki raadu hahaha

  ReplyDelete
  Replies
  1. అదేం కాదు ప్రిన్స్....
   మనిషి గుండె, కాలేయం, చెయ్యి ,కాలు...
   వేటికైనా మంచిదని ఏ జంతు వైద్యుడు వాటికి చెప్పలేక పోతున్నాడు కదా!...:-)
   చాలా రోజులకి మీ దర్శనం...
   ధన్యవాదాలు మీ స్పందనకు...@శ్రీ

   Delete
  2. మనిషి అంగాలు ఏందుకు పనికి రావు అనేది నిన్నటి మాట .ఒక్క కిడ్నియే లక్షల విలువ చేస్తుంది సార్. బవిషత్తులో అంగాలను కాపాడుకోవాటానికి అంగరక్షకులని ఏర్పాటు చేసుకోక తప్పని పరిస్తితి వస్తుంది "శ్రీ" గారు

   Delete
 3. "అన్నీ పోయినా, నేను మాత్రం ఉంటాననే భ్రమలో
  బతుకుతోంది వాస్తవాన్ని గ్రహించని మానవజాతి..."

  నిజమేనండీ చక్కగా చెప్పారు..


  ReplyDelete
  Replies
  1. అవును రాజి గారు...
   అవి చేసే మేలుని గుర్తించక
   వాటినే భక్షిస్తూ వాటి ఉనికికే ప్రమాదమయ్యే స్థితి తెస్తున్నారు...
   అదే ఉనికి మానవుడు కోల్పోయే రోజు కూడా ఉంటుందని గ్రహించటం లేదు...
   ధన్యవాదాలు మీకు నా భావం నచ్చినందుకు...@శ్రీ

   Delete
 4. శ్రీ గారూ, జీవులు తమ ఆహారం కోసం ఇతర జీవులమీద ఆడారపడటం. లేదా వాటిని భక్షించటం ప్రకృతి సహజం.
  ఇకపోతే మానవుని స్వార్ధం వాటిని అంతమొందించదానికే ఉపయోగపడటం దురదృష్టం. ఏమైనప్పటికీ జీవహింస మంచిది కాదు.
  మంచి సందేశం,

  ReplyDelete
  Replies
  1. అవును మెరాజ్ గారూ!
   వాటిని సమూలంగా నాశనం చేయడానికి పూనుకోవడం అమానవికం...
   ధన్యవాదాలు చక్కని మీ స్పందనకు...
   @శ్రీ

   Delete
 5. సరైన సమయం లో (జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న తరుణంలో) వచ్చిన మంచి టపా!

  ReplyDelete
  Replies
  1. నా భావం నచ్చినందుకు
   ధన్యవాదాలు హర్షా!
   @శ్రీ

   Delete
  2. "మనిషి అంగాలు ఏందుకు పనికి రావు అనేది నిన్నటి మాట .ఒక్క కిడ్నియే లక్షల విలువ చేస్తుంది సార్.
   బవిషత్తులో అంగాలను కాపాడుకోవాటానికి అంగరక్షకులని ఏర్పాటు చేసుకోక తప్పని పరిస్తితి వస్తుంది "శ్రీ" గారు"

   సూర్య సావర్ణిక గారి వ్యాఖ్య మెయిల్ లో ఉన్నా ఇందులో పబ్లిష్ కాలేదు...

   సూర్య సావర్ణిక గారూ!
   మీరన్నది నిజమే....కానీ మనం మనల్ని కాపాడుకోగాలమేమో గానీ మూగ జీవులు వాటికి కాపాడుకోవడం తెలియదు కదా!..
   నా బ్లాగ్ కి స్వాగతం...
   ధన్యవాదాలు మీ స్పందనకు...
   @శ్రీ

   Delete
 6. వాస్తవాన్ని చక్కగా చెప్పారు.
  అభినందనలు శ్రీ గారు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భారతి గారూ!
   నా భావం నచ్చి మీరు మెచ్చినందుకు...@శ్రీ

   Delete
 7. మీ కవిత మేము చదివి ఎలాగూ ఆనందిస్తాము
  అమలగారు చదివితే ఇంకా బాగా స్పందిస్తారు...
  మీకు ప్రాణికోటి పట్ల గల భూతదయకి మా అభినందనలు ...కృష్ణప్రియ

  ReplyDelete
 8. మేనకా గాంధీ గారిని మరచినట్లున్నారు...:-)
  ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మీకు జీవ వైవిధ్యం గురించి తెలియనిదేముంది...
  ధన్యవాదాలు కృష్ణ ప్రియా!...@శ్రీ

  ReplyDelete
 9. మానవ జాతి స్వార్ధాన్ని చక్కగా.. చెప్పారు. నాగరికత ముసుగులో ఆనాగరికంగా ప్రవర్తించే మనిషి

  అన్నీ తనవే అంటాడు. తనకే కావాలంటాడు.

  ఆలోచన కల్గించే మంచి పోస్ట్ .

  ReplyDelete
  Replies
  1. అవును వనజ గారూ!
   మనిషి స్వార్థం వలెనే ఈ అనర్థం...
   ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...
   @శ్రీ

   Delete
 10. అన్నీ పోయినా, నేను మాత్రం ఉంటాననే భ్రమలో....భలే చక్కగా పట్టారు మానవుడి నాడి. ఈ భ్రమ మాత్రం వాస్తవం.
  కవితా రూపంలో మంచి ఆలోచన రేకెత్తించేదిగా ఉంది, బావుంది.

  ReplyDelete
 11. చిన్ని ఆశ గారూ!
  మానవ స్వార్థానికి ఎన్నో ప్రజాతులు ఇప్పటికే అంతమయ్యాయి...
  కనీసం ఇపుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది...
  నా భావాలను ఎపుడూ ప్రోత్సహించే మీకు నా ధన్యవాదాలు...
  @శ్రీ

  ReplyDelete
 12. మనీ తత్వం తో మనిషి మానవత్వాన్ని మరిచి అన్ని జీవులు కంటే మనిషి ఫూలేస్ట్ అండ్ వయిసేస్ట్ అనిమల్ ఆన్ ది ఎఅర్త్ అని పించుకున్తున్నాడు. ravindra

  ReplyDelete
 13. అవును రవీంద్రా!
  చాలా బాగా చెప్పావు...
  ధన్యవాదాలు నీ స్పందనకు...@శ్రీ

  ReplyDelete