23/01/2013

నీ చూపులు...

ప్రేమగా
 నా కళ్ళలోకి  
చూసే లోతైన  చూపులు 
చిరుకోపంతో  చురుక్కుమంటూ
గుచ్చే  చూపులు

మదన  శరాలను   సానపట్టి
సంధించే  చూపులు 
తలుపు  వెనుకనుంచి
ఓరగా  చూసే  చూపులు 

నా
  గుండెని  తాకే
వెన్నెల  తూపుల  చూపులు 
సిగ్గుతో  నా  వంక  చూస్తూ
నా మనసు దోచే చూపులు 

సాయం  సంధ్యలో  నాకోసం
వేచి  చూసే  చూపులు 
ఆలస్యమైతే  చూసే
వాడి  వేడి చూపులు

నన్ను   గారంగా
పూలతీగలా అల్లుకునే  చూపులు ...
నేను  అలిగితే 
నను  ప్రసన్నం  చేసుకునే  చూపులు

నను అలరించే  చూపులు 
నను  కవ్వించే  చూపులు 
నన్నారాధించే 
అర్థనిమిలీత  నేత్రాల చూపులు


నా మది వాకిలిలో 
రంగవల్లులేసిన చూపులు.
ప్రియ సమాగమంలో 
సిగ్గుతో స్వీట్ నథింగ్స్ చెప్పే చూపులు 

నిశ్శబ్ద సంగీతమాలపించే చూపులు
మది వేణువుని పలికించే చూపులు 
నా హృదయం భేదించిన చూపులు.
మన ప్రేమకి మూలమైన చూపులు.
మన బంధాన్ని శాశ్వతం చేసిన చూపులు.                        @శ్రీ 

14 comments:

 1. యాతావాతా......చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటున్నారన్నమాట! :-)

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ!...అన్ని చూపుల పాటల్లో ఇదొక్కటే గుర్తొచ్చింది మీకు...:-)...ధన్యవాదాలు...@శ్రీ

   Delete
 2. గుచ్చి గుచ్చి చూసి వెళ్ళిపోతే పరవాలేదు మళ్ళీ వెనక్కి తిరిగి అందంగా నవ్వితేనే మొదలవుతుంది అసలు కధ అంతా, చాలా బాగుంది

  ReplyDelete
  Replies
  1. లక్ష్మి గారూ!...
   అలాగంటారా?...
   :-)
   ధన్యవాదాలు...@శ్రీ

   Delete
 3. ఇన్నిరకాల చూపులుంటాయన్నమాట..:)
  Too Good.

  ReplyDelete
  Replies
  1. కదా మరి....థాంక్ యు...ధాత్రి గారూ!...@శ్రీ...

   Delete
 4. నీ తొలి చూపులోనే అంటూ ఇన్ని వైవిధ్యమైన చూపులను చెప్పేశారు..
  కవిత,కవితకు తగిన పాట రెండూ చాలా బాగున్నాయి. శ్రీ గారూ..
  ఈ పాట ఇదే మొదటిసారి వినటం..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజి గారూ!
   మీ ప్రశంసకి....
   ఈ పాట చాలా ఇష్టం....

   Delete
 5. nice song nice picture and very very nice poetry sri garu

  ReplyDelete
 6. chuupullo chala rakalunnayandoy.. chala baga chepparu

  ReplyDelete
 7. ఓర చూపొక్కటి చాలు హృదయాన్ని బంధించటానికి.
  అయినా అన్ని చూపుల శాశ్వత బంధం మరింత బలమేమో...
  చక్కగా చూపారు చూపుల కవితలో

  ReplyDelete