09/01/2013

కృత్రిమ బంధమేల?



మదనుని విల్లు
 
దొంగిలించి
 
కనురెప్పల నారి సారించి
 
నీ నేత్రాలు వదిలే
 
సుమశరమ్ములకి
 
ఎపుడో సమ్మోహితుడిని చేసావ్!
 

నీ బాహులతల
 
అల్లికతో
 
నీ కౌగిలి చెరసాలలో
 
రోజూ ఖైదీగా బంధిస్తావ్!
 


నీ చూపు
 
నీ మాట...
నీ హొయలు
 
నీ సొగసు
నీ ప్రేమ...
నీ అలుక
 
ఇన్ని ఆయుధాలలో
 
ఏ ఒక్కటి ప్రయోగించినా
 

ఈ సత్యాపతి కాదంటాడా?


చెంత
 
మన్మథుని కొరడా లాంటి
 
నీ వాలు జడ ఉండగా
 

ఈ పట్టు పగ్గమేల?


నీ ప్రేమకే బందీని అయిన
 
నాకు ఈ కృత్రిమ బంధాలేల?

నేనుండేది నీతోనే...
నీనడిగేది నీ తోడే...
నీ మదిలో దాగి ఉన్న
 
నా మనసునడిగి చూడు
 
నీకే తెలుస్తుంది...
నా మాటల్లో ఉన్న నిజమెంతో?
నీమీద నాకున్న ప్రేమెంతో?                  @శ్రీ
 







7 comments:

  1. నీ ప్రేమకే బందీని అయిన
    నాకు ఈ కృత్రిమ బంధాలేల?
    నేనుండేది నీతోనే...
    నీనడిగేది నీ తోడే...
    నీ మదిలో దాగి ఉన్న
    నా మనసునడిగి చూడు
    నీకే తెలుస్తుంది...
    నా మాటల్లో ఉన్న నిజమెంతో?చాల బాగుంది, పదాల అల్లిక చదవ ముచ్చటగా ఉన్నాయి హృదయపూర్వక అభినందనలు
    నీమీద నాకున్న ప్రేమెంతో?

    ReplyDelete
  2. నీ ప్రేమకే బందీని అయిన
    నాకు ఈ కృత్రిమ బంధాలేల?
    నేనుండేది నీతోనే...
    నీనడిగేది నీ తోడే...
    నీ మదిలో దాగి ఉన్న
    నా మనసునడిగి చూడు
    నీకే తెలుస్తుంది...
    నా మాటల్లో ఉన్న నిజమెంతో?చాల బాగుంది, పదాల అల్లిక చదవ ముచ్చటగా ఉన్నాయి హృదయపూర్వక అభినందనలు
    నీమీద నాకున్న ప్రేమెంతో?

    ReplyDelete
  3. andamina chithraaniki adbhuthamaina kavitha chaalaa baagundi sri garu

    ReplyDelete
  4. బొమ్మ కవిత ఒకదానికొకటి పోటీగా ఉన్నాయండి.

    ReplyDelete
  5. అనురాగబంధానికి మీదైన శైలిలో......అందమైన కవితా బంధం:-)

    ReplyDelete
  6. నిజమే మనసైనబంధానికి కృత్రిమబంధనాలెందుకు,
    కవిత,కవితకు తగిన చిత్రం బాగున్నాయి "శ్రీ" గారూ..

    ReplyDelete
  7. బాగుంది శ్రీ గారూ భావం.
    బాపు గారు మీ బొమ్మకి కవితకి వేసారా అన్నంతగా మీ కవిత ఆ కళా ప్రపూర్ణ గారి బొమ్మకి అమరింది.

    ReplyDelete