21/10/2012

నిజమైన నీ స్నే'హితుడు'







కిళ్ళీ బడ్డీల దగ్గర 
రోజూ నీతో సిగరెట్టు
తాగేవాడు కాదు  స్నేహితుడు
సిగరెట్టు మానేందుకు 
నికోటేక్స్  పాకెట్టు గిఫ్ట్ 
ఇచ్చేవాడే  స్నేహితుడు....

వారాంతంలో 
బారుల్లో బీరు మగ్గుతో 
చీర్స్ కొట్టేవాడు కాదు  స్నేహితుడు
మద్యం మానమని మెత్తగా  
మందలించే వాడే  స్నేహితుడు...



పేకాటలో డబ్బులోడిపోతుంటే 
అప్పిచ్చేవాడు కాదు స్నేహితుడు... 
నీకోసం ఎదురుచూసే 
పిల్లలతో , ఇల్లాలితో
ఈ సమయాన్ని గడపమంటూ 
సలహా ఇచ్చే వాడే స్నేహితుడు...


పుట్టినరోజులకీ, 
పెళ్లి రోజులకీ ఖరీదైన బహుమతులతో 
హాజరయ్యేవాడు కాదు  స్నేహితుడు...
కష్టకాలంలో 
నీ కన్నీటిని తుడుస్తూ 
నీకు నేనున్నానంటూ 
ఒదార్చేవాడే నీ  స్నేహితుడు...


చెడుమార్గాల్లో నడవమని 
ప్రోత్సహించేవాడు కాదు  స్నేహితుడు..
నీ ఆలోచనలు సన్మార్గం వైపు 
సాగేలా చూసే వాడే స్నేహితుడు...


సెల్ ఫోనులో  రోజూ నాలుగు మాటలు 
మధురంగా మాట్లాడేవాడు కాదు  స్నేహితుడు...
నువ్వు తప్పు చేస్తే  కటువుగా 
చీవాట్లు పెట్టేవాడే  స్నేహితుడు...


నిన్ను నలుగురు మోసే రోజు..
ఆ నలుగురిలో ఒకరైన వాడే నీ స్నేహితుడు...
ఆరోజు  'తన అంతిమయాత్ర'ను  సైతం 
వాయిదా వేసుకొని 
నీముందు వాలిపోయేవాడే
నిజమైన నీ స్నే'హితుడు'...
                                      @శ్రీ ... 












30 comments:

  1. Replies
    1. హరీష్ గారూ!
      నా బ్లాగ్ కి స్వాగతం.
      సూపర్ కామెంట్ తో మెచ్చిన మీకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  2. "కష్టకాలంలో
    నీ కన్నీటిని తుడుస్తూ
    నీకు నేనున్నానంటూ
    ఒదార్చేవాడే నీ స్నేహితుడు..."

    "శ్రీ" గారూ..
    నిజమైన స్నేహితుడి గురించి చక్కగా చెప్పారండీ..

    ReplyDelete
    Replies
    1. అవును రాజి గారూ!
      కష్టకాలంలో ఆడుకొనే వాడే నిజమైన స్నేహితులు...
      మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  3. Replies
    1. thank u for ur nice compliment vanaja gaaroo!...@sri

      Delete
  4. Replies
    1. thank u harsha...:-)
      for ur nice compliment...@sri

      Delete
  5. Replies
    1. thank u prince...
      thank u very much for ur compliment...@sri

      Delete
  6. చాల బాగుందండి.
    స్నేహితుడు గురించి చక్కగా నిర్వచించారు.
    అభినందనలు శ్రీగారు!

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ!
      నా నిజమైన స్నేహితుడు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  7. Sree gaaru, sneham goorchi entha sunnithamgaa, ardhavantamgaa chepparo . manchi post.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారూ!..
      నేను గట్టిగా చెప్పానని అనుకుంటున్నాను...
      మీరేమో సున్నితంగా అంటున్నారు...
      సమాజాన్ని ప్రశ్నించే వాడి కత్తుల్లాంటి పదాలు మీ సొంతం లెండి..:-)
      ధన్యవాదాలు నా భావాలు మీకు నచ్చినందుకు...@శ్రీ

      Delete
    2. శ్రీ గారూ, కత్తి(కలం) మీ దగ్గరకూడా ఉంది.కానీ చెప్పెవిదానమే వేరు.
      మీరెప్పుడూ సున్నితమైన భావమే పలుకుతారని నా భావం:-))

      Delete
    3. ధన్యవాదాలు మెరాజ్ గారూ!...@శ్రీ

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. అంతా బాగుందండి....చివరిగా అంతిమయాత్ర వాయిదా ఎందుకు అక్కడికి ముందుగా వెళ్ళి వెల్ కం చెప్పేవాడు ఉత్తమ స్నేహితుడేమో:-)

    ReplyDelete
    Replies
    1. 'తెలుగు అమ్మాయి ' కి స్వాగతం పలుకుతోంది నా బ్లాగ్...
      అలా చేయడం ఆత్మలో ఆత్మ విలీనం చేసిన వాళ్ళు మాత్రమే చేయగలరు.
      రెండు తనువులైనా.... ఆత్మ ఒక్కటే అయినవాళ్ళు మాత్రమే చేయగలరు...
      అందుకే స్నేహితుడికి ఆ ఛాన్స్ లేదు...
      ధన్యవాదాలు మీకు నా భావం నచ్చినందుకు...
      మీ బ్లాగ్ ప్రొఫైల్ పిక్ చాల బాగుందండీ...:-)...@శ్రీ

      Delete
  10. అన్నిటిలో కలిసుండి.....చివరిలో మాత్రం నలుగురు మోసేవాడిలో ఒకరవమనడం భావ్యమా చెప్పండి:-)

    ReplyDelete
    Replies

    1. పద్మ గారూ!
      అన్నిటికంటే గొప్ప సాయం ఆనలుగురిలో ఒకరవ్వడం...
      ఎ సాయానికైనా మరు సాయం చేసి ఋణం తీర్చుకోవచ్చేమో గానీ...
      ఆ ఋణం ఒక్కటే తీర్చుకోలేనిది అంటారు...
      అలాంటి సాయం నిజమైన స్నేహితుడే చేస్తాడు...తన అంతిమ యాత్రని సైతం
      వాయిదా వేసుకొని.

      మన మంచి మిత్రుడు మనతో కూడా పై లోకానికి రాకూడదు....
      (మీరు ఈ విషయాన్ని హాస్యంతో జోడించినట్లున్నారు)
      కాదు పద్మ గారూ! మన ఆయుష్షు కూడా పోసుకొని నూరేళ్ళు చల్లగా బ్రతకాలి...
      ధన్యవాదాలు మీ స్పందనకు...@శ్రీ

      Delete
    2. నిజంగా ఆ నలుగురు మోసేవాళ్ళు రక్తసంబంధం ఉన్నవారే అయి ఉండాలన్న భ్రమలో అలా భావ్యమా అన్నానండి. మీరు చెప్పాకే తెలిసింది, వివరించిన మీకు ధన్యవాదాలు. అన్యధా భావించరని తలుస్తూ.....

      Delete
    3. పద్మ గారూ!...
      పర్వాలేదండీ...
      దక్షిణాన దేవుడి పల్లకి భుజం కాయడానికి వేల మంది ముందుకొస్తారు...
      ఉత్తరాదిన అంతిమ యాత్రలో ఒక్క క్షణమైనా భుజం కాయడానికి అలాగే ముందుకొస్తారు...
      మీ ":-)" చూసి తేలికగా తీసుకున్నట్లనిపించింది...
      ధన్యవాదాలు మరోసారి స్పందించినందుకు...
      మీకు బ్లాగర్స్ అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  11. స్నేహితుడి గురించి మీ కవిత మంచి సందేశాన్ని అందించింది.స్నేహం పై ఇంతకు ముందు కొన్ని వ్యాసాలు వ్రాసాను.ఇంకా వ్రాయాల్సినవి ఉన్నాయి.మీ కవితను చదివి అందరూ స్నేహాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాసాలు నేను కొన్ని చదివాను.
      ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
      మీ స్నేహ పూర్వకమైన ప్రశంసకి...
      మీకు, మీ కుటుంబసభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు ...
      అందరు బ్లాగ్ మిత్రులకు....అందరు బ్లాగర్స్ కు విజయ దశమి శుభాకాంక్షలు ...
      @శ్రీ

      Delete
  12. చాలా బాగుందండి :)

    ReplyDelete
  13. గుండెను తట్టింది మీ కవిత... నిజమైన స్నేహితుడు / రాలు అంటే నాకున్న భావాలే మీకూ ఉన్నాయి... ఎంతో సంతోషం కలిగింది మీ కవిత చదివిన తరువాత... స్నేహితుడిలో ఓ అమ్మ, నాన్న, అన్న, అక్క, ప్రియురాలు, భార్య... ఏ బందాన్నైనా దర్శించవచ్చు... వండర్ ఫుల్... థాంక్స్ ఓ మంచి కవితను అందించినందుకు. కంగ్రాట్స్.

    ReplyDelete
  14. ధన్యవాదాలు కరుణ గారు ....మీ చక్కని స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది...మీ అభినందనలకు అభివాదాలు...@శ్రీ

    ReplyDelete
  15. 👌👌👌🙏🙏🙏🙏

    ReplyDelete
  16. కరుణా రసరమ్య బావావేశం మీ సొంతం, స్నేహితుడని కోల్పోయిన వాళ్ళకు మాత్రమే మీ భావం చిక్కటి గుండే ను చక్కగా మలయమారుతం స్పందన .......

    ReplyDelete