19/10/2013

|| కృ(క్రి)ష్ణ వేణి ||








సదాశివుని జటాజూటం జడలు విప్పి ఆడినట్లు 
ఉమాదేవి నీలి కురులు పిల్లగాలికి ఎగిరినట్లు 
మహాబలేశ్వరునికి జలకన్నియ పుట్టినట్లు

వయసొచ్చిన పడుచు అల్లరి చేస్తూ పరుగులు తీస్తునట్లు
ముంగురులను సర్దుకుంటూ వయ్యారంతో సాగుతున్నట్లు
వడివడి నడకలతో బిరబిర పరుగులతో కదిలిపోతుననట్లు
కనబడుతోంది మా కృష్ణవేణి...తెలుగు నదులకే రారాణి.

ఆనకట్టల హద్దుల మన్నించి
పిల్లకాలువల ప్రవహించి
పంట చేలను తడిపి
పట్టెడన్నం పెట్టే కృష్ణమ్మ చేతులు
అన్నపూర్ణ హస్తాలకి ప్రతిరూపాలు.

మల్లికార్జునుని పాదాలు కడుగుతూ
భ్రమరాంబిక పారాణి తాకుతూ
కనకదుర్గమ్మకు ప్రణమిల్లుతూ
నల్లమల అడవులకు అందాన్నిస్తూ
హంసలదీవి దగ్గరకు రాయంచ నడకలతో చేరుకుంటుంది
తనను ప్రేమగా గుండెల్లో దాచుకొనే సాగరుని పరిష్వంగం లోనికి... ...@శ్రీ

9 comments:

  1. మల్లికార్జునుని పాదాలు కడుగుతూ
    భ్రమరాంబిక పారాణి తాకుతూ
    కనకదుర్గమ్మకు ప్రణమిల్లుతూ
    నాగార్జునుని సందిట సేద దీరుతూ
    నల్లమల అడవులకు అందాన్నిస్తూ
    హంసలదీవి దగ్గరకు రాయంచ నడకలతో చేరుకుంటుంది
    తనను ప్రేమగా గుండెల్లో దాచుకొనే సాగరుని పరిష్వంగం లోనికి... superb sree garu

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు స్వర్ణా ...నీ ప్రశంసకి ..@శ్రీ

      Delete
  2. చాలా బాగుంది శ్రీ గారు!!
    నాకు బాగా నచ్చింది :)

    ReplyDelete
    Replies
    1. థాంక్ యు సో మచ్ హర్షా ....:) ...@శ్రీ

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు శ్రీదేవి గారు మీ ప్రశంసకి ....@శ్రీ

      Delete
  4. ఆనకట్టల హద్దుల మన్నించి
    పిల్లకాలువల ప్రవహించి
    పంట చేలను తడిపి
    పట్టెడన్నం పెట్టే కృష్ణమ్మ చేతులు
    అన్నపూర్ణ హస్తాలకి ప్రతిరూపాలు.
    పై వాఖ్యాలలో్ కవి సామాజిక భాద్యత కనిపిస్తుంది.
    అందమైన భావాలలో నదీమతల్లిని ఆవిష్కరించిన తీరుకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్ గారు ..మీ సామాజిక కవితలకి నేను మొదటి అభిమానిని ...._/\_...మీ ప్రశంస నాకు మరింత స్పూర్తినిస్తోంది ...@శ్రీ

      Delete
  5. కృ(క్రి)ష్ణ వేణి : పరుగుల మీద పరుగులు తీస్తూ వనరుల అందాల్ని తీర్చిదిద్దుతూ, రైతుల ఆకలి తీరుస్తూ, పిల్ల కాలువల దాహంతీరుస్తూ ఊగిసలాడుతూ పయనిస్తుంది నదుల రాణి కృష్ణమ్మ… పరిగెత్తే ప్రతి అల భవిష్యవాణికి సంకేతంగా భావిస్తూ....!!! అనుదీప్ కుమార్ మంగళంపల్లి .....

    ReplyDelete