08/09/2016

|| మెదులుతూ ఉంటుంది - తెలుగు గజల్ ||

|| మెదులుతూ ఉంటుంది - తెలుగు గజల్ || కలలోన నీరూపు మెదులుతూ ఉంటుంది కనులలో తిమిరమే తొలగుతూ ఉంటుంది యాచనలు చేయడం నా మదికి తెలియదూ నీమనసునిమ్మంటు అడుగుతూ ఉంటుంది నీమేని వన్నెలను చోరీలు చేస్తుంది హరివిల్లు కొత్తగా విరుగుతూ ఉంటుంది నిను తలుచుకుంటూనె రాస్తాను ప్రతిషేరు గతిలోన నా గజలు ఒదుగుతూ ఉంటుంది శుక్లపక్షములోని జాబిల్లియే సాక్షి నీమీద నా వలపు పెరుగుతూ ఉంటుంది హేమంత ధూమాలు వణికిస్తు ఉన్నాయి నా తనువు నీదరికి జరుగుతూ ఉంటుంది ఇద్దరం ఒక్కటై కనబడితె "నెలరాజ" రాత్రిలో తన్హాయి మరుగుతూ ఉంటుంది #శ్రీ


No comments:

Post a Comment