27/02/2012

నల్లని జలపాతంఈ లోకానికి తెల్లవారుతుంది సూర్యోదయంతో....
నాకు తెల్లవారుతుంది నీ ముఖ చంద్రోదయంతో....

ప్రత్యూష సమయంలో..
నీ నల్లని జలపాతం లాటి కురులు
చేసే అల్లరికి  నిద్ర లేవటం అలవాటుగా మారి పోయింది ప్రియా.....

అలిసి సొలిసి నిద్రించే నన్ను...
నీ నీలి కురుల జలపాతపు తుంపర్లు తాకి...
నా అలసటను దూరం చేస్తూ నిద్ర లేపుతాయి...

అలా ప్రతి రోజు నిద్ర లేపుతానని బాస చేస్తే
నీతో మళ్లీ అలిసిపోతాను ప్రియా...
నీలో మళ్లీ కలిసిపోతాను ప్రియా...

No comments:

Post a Comment