03/04/2012

తలపు- తలపుకీ మధ్య



నీ తలపులతో  
మొదలవుతుంది 
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో  చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.

నన్నెందుకు 
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....

నానుంచి నీ తలపులను 
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో.... 
నా మనసులోకి తొంగి చూస్తావు.

నిన్ను మర్చిపోవాలనుకొనే 
సమయంలో  
మరీ ఎక్కువ   గుర్తొస్తావ్  సుమా!

దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం  సహజమే...
కాని తలపు- తలపుకీ  మధ్య కూడా 
తలపుల్లోకి  వచ్చేస్తే  ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి 
దూరంగా ఉండడం  ఎలా???

2 comments:

  1. బాగుంది.
    మీ కవితలు కొన్ని చదివాను. బాగున్నాయి. చిత్రాలు కూడా బాగున్నాయి.
    తీరిక దొరికినప్పుడు అన్ని చదువుతాను.

    ReplyDelete
  2. ధన్యవాదాలు మీకు.
    @శ్రీ

    ReplyDelete