08/04/2012

రాధ 'ప్రశ్న''రుక్మిణి ' భక్తికి మెచ్చి ఆమెని  వరించానన్నావు....
'సత్యభామ'ను శమంతకమణితో  స్వీకరించానన్నావు..


'జాంబవతి'ని ఆమె తండ్రి  నీకు సమర్పించిన కానుక అన్నావు...
'కాళింది'ని విష్ణుప్రేమవల్ల చేపట్టానన్నావు....


'మిత్రవింద' నిన్ను  స్వయంవరంలో వరించిందన్నావు... 
'నాగ్నజితి'ని  పోటీలో దక్కించుకున్నానన్నావు ... 


'భద్ర 'నిన్ను ప్రేమతో గెలుచుకుందన్నావు...
'లక్ష్మణ'ను నీ విలువిద్యా కౌశలంతో చేజిక్కించుకున్నానన్నావు...


నాలో అందం,భక్తి, ప్రేమ...
అన్నీ ఉన్నా నన్నెందుకు పెళ్ళాడలేదని అడిగితే...
"పెళ్ళికి ఇద్దరు వ్యక్తులు కావాలి కదా!"అంటావు !!!!!.........
                                                
                                                                              @శ్రీ .

.
10 comments:

 1. ప్రేమ స్నేహం చేయటం అంటే ప్రేమించిన తరువాత స్నేహం చేయటం ,
  స్నేహం లోంచి ప్రేమ పుట్టటం ఒక రకం ,ప్రేమలోంచి జీవితమంతా స్నేహితులుగా వుండటం అద్భుతం.
  కాని అంటారు స్నేహితులు బార్యాభార్తలయితే మంచి ప్రేమికులవుతారు కాని ప్రేమికులు జీవితం బంధం లో మంచి స్నేహితులు కాలేరంటారు.మీ కవిత బాగుంది శ్రీ గారు! ఇది వయసుకు వయ్యారం పై కామెంట్.అక్కడ కామెంట్స్ సెక్షన్ లేదు గమనించగలరు

  ReplyDelete
 2. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
  ఏదైనా సాంకేతిక సమస్య వల్ల మీకు కామెంట్ సెక్షన్ దొరక లేదేమో!
  మీ విశ్లేషణ బాగుంది.... @శ్రీ

  ReplyDelete
 3. నిజమే శ్రీ గారు.......
  రాధ-కృష్ణులు ఒక్కరే కదా........!!!
  ఎంత గొప్ప సందేహం...కృష్ణుడి లో నే మమేకమయిన రాధ ప్రశ్న కి కన్నయ్య ఎంత తెలివిగా సమాధానం చెప్పాడండి...(మీ నుండి ). సూపర్.........:) :)

  ReplyDelete
 4. మనిద్దరం ఒకటే కదా...
  అనే భావం ఎక్కడో చదివాను...
  అంటే చిన్న కవిత ప్రాణం పోసుకొంది..
  మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు సీత గారూ!
  మీరిలా అన్నిటికీ సూపర్ అనేస్తుంటే...
  బోలెడు కవితలు వ్రాసేందుకు ఉత్సాహం వచ్చేస్తుందండీ
  :-)...:-))
  @శ్రీ

  ReplyDelete
 5. రాధా కృష్ణుల మూర్తుల
  శోధింపగ వేరు జేసి చూపుట భువిపై
  లే దా పరమాత్మకు నా
  త్మే దానని బుథులు సన్నుతింతురు రాధన్ .
  ----- సుజన-సృజన

  ReplyDelete
 6. నా బ్లాగ్ కి స్వాగతం రాజారావు గారూ!
  మీ పద్యపరిమళాన్ని ఇన్నాళ్ళకి నా బ్లాగ్ కి కూడా చూపించారు...
  రాదా కృష్ణుల అభేదాన్ని చక్కగా చెప్పారు పద్యంలో...
  ధన్యవాదాలు....
  మీ దర్శనాభిలాషి...
  @శ్రీ

  ReplyDelete
 7. baagundandi . ardhanareeswara tatwaanni radha krishnullo choopinchaaru .

  ReplyDelete
 8. ధన్యవాదాలు మీ ప్రశంసకి అనుపమ గారూ!
  అర్ధనారీశ్వర తత్వం అనేకంటే...
  నేనే నీవు..
  నీవే నేను అనే భావాన్ని చూపే ప్రయత్నం చేసాను.
  @శ్రీ

  ReplyDelete
 9. రాధా కృష్ణులు వేరు వేరు కాదని చాల అధ్బుతం గా చెప్పారు శ్రీ గారూ....

  ReplyDelete
 10. Superb uncle chala baga rasaru

  ReplyDelete