06/04/2012

నీనుంచి దూరంగా


ఒక్కక్కసారి అనిపిస్తుంది 
నాలోని నీనుంచి దూరంగా పారిపోవాలని...
అదే ప్రయత్నంలో.. పరుగు మొదలెట్టాను.


వెలుతురులో, చీకటిలో...
కొండల్లో, కోనల్లో
వనాలలో, రాళ్ళల్లో, రప్పల్లో 
దుర్గమమైన దారుల్లో...సాగిపోతోంది నా పయనం.
ఎవరూ ఊహించనంత వేగంగా...
గమ్యం లేకుండా.....
ఎవరికీ దొరకనంత దూరంగా...


అలికిడైతే వెనుదిరిగి చూసాను...
నువ్వు,
నీ నవ్వు,
నీ మనసు,
నీ ప్రేమ,
అన్నీ కనిపించాయి 
అలసి సొలసిన వదనంతో...
రక్తసిక్తమైన పాదాలతో......6 comments:

 1. పాపం అంత ప్రెమగా మీకొసం వస్తుంటె మీరెందుకండీ వదిలి దూరంగా వెళ్ళిపొతున్నారూ?

  ReplyDelete
 2. :)...టెస్టింగ్ అండీ.....
  :).....@శ్రీ

  ReplyDelete
 3. రక్తసిక్తమైన పాదాలతో......? ఎందుకండి అలా రాసారు? అది ఎందుకో బాలేదు.

  ReplyDelete
 4. జలతారు వెన్నెల గారూ!
  నేను రాళ్ళలో రప్పల్లో వెడితే...
  నా వెనుక పరుగు పరుగున వచ్చిందని అలా రాసానండి....

  ReplyDelete
 5. sir, chaalaabagundi, entha paaripoyinaa ventane unde prema

  ReplyDelete
 6. ఫాతిమా గారూ!
  కవితలో సారం చెప్పేశారు...:-)
  మీకు ధన్యవాదాలు
  ముందు వ్రాసిన కవితలని కూడా చూసినందుకు...
  @శ్రీ

  ReplyDelete