17/04/2012

గుండె చప్పుడు

నేను సేకరించిన  నీ  నవ్వుల పువ్వులని...
మాలలుగా అల్లి ఉంచాను, 
నీ నీలికురుల కోసం....

నీ మాటలలో దొర్లిన ముత్యాలను...
కూర్చి ఉంచాను,
నీ గళసీమను అలకరించాలని....


నీ సిగ్గు దొంతరలను...
సోపానాలుగా చేసి ఉంచాను                                       
నా హృదయాన్ని చేరుకొనేందుకు...

ఈ గుండె  చేసే చప్పుడు  ఆగిపోయే
ఒక్క క్షణం ముందైనా వస్తావు కదూ!!!

4 comments:

 1. తప్పక వచ్చేస్తారులెండి!
  ఇంత మంచి కవితలు రాస్తుంటే,స్పందించని వారు ఉండరు.బాగుంది కవిత..simple gaa!

  ReplyDelete
 2. ధన్యవాదాలు... జలతారు వెన్నెల గారూ!
  :)...@శ్రీ

  ReplyDelete
 3. Replies
  1. ఫాతిమా గారూ!
   మీ ప్రశంసకి ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete