18/04/2012

వయసుకి వయ్యారం

ఓ వయసుకి వయ్యారం వస్తే,
ఓ అందానికి అల్లరి చేరితే,

ఓ సిగ్గుకి సింగారం అద్దితే,
ఓ సంతోషం సందడి చేస్తే,

ఓ వెన్నెల  వేలుపై వస్తే,
ఓ  ప్రేమే స్నేహం చేస్తే,

నా ప్రేమకి ప్రాణం పోస్తే,
నా నీడకి రూపం వస్తే,
అది నీలాగే  ఉంటుంది...

నా మాటలకి,
మనసులో ఆనంద పడుతూ,
ప్రశంసలు వద్దన్నానా !!!
అంటూ నీవు చూపే చిరుకోపం మాత్రం...
అచ్చు నీ ముందున్న అద్దం లానే ఉంటుంది.  @శ్రీ 
                                                                            

6 comments:

 1. So sweet! బాగుంది కవిత!
  ఎలా మీరు ఇలా రోజు రాయగలుగుతారు?

  ReplyDelete
 2. ధన్యవాదాలు వెన్నెలగారూ!
  ప్రేమంటే నాకెంతో ప్రేమ.
  మనసులో పుట్టే భావాలను
  అక్షరాలుగా పేర్చి చిన్న చిన్న వాక్యాలుగా
  మార్చడాన్నే కవిత్వం అనుకుంటూ వ్రాసుకుపోతున్నానంతే...
  :-) ....@శ్రీ

  ReplyDelete
 3. వయసుకు వయ్యారం సిగ్గుకు సింగారం

  అంటే చిరు కోపం ..బాగుంది మీ కవిత

  ReplyDelete
 4. ధన్యవాదాలు బాలకృష్ణా రెడ్డి గారూ!....
  @శ్రీ

  ReplyDelete
 5. ఓ వెన్నెల వేలుపై వస్తే...
  ఓ ప్రేమ స్నేహం చేస్తే...
  It's nice expression !

  ReplyDelete
 6. వనజ(నమాలి)గారూ!
  ధన్యవాదాలు...
  :-) ....@శ్రీ

  ReplyDelete