28/04/2012

ఎదురు చూపులు

ఉదయం లేచింది మొదలవుతుంది 
అంతులేని నిరీక్షణ.... 
నీకు వ్రాసిన ....నా చివరి  
ప్రేమలేఖకి జవాబు వస్తుందేమోనని.

రోజులు, నెలలు
గడిచిపోతున్నాయి....
కాలాలు, ఋతువులు 
మారిపోతున్నాయి...

ఏవీ?నా గుండెపై
గుప్పెడు మల్లెలు చల్లినట్లుండే
నీ ప్రణయ పత్రాలు?

నీ చిలిపి రాతలు చిలికిన
కవ్వింతలు ఎక్కడ?
అవి నా మనసుకి 
పెట్టిన గిలిగింతలు ఎక్కడ?

జవాబు రాని లోకాల నుండి
నా ప్రియతముని లేఖలు
తేలేకపోతున్నందుకు...
జాలిగా చూసే పోస్ట్ మేన్
సజల నయనాలు....
నా కన్నీటి కథను...
మీకు చెప్పకనే, చెపుతున్నాయి కదూ!


                                                 @శ్రీ                                                  
13 comments:

 1. మేఘంలా వర్షించే ఆ నయనాలు, జవాబుకై వీక్షించే హృదయం...కదిలించే మీ కవిత చాలా బాగుంది.
  త్వరలో జవాబు రావాలని ఆశిస్తూ....

  ReplyDelete
 2. మీ ప్రశంసకి ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
  @శ్రీ

  ReplyDelete
 3. "पीपल का यह पत्ता नहीं, कागज़ का यह टुकडा नहीं, इस में हमारी जान है, हम ने सनम को ख़त लिखा, ख़त में लिखा " ఈ పాట తలపుకొస్తుంది. చాలా బాగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. इस बात से मैं सहमत हु कि,
   प्रेम पत्र सिर्फ पत्र नहीं होता है,
   मन कि भावनाओं को प्रकट करने वाले
   कोमल काग़ज़ का दर्पण है......
   ధన్యవాదాలండీ!...@శ్రీ

   Delete
 4. కన్నీటిబొట్ల చెరువు చూసాక అర్థం కాకపోవడం ఏంటండీ?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు పద్మార్పిత గారూ!
   చిత్రం చూసే... వ్రాసానండీ....
   కవి(కవయిత్రి) హృదయాలకి
   అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి?
   @శ్రీ

   Delete
 5. ఎదురుచూపుల తర్వాత వచ్చే ఉత్తరం లోనే అసలైన అనుభూతి వుంటుంది.మంచి కవిత్వం.

  ReplyDelete
 6. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
  @శ్రీ

  ReplyDelete
 7. "ఎదురు చూపులు ఎదను నిండగా ఏళ్ళు గడిపెను శకుంతలా..
  విరహ బాధను మరచిపోవగా నిదురపోయేను ఊర్మిళా.."

  పాట నాకు గుర్తుకు వచ్చింది మీ కవిత చదవగానే!
  కవిత , చిత్రం రెండూ బాగున్నయి శ్రీ గారు.

  ReplyDelete
 8. ధన్యవాదాలు వెన్నెల గారూ!
  ఊర్మిళాదేవి అనగానే...
  మా అమ్మమ్మగారు నా చిన్నప్పుడు పాడే
  "ఊర్మిళాదేవి నిద్ర" గుర్తొస్తోందండీ!
  @శ్రీ

  ReplyDelete
 9. నిరీక్షణ కూడా ఒక్కోసారి ఆనందాన్ని ఇస్తుంది మీ కవనం అద్భుతం
  మీ చిన్నికృష్ణ

  ReplyDelete