01/05/2012

కళ్ళు చెప్పే" ప్రేమవేదం"



నీవెప్పుడు మాట్లాడినా 
కదిలే నీ పెదవుల వైపు చూడను, 
నీ కళ్ళలో మెదిలే నీ మనో భావాల్ని 
కళ్ళతోనే  చదువుతుంటాను....

నా మీద ప్రేమ ఉందా?
అని ప్రశ్నిస్తే.... 
కనులు మూసుకొని 
మౌనం వహిస్తే ఎలా?

మనసులో ఎగసిపడే భావ తరంగాలను 
కళ్ళలో ప్రదర్శించేందుకు జంకు ఎందుకు?
నీలి కన్నులపై రెప్పల  పరదాలు వేసి 
నీ  ప్రేమను దాచడమెందుకు?

ఆ ప్రేమ గవాక్షాల తలుపులు నెమ్మదిగా తెరుచుకోనీ!
నీ కంటిలోని నా రూపుని ఈ  లోకం చూడనీ!
నీ కళ్ళు చెప్పే" ప్రేమవేదాన్ని" అంతా మనసారా విననీ!

                                                                      @శ్రీ


















16 comments:

  1. చాలా బాగుంది.... :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మానస గారూ!
      @శ్రీ

      Delete
  2. ఇంత చక్కటి కవితలు రాస్తే ప్రేమను ఎలా దాస్తారండి?
    ప్రేమ గవాక్షాల తలుపులు తెరుచుకుంటాయి త్వరలో
    కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారూ!
      మీ ప్రశంస కూడా వెన్నెలంతా హాయిగా ఉందండీ!
      @శ్రీ

      Delete
  3. చాలా బాగుందండీ! చక్కని భావ వ్యక్తీకరణ!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
      @శ్రీ

      Delete
  4. Replies
    1. మీ ప్రశంసకు ధన్యవాదాలు వనజ(వనమాలి)గారూ!
      @శ్రీ

      Delete
  5. thank u prince..prince of songs collection...
    :)
    @sri

    ReplyDelete
  6. "మనసు పలికే మౌన గీతం" లాగా
    "కళ్ళు చెప్పే ఈ ప్రేమవేదం" చాలా బాగుందండీ..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారూ!
      కళ్ళు వల్లించే ప్రేమవేదం
      కళ్ళు మాత్రమే వినగలవండోయ్...
      :)
      @శ్రీ

      Delete
    2. ఎంత అందమైన భావన , ఎంత స్వచ్చత ఉంది మీ కవితలో, ప్రేయసి మనసూ , మౌనమూ రెండూ చుడగల భావుకత వహ ... వా తన కనుల వెనుక ప్రేమని గుండెతో చూడగల హృదయం కనిపిస్తుంది, శ్రీ గారూ చిన్ని కవితలో ఎంత ప్రేమని చేర్చారో . చాలా చాలా బాగుంది

      Delete
    3. ధన్యవాదాలు ఫాతిమా గారూ!
      నా కవితలోని భావాలని వెలికి తీసి
      అద్దంలో చూపించినట్లు చెప్పారండీ మీరు...
      మీరు చెప్పాక నా కవిత నాకు మళ్ళీ నచ్చేసినట్లు ఉందండీ!..
      :-) @శ్రీ

      Delete
  7. ఎంత బాగా చూపెట్టారు కనుపాపని మీ కనులతో కానీ.
    మురిసి తరసి పోయేలా!!!!

    ReplyDelete