03/05/2012

గుప్పెడంత 'నా మనసు'



'నీ అందం' 
కాళిదాసు వర్ణనలకు అందనిది...
'నీ రూపం'
రవివర్మ కుంచెకు దొరకనిది...

'నీ ప్రేమ' 
నేను యుగయుగాలకీ వరంగా అడిగేది....
'నీ సోయగం' 
ప్రకృతి కూడా 'ప్రామాణికం' అనుకునేది.....

ఎవరికీ అందని నిన్ను...
గుప్పెడంత  చోటులో బంధించి 
అందరి వంక గర్వంగా చూస్తోంది
నీలో ఉన్న 'నా మనసు'.......     
                                                  @శ్రీ 

13 comments:

  1. 'నీ అందం'
    కాళిదాసు వర్ణనలకు అందనిది...
    'నీ రూపం'
    రవివర్మ కుంచెకు దొరకనిది... ఇవి బాగా నచ్చాయి.

    శీర్షిక చూడగానే గుప్పెడంత గుప్పెడంత మనసు, దాని సంగతేంటో ఎవరికి తెలుసు అని పాడుకుంటూ వచ్చా ;)

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు ధన్యవాదాలు...రసజ్ఞ గారూ!
      :)...@శ్రీ

      Delete
  2. చిత్రము, కవిత రెండు ఆకట్టుకున్నాయి శ్రీ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు...వెన్నెల గారూ!
      @శ్రీ

      Delete
  3. గుప్పెడంత మనసు గర్వం బాగుంది శ్రీ గారు..

    ReplyDelete
    Replies
    1. రాజిగారూ!
      కవిత నచ్చినందుకు ధన్యవాదాలండీ!
      @శ్రీ

      Delete
    2. sri garu guppedantha gundetho sree kaaram palikaru

      mee blog kondantha kavali

      Delete
    3. ధన్యవాదాలు ఫాతిమా గారూ!
      మీ ప్రశంస నా కవితలకి కొండంత బలం....
      @శ్రీ

      Delete
  4. thank you prince...
    @శ్రీ

    ReplyDelete
  5. గుప్పెడంత మనసు కి అక్షరాల్లో అద్భుత రూపం ఇచ్చారు, వండర్ ఫుల్.

    ReplyDelete
    Replies
    1. నా కవిత మీరు మెచ్చినందుకు మీకు
      ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!.
      @శ్రీ

      Delete
  6. wow..really super sri gaaru....

    ReplyDelete
    Replies
    1. మీకు నా ధన్యవాదాలు సీత గారూ!
      @శ్రీ

      Delete