08/05/2012

నక్షత్రాల చేవ్రాలు

ప్రత్యూషపు కాంతి...
అరుణ వర్ణంతో మెరుస్తోంది...... 
నే సరసమాడే సమయాన,
ఎరుపెక్కిన నా చెలి  సిగ్గుల గులాబి బుగ్గలా...... 

గ్రీష్మపు అపరాహ్నం
అగ్ని చినుకులు కురిపిస్తోంది .....
నా ప్రేయసి నాపై  అలిగినపుడు  వదిలే
వాడి-వేడి వాక్కుల బాణాల్లా  .....

సాయం సంధ్యా సమయంలో...
చల్లగా వీచే  పిల్ల తెమ్మెర 
హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన 
ప్రణయ సమీరంలా  ....

రజనీ కాంతపై  వెన్నెల రాజు 
రజత వర్షం కురిపిస్తున్నాడు....
నా చీకటి గుండె పై....
నా నెచ్చెలి చేసిన  అక్షర  నక్షత్రాల  చేవ్రాలులా......

11 comments:

 1. Very impressive! ఉదయం, మధ్యానం, సాయంత్రం, రాత్రి అన్ని వేళలో ప్రేయసి జ్ఞాపకాలు!
  ప్రకృతి-నువ్వు-నేను అన్నట్టుంది.

  ReplyDelete
 2. ధన్యవాదాలు వెన్నెల గారూ!
  'ప్రకృతి -నువ్వు-నేను' పేరు ఈ కవితకి పెట్టేసుకోవచ్చు...
  @శ్రీ

  ReplyDelete
 3. wow....super sri garu...
  another marvellous thing from you..

  ReplyDelete
  Replies
  1. sree garuu enda kuda vennelani talapinchede prema bha kavitwaniki saraina ardaanni ichharu. padaala pondika baagubdi

   Delete
  2. thank you very much seeta gaaroo!
   @sri

   Delete
 4. nenu cheppali anukunnadi bhava kavitwam

  ReplyDelete
  Replies
  1. thank you faatimaa gaaroo!
   meeru vraase saamajika spruha unnavi vraadaamani prayatnam chestunnaanandoy!...modati prayatnam twaralo mee munduntundi...@sri

   Delete
 5. Replies
  1. welcome to my blog prasad gaaroo!
   thank you very much for your super compliment...
   mee blog lo links choosaanu photos baagunnayi.
   @sri

   Delete