13/05/2012

రిక్షావోడు


మండుటెండలో ...
స్వేదంతో తడిసి,అలిసిన ముఖంతో ...                           
నెత్తిన చుట్టిన కావి రంగు తుండుతో...
బేరాలకోసం ఎదురుచూసే రిక్షావోడు ....
ఎండ, వాన, చలి...
ఏ కాలమైనా పట్టెడన్నం కోసం 
చెమట చిందించ వలసిందే...

టాక్సీలకిస్తాం 
మీటరు ప్రకారం డబ్బులు....
ఆటోలకిస్తాం
మీటర్ పై అదనంగా పైసలు...
బేరమాడటానికి మాత్రం దొరికిపోతాడు....
....పాపం రిక్షావోడు.

హోటల్లో సర్వరుకిస్తాం టిప్పు...
గేటు తీసి, సలాము కొడితే 
నిర్లక్ష్యంగా విసిరేస్తాం ఓ పచ్చనోటు....
ఎత్తు వచ్చినపుడు తాను దిగి,
మన బరువుని పళ్ళబిగువున లాగే
రిక్షావోడికి  మాత్రం వదలం ఒక్క రూపాయి కూడా.

మూడు చక్రాలను  బాలన్సు చేస్తూ...
శక్తి  సామర్థ్యాలు అదనంగా ధారపోసి....
మూడు, నాలుగు చక్రాల మోటారు వాహనాలకి పోటీనిస్తూ....
ఎక్కువ సార్లు తానోడినా ,
తన బ్రతుకు తెరువు కోసం,అస్తిత్వం కోసం
నిరంతరం పోరాడే  రిక్షావోడంటే.... ఎందుకంత చులకన???

ప్రతి పోరాటానికీ రాటు దేలుతూ..
సమస్యని చూసి మడం తిప్పని  ఆ యోధుడే
నా  జీవనపోరాటానికి స్ఫూర్తి....10 comments:

 1. Sri garu కష్టపడే ప్రతి ఒక్కడు యోదుడే, ఆ కష్టాన్ని దోచుకోనివాడే మానవుడు. కష్టజీవి కి చేయూతఇచ్చేవాడే మహనీయుడు . కవిత చాలాబాగా ఉంది

  ReplyDelete
  Replies
  1. మీరన్నది వాస్తవమే ఫాతిమా గారూ!
   మీకు ధన్యవాదాలు...@శ్రీ

   Delete
 2. కవిత బాగుందండి!

  ReplyDelete
  Replies
  1. పద్మార్పిత గారూ!
   మీకు ధన్యవాదాలు...@శ్రీ

   Delete
 3. ముందుగా మీకు అభినందనలు. ఇంత చక్కటి కవిత రాసినందుకు.
  వైవిధ్యం గా ఆమె గురించి కవితలే కాక, చక్కటి కవిత మాకు అందించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వెన్నెలగారూ!...
   కవిత మీరు మెచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 4. శ్రీ గారూ మంచి విషయాన్ని చెప్పిన మీ కవిత బాగుందండీ..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజి గారూ!...
   కవిత మీకు నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 5. చీమ తన కన్నా ఆరు రెట్లు బరువు లాగా గలదు............
  కానీ మన రిక్షా తాత 60 రెట్లు బరువు లాగుతూ బ్రతుకు బండిని లాగుతున్నాడు
  చీమ అతనికి స్పూర్తి .........మనకు అతను స్పూర్తి .....విష్ణుప్రియ

  ReplyDelete
  Replies
  1. మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...
   మీరు చెప్పింది నిజమే విష్ణుప్రియ గారూ!
   @శ్రీ

   Delete