19/05/2012

నీ దివ్య నేత్రాలు
శ్రీ || నీ దివ్య నేత్రాలు ||

ప్రభూ!
నీ దివ్యచక్షువులను దర్శించాక,
ఇక యే చంచలనేత్రాలను
చూడ మనసగుటలేదు...

సుందరనయనాలెన్నో  చూసానింతవరకు,
వాటిలోనే మూర్ఖంగా వెతుక్కున్నాను 
అందాన్ని యింతకాలం...

నీ  నేత్రాలలో
విశ్వజనీనమైన  వాత్సల్యం
అవ్యాజమైన ప్రేమ
మలయపు చల్లదనం
నేడు మనో నేత్రానికి గొచరమౌతున్నయి 

ఒకకంటితో   
సూర్యుని  ధవళ కాంతులను  శాసిస్తూ,
వేరొక  కంటితో
ఈ జగతికి 
వేయి పున్నముల వెలుగునిస్తున్నావు.

నీ నయనాలు
జలపుష్పాలను తలపిస్తూ 
నీరజ దళాలంత
నిశ్చలంగా  ఉన్నాయి.
చలాచలానికి సాక్షిగా...


ఆ  చూపులచల్లదనం  
నాపై ఎపుడూ ప్రసరించనీ ...
ఆ  నేత్రద్వయం
చూపే  వెలుగులో  నీ సన్నిధి చేరనీ...   @శ్రీ 

                                                                           

19 comments:

 1. నీలమొహనుని నయనములు వర్ణించ మీ తరమే అగునండీ 'శ్రీ' గారు.

  అమొఘం గా రాసారు.చాలా చాలా చాలా బాగుంది.
  ఆ స్వామి చల్లని చూపు మీపై నిరంతరం కురియాలని ఆశిస్తూ..

  --సీత

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సీత గారూ!
   మీకు నా మనోభావాలు నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 2. సూపర్.... ఎంత చక్కగా రాసారో....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సాయి గారూ!
   @శ్రీ

   Delete
 3. 'శ్రీ' గారు..
  స్వామి దివ్య నేత్రాలు,మీ కవిత రెండూ చాలా బాగున్నాయండీ..

  ReplyDelete
  Replies
  1. చిత్రం, కవిత మీరు మెచ్చినందుకు
   ధన్యవాదాలు రాజి గారూ!
   @శ్రీ

   Delete
 4. endadi okkasariga bhkthiloki vachhesaru,
  bhgundi, keep writing.

  ReplyDelete
  Replies
  1. భక్తీ, రక్తి, ముక్తి అన్నీ కావాలండీ!
   కామి కానివాడు మోక్షగామి కాడు అని
   పెద్దలు ఎపుడో చెప్పారు కదండీ!..
   :-)...
   ధన్యవాదాలు మీకు...@శ్రీ

   Delete
 5. "ఒక కంటితో సూర్యుని ధవళ కాంతులను శాసిస్తూ,
  వేరొక కంటితో ఈ జగతికి
  వేయి పున్నముల వెలుగుని ప్రసాదిస్తున్నావు."
  చాలా బాగుందండి శ్రీ గారు.అలవోకగా ఇలా కవితలల్లేస్తున్న మీకు అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ కనులలో ప్రేమనీ భక్తినీ చూడ గలగటమే భావుకత, కవిత బాగుంది

   Delete
  2. నేను వ్రాసింది చదివాక ....
   నాక్కూడా ఈ భావం బాగా నచ్చిందండీ!
   మీ అభిరుచికి, మీ అభినందనలకి, మీ ప్రశంసకి
   ధన్యవాదాలు వెన్నెల గారూ!
   @శ్రీ

   Delete
  3. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
   @శ్రీ

   Delete
 6. sir chinna request
  maalika, koodali, jalleda laki ela
  kalavalandi.

  ReplyDelete
 7. maalika:admin@maalika.org కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి.

  koodali:మీ బ్లాగుని కూడలిలో చేర్చాలనుకుంటే, support@koodali.org కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి.
  మీరు మెయిల్ పంపిన తర్వాత మీ బ్లాగు కూడలిలో కనబడడానికి దాదాపు ఒక రోజు నుండి రెండు రోజుల వరకు పట్టవచ్చు.
  jalleda:మీ బ్లాగును కలపండి అనే లింక్ లెఫ్ట్ సైడు దొరుకుతుంది...
  దానిపై క్లిక్ చేస్తే మీరు మీ బ్లాగ్ కలపవచ్చు ..
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. vatiki endukano mail velladamledu sir,
   i will try.
   thank you sir.

   Delete
 8. ఏం మాస్టారూ... ధనుర్దాసు గుర్తొచ్చాడా... బాగుబాగు

  ReplyDelete
  Replies
  1. ప్రేమ కవితలు వ్రాస్తే...
   ఒకలా అంటారు...
   భక్తి కవితలు వ్రాస్తే
   ఇలా అంటారు...
   :-)...
   కష్టమండీ ఫణి గారూ!
   కవిత నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు....
   మీరేమీ అనుకోకపోతే మీ వివరాలు
   నాకు మెయిల్ చేయండి...
   @శ్రీ...

   Delete