03/06/2012

"నా ఏకాంతం......అత్యంత స్పష్టంగా"


నిను  చూడాలని ఉన్నప్పుడు 
కనులు మూసి.....నీ రూపాన్ని తలచుకుంటూ..
నీతో గడిపిన వెన్నెల రాత్రులు గుర్తు చేసుకుంటూ...
నీతో ఉన్నప్పటి మధుర క్షణాలను
మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ.... 
అలా స్వప్నాల  లోనికి మెల్లగా జారుకుంటాను.... 

నీ ప్రణయ పరిమళాన్ని చూస్తాను...
నీ స్నేహసౌరభాన్నీ  చూస్తాను....
ఇంకా ఎన్నో.......కంటికి కనిపించని భావాలు... 
అనుభూతుల ద్వారా మాత్రమే తెలుసుకోనేవి..
ఒకదాని వెనుక మరొకటి...
చలనచిత్రం లోని దృశ్యాల్లా కదులుతూ ఉంటాయి మెల్లగా...

నీ రూపం మాత్రం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది...
మంచు  తెరల చాటు ముగ్ధ కుసుమంలా...
మేఘ మాలికల చాటు చంద్రబింబంలా...

కనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని 
భయపడుతూనే....
నిన్ను చూడాలనే తపనతో
కనులు తెరిచి చూస్తాను.....

నా ఎదురుగా నను వెక్కిరిస్తూ కనిపిస్తుంది  
"నా ఏకాంతం......అత్యంత  స్పష్టంగా" ..... 

24 comments:

 1. Replies
  1. మీకు ధన్యవాదాలండీ!
   స్వాగతం నా బ్లాగ్ కి
   @శ్రీ...

   Delete
 2. wow

  కనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని

  భయపడుతూనే....

  నిన్ను చూడాలనే తపనతో

  కనులు తెరిచి చూస్తాను.....
  super andi

  ReplyDelete
  Replies
  1. ప్రిన్స్ .... ధన్యవాదాలండీ!
   మీకు నా కవితలోని భావాలు నచ్చినందుకు...
   @శ్రీ...

   Delete
 3. శ్రీ గారూ , మీ కవిత చదువుతుంటే శ్రీనాదుడు వచన కవిత్వం రాసినట్లుంది . అక్షరాలన్నీ తేనె అలల మీద తేలియాడుతున్నాయా? అని సందేహం కలుగుతుంది . చక్కటి పదాల పొందిక , రమణీయమైన వర్ణన . సార్ మీ కవితలు ఈ మద్య కొత్తగా ఉంటున్నాయి . అంటే చాలా బాగున్నాయి అని అర్ధం .

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ! నా పదాలు ,అక్షరాలు అలా తేలుతున్నాయో లేదో గాని నేను మాత్రం గాలిలో తేలిపోతున్నానండీ!
   :-))))
   నేను ఎలాగూ "శ్రీ "నాథుడినేనండీ!...:-))
   మీకు నా మనో భావాలు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది...
   @శ్రీ

   Delete
 4. మంచి పరిశీలన...కలలెందుకు ఏకాంతమంత స్పష్టంగా ఉండవు?
  భావాన్ని చలా చక్కగా కవితలో పొందుపరచారు...
  Simply Superb!

  ReplyDelete
  Replies
  1. కవితలోని లోతును గ్రహించినందుకు
   కవితను మీరు మెచ్చినందుకు
   మీకు ధన్యవాదాలు 'చిన్ని ఆశ' గారూ!
   @శ్రీ

   Delete
 5. chala bhagha raasaaru sir,
  nice one.

  ReplyDelete
  Replies
  1. కవిత మీరు మెచ్చినందుకు
   మీకు నా ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   @శ్రీ

   Delete
 6. అనిర్వచనీయమైన ఆ జ్ఞాపకాలను కవితలో అందంగా పొదిగారు.

  ReplyDelete
  Replies
  1. రవిశేఖర్ గారూ!
   నా పదాల అమరిక మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలండీ!
   @శ్రీ

   Delete
 7. చాలా బాగుంది.. శ్రీగారు...

  ReplyDelete
  Replies
  1. సాయి గారూ!
   ధన్యవాదాలండీ మీకు...
   @శ్రీ

   Delete
 8. కనురెప్పలు మూతపడితే..
  క్షణం క్షణం కలల కలకలం.
  కనులు తెరిచి చూస్తేనేమో..
  నువ్వొదిలి వెళ్ళిన ఒంటరితనం.

  కవిత చాలా బాగుంది శ్రీ గారు.చిత్రం గురించి మళ్ళీ చెప్పను..default value assigned already! all the pictures you choose are simply superb!

  ReplyDelete
  Replies
  1. కవితలోని సారాన్ని అలా నాలుగు వాక్యాల్లో చక్కగా చెప్పారండీ!
   చిత్రం, కవిత మిమ్మల్ని ఆకట్టుకుందంటే చాలా సంతోషం.
   మీకు ధన్యవాదాలు వెన్నెలగారూ!
   మీరు మీ బ్లాగ్ లో వ్యాఖ్యలకి ప్రతిస్పందనగా వ్రాసారు
   "కవిత కంటే వ్యాఖ్యలే ఎక్కువ సార్లు చదువుతాను"
   నేను కూడా డిటో...:-))
   నేను చేసిన వ్యాఖ్యకి వారి ప్రతిస్పందన కూడా నేను అంతే ఆశక్తితో
   వాళ్ళ బ్లాగ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాను...!..:-)
   @శ్రీ

   Delete
 9. శ్రీ గారు,
  అందమైన భావాలను మరింత అందంగా చెప్పారు. బాగుంది.
  జలతారువెన్నెల గారు,
  పై మాటలు మీవా? మీ వ్యాఖ్య చూసి కోట్ చేశారు చాలా బాగుంది అనుకుంటూ వచ్చాను. జిస్ట్ మీరిలా చెప్పారన్నమాట. చాలాబాగుందండి.

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారి కవిత చదివాక నాకు కలిగిన స్పందన ఆ నాలుగు లైన్లో అలా..తెలిపాను లక్ష్మి దేవి గారు!మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మో శ్రీ గారు, ఇది మీ బ్లాగ్ యే నండి.. నాది కాదు అని ఇప్పుడే గుర్తొచ్చింది!

   Delete
  2. లక్ష్మీ దేవి గారూ!
   మీకు నా కవితా భావం నచ్చినందుకు ధన్యవాదాలు...
   వెన్నెలగారిని నాకవిత నచ్చక పోయినా...
   మంచి వ్యాఖ్య చేయమని చెప్తానండి
   :-)))
   @శ్రీ

   Delete
  3. వెన్నెలగారూ!...
   మీరు తస్మదీయులే కదండీ...:-)))
   అందుచేత మరేమీ అనుకోనండీ!
   @శ్రీ

   Delete
 10. అత్యంత స్పష్టం గా ,మధురం గా ఉంది మీ ఏకాంతభావం
  చాలా బాగుంది శ్రీ గారు :) :)
  ((అయినా మీరు ఏకాంతం గా ఎక్కడున్నారూ...!!??అనుక్షణం ,కలలో కూదా ఎదో ఒక భావన తో కలిసే ఉంటారు కదా..........!!) ;)

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకి చాలా చాలా ధన్యవాదాలు సీత గారూ! :-)
   మీరలా అంటే నేను ఏమి చెప్పనండీ!...:-)))))))
   @శ్రీ

   Delete
 11. బాగుంది ......కృష్ణ

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకి ధన్యవాదాలు కృష్ణ గారూ!
   @శ్రీ

   Delete