08/06/2012

నా వశంలో లేని 'నా మనసు'

చీకటి తెరలను పటాపంచలు చేస్తూ
తీవ్ర గతితో  ధరిత్రిని తాకేందుకు తొందరపడే 
భానుని తొలి కిరణంలా....

రెప్పలు తెరిచి ఆకాశం వంక ఆశగా చూసే 
ముత్యపు చిప్పలో పడి ముత్యమయ్యేందుకు
తపన పడే  స్వాతి చినుకులా...

చీకటైతే చాలు ముకుళిత పత్రాల కలువని తాకి,
పులకింప చేసి, వికసింప చేసేందుకు
వేగిరపడే వెన్నెలసోనలా...


తీరాన్ని తాకాలనే తొందరలో  వడి వడిగా పరుగులెత్తే 
పున్నమి రాత్రి  పోటెక్కిన 
సాగర తరంగంలా ......

'నీ రాక ' కోసమే ఎదురు చూస్తోంది  
నా వశంలో లేని 'నా మనసు',
నీవే కావాలని మారాము చేస్తున్న 'నా అల్లరి వయసు'.

16 comments:

 1. చీకటి తెరలను పటాపంచలు చేస్తూ తీవ్ర గతితో ధరిత్రిని తాకేందుకు తొందరపడే
  భానుని తొలి కిరణంలా. ... చక్కగా వర్ణించారు...

  చాలా బాగుంది శ్రీగారు...

  ReplyDelete
  Replies
  1. మీకు నా కవిత నచ్చినందుకు సంతోషం.
   మీకు ధన్యవాదాలు సాయి గారూ
   @శ్రీ

   Delete
 2. చీకటి తెరలను పటాపంచలు చేస్తూ
  తీవ్ర గతితో ధరిత్రిని తాకేందుకు తొందరపడే
  భానుని తొలి కిరణంలా..
  శ్రీ గారి కవితలకోసం
  మేము కూడా అలానే
  ఎదురు చూస్తూ ఉంటాము...

  (చాలా బాగుంది సర్)

  ReplyDelete
  Replies
  1. మీకు నా కవిత నచ్చినందుకు సంతోషం.
   మీరు ఎదురుచూస్తున్నాము అంటే పొంగిపోతున్నాను ప్రిన్స్.
   మీకు ధన్యవాదాలు.
   @శ్రీ

   Delete
 3. nice chaala bhagundandi.

  ReplyDelete
  Replies
  1. మీరు నా కవిత మెచ్చినందుకు సంతోషం.
   మీకు ధన్యవాదాలండీ!
   @శ్రీ

   Delete
 4. వావ్..సూపర్ శ్రీ గారూ .....చక్కగా వర్ణించారు.....

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చేసిందంటే....
   చిన్నా పెద్దా అందరికీ నచ్చేసినట్లే సీత గారూ!
   :-))
   మీకు ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 5. శ్రీగారూ, మీ కవిత బాగుంది అనే కంటే అబిసారిక లోని ఆవేదనా, రాద పడే తపనా , ఉన్నాయి అనవచ్చు. దానికి తోడు మీరు వినిపించే ఆ పాట. అధ్బుతం. ఈ మద్య మీ కవితలు కొత్తగా అందంగా ఉంటున్నాయి .

  ReplyDelete
  Replies
  1. ఫాతిమా గారూ!
   మీలాంటి రచనాకారుల పొగడ్తలు మాలాంటి చిరుకవితలు వ్రాసేవారికి
   ప్రోత్సాహాన్ని ఇస్తాయండీ!
   మీ పరిశీలనకు...మీకు పాట నచ్చినందుకు ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
  2. శ్రీ గారూ , మీ పొగడ్తకి నేను అర్హురాలనో కానో గానీ మీ కవితల్లో పండువెన్నెల కనిపిస్తుంటే , నా కవితలు ఎండా వేడిమిని తలపిస్తుంటాయి. ఈ మద్య మీ కవితలు వసంతుడిని వెంటపెట్టుకొని వస్తున్నాయి , సరదాగా అన్నాను అన్యదా భావించకండి .

   Delete
  3. మీరలా అంటే....
   నిరంతరమూ వసంతములే...
   అనుకుంటూ ముందుకి సాగిపోతాను...
   :-)..:-)
   ధన్యావాదాలు ఫాతిమా గారూ!
   @శ్రీ

   Delete
 6. Simply superb Sri gaaru.
  idi choosaaraa?
  http://maditalapulu.blogspot.com/2012/03/blog-post_1165.html

  ReplyDelete
  Replies
  1. :-))
   వెన్నెల గారూ!
   నీను మీ బ్లాగ్ చూసినపుడు పాట టపాలలో మీ కవిత చదివానండీ!
   అదే చిత్రం నాకవితకి ఎంచుకోవడం యాదృచ్చికం....
   చిత్రం నాకు గూగుల్ లో ఇంతే దొరికింది....
   మీ పూర్తి చిత్రం ఇంకా బాగుంది....
   ఆ చిత్రంపై కవిత వ్రాసిన మీరు సూపర్బ్ అంటే...
   బోలెడు కామెంట్స్ తో సమానమండీ!:-)
   మీకు ధన్యవాదాలు వెన్నెలగారూ!
   @శ్రీ

   Delete
 7. మీ కవిత చదివాము .....
  బాగుంది. ..కృష్ణ,విష్ణుప్రియ...

  ReplyDelete
  Replies
  1. నా కవిత మీకిద్దరికీ నచ్చినందుకు ధన్యవాదాలు
   కృష్ణ ప్రియ గారూ!
   @శ్రీ

   Delete