16/09/2012

గానామృత సామ్రాజ్ఞి


నీవు గళం విప్పితే...

కోకిలలు సిగ్గు పడతాయి...
ఇంత చక్కని గొంతు 
మాకు లేదెందుకని...

చిలుకలు చిన్న బుచ్చుకుంటాయి 
ఆ పలుకుల  తీయందనం... 
మా సొంతమెందుకు  కాలేదని...

'సరిగమలు' నీ గొంతులో 
కొత్త విన్యాసాలు చేస్తాయి...
శాస్త్రీయ బద్ధమైన నృత్యాలే చేస్తాయి...

తాము వ్రాసిన కీర్తనలు 
సార్థకం అయినందుకు 
ఆనందపడతారు 
అన్నమయ్య,  త్యాగయ్యలు 

ఎన్ని పాపాలు చేసినా 
గంగలో ఒక్క స్నానంతో 
పోయినట్లు...

అర్థం కాని భాషతో...
చెవులు బద్దలయ్యే రణగొణ ధ్వనుల 
సంగీత నేపధ్యంలో 
కర్కశంగా పాడే పాటలు  విన్న చెవులు...

అమృతప్రాయమైన  నీ గానంతో 
పరిశుద్ధమౌతాయి...
తిరిగి మంచి సంగీతం వినేందుకు 
సన్నద్ధమౌతాయి...

(సంగీత సామ్రాజ్ఞి  భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి సమర్పితం).....@శ్రీ 


10 comments:

 1. శ్రీ గారూ , చిత్రం చూసి కవిత రాస్తారని తెలిసింది, కానీ సందర్బాన్ని బట్టి కూడా రాయగలరని ఇప్పుడు అర్దమైంది, సర్, అతిశయోక్తి కాదు
  ఓ గొప్ప గాయని గూర్చి అంతే గొప్పగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. మెరాజ్ గారూ!
   పేస్ బుక్ లో రెండు లైన్లు వ్రాసి పోస్ట్ చేద్దామంటే...
   టైపు చేస్తుంటే పెరుగుతూ పోయింది...
   అంతే..ఆలస్యమెందుకని బ్లాగ్ లో పెట్టేసాను...
   మీకు నచ్చినందుకు, మీ ప్రశంసకి ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 2. కవిత బాగుంది .
  ఎం ఎస్స్ గార్కి పదాభివందనములతో ....ప్రత్యూష

  ReplyDelete
  Replies
  1. ప్రత్యూషా!
   నా భావం నచ్చినందుకు...
   ధన్యవాదాలు...
   అవును.. ఆవిడకి పదాల పదాభివందనమే...
   @శ్రీ

   Delete
 3. గొప్ప గాయనిని గుర్తుకు తెచ్చారు.

  ReplyDelete
  Replies
  1. అవును రవిశేఖర్ గారూ!
   అలాంటి వారు దైవాంశ సంభూతులు...
   మన చెవులు పుణ్యం చేసుకున్నాయి గనుక
   మనం ఆవిడ గొంతు వినగాలిగాం...
   కనులు పుణ్యం చేసుకున్నాయి గనుక
   ఆవిడను చూడగలిగాం...
   ధన్యవాదాలు మీ స్పందనకు
   @శ్రీ

   Delete
 4. అమృత గాయని కి సమర్పిస్తూ మీరు ఆవిడపై రాసిన కవితా ఎంతో అందంగా ఉంది.
  భారరత్న కి మీరు సమర్పించిన రత్నం లా....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
   మీ స్నేహపూర్వకమైన ప్రశంసకు.
   @శ్రీ

   Delete
 5. శ్రీ గారు!
  గానామృత సామ్రాజ్ఞి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి మీరు అక్షర కుసుమాలతో సమర్పించిన ఈ కవిత చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ!
   ఈ అక్షర నివాళి
   మీకు నచ్చినందుకు,
   మీ ప్రశంసకు
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete