18/09/2012

గణేశ శరణం...శరణు గణేశా...

అయోనిజుడవు నీవు...
తల్లి ప్రేమతో ప్రాణం 
పోసుకున్న నలుగు పిండి బొమ్మవు నీవు...

తల్లి రక్షణకు ప్రాణమిచ్చిన
మాతృ వాక్పరిపాలకుడవు నీవు...

తల్లిదండ్రులే  విశ్వరూపమని 
తెలియజెప్పావు నీవు...
కుశాగ్ర బుద్ధితో తొలిపూజ 
అందుకుంటున్న వేలుపు నీవు...


ప్రకృతికి  దగ్గరగా ఉండమన్నది నీ పూజ...
ఫల పుష్ప పత్రాదుల పూజకి అదే అర్థం... 

నేడు కృత్రిమ రసాయనాల సమ్మేళనం
నీ మూర్తి నిర్మాణం...
జలాలను చేస్తున్నారు  కలుషితం...
ముందు తరాలకు మిగులుస్తున్నారు
ప్రదూషిత పర్యావరణం...

అంతా యోచించండి...
మట్టి గణపతులనే అంతటా ప్రతిష్టించండి...
ప్రకృతికి దగ్గరగా ఈ ఉత్సవాలను జరుపుకోండి...   @శ్రీ 
21 comments:

 1. శ్రీ గారు!
  'శరణు గణేశా' అంటూ భక్తితో గణేశున్ని స్తుతించారు.
  అందరినీ ఆలోచించమంటూ భాద్యతాయుతంగా పర్యావరణం గురించి సందేశమించారు.
  చక్కటి కవితని అందించారు...అభినందనలండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భారతి గారూ!
   మీ స్పందనకు, ప్రశంసకు...
   ఓం గం గణపతయే నమః
   వినాయక చవితి శుభాకాంక్షలు....
   విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
   మీ కుటుంబ సభ్యులకు సదా,
   సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
   క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
   సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
   @శ్రీ

   Delete
  2. శ్రీ గారు! ధన్యవాదాలండి.
   ఓం గం గణపతయే నమః
   మీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలండి.

   Delete
 2. బాగుంది శ్రీ గారు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు హర్షా!
   ఓం గం గణపతయే నమః
   వినాయక చవితి శుభాకాంక్షలు....
   విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
   మీ కుటుంబ సభ్యులకు సదా,
   సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
   క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
   సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
   విద్యాభివృద్ధి రస్తు...
   @శ్రీ

   Delete
 3. వినాయక చవితి శుభాకాంక్షలండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   ఓం గం గణపతయే నమః
   వినాయక చవితి శుభాకాంక్షలు....
   విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
   మీ కుటుంబ సభ్యులకు సదా,
   సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
   క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
   సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
   @శ్రీ

   Delete
 4. బాగుంది పర్యావరణానికి మీవంతు చేయి కవితా రూపంలో....
  మీకూ మా "చిన్ని ఆశ" వినాయక చవితి శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
   నా ప్రయత్నాన్ని హర్షించినందుకు...
   ఓం గం గణపతయే నమః
   వినాయక చవితి శుభాకాంక్షలు....
   విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
   మీ కుటుంబ సభ్యులకు సదా,
   సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
   క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
   సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
   @శ్రీ

   Delete
 5. Vinayaka chaviti Shubhabhinandanalu.There is a very nice poet in you , all the best sri garu...!!!

  ReplyDelete
  Replies
  1. మీకు కూడా శుభాభినందనలు...
   మీ ప్రశంసకి, ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు మూర్తి గారూ!
   @శ్రీ

   Delete
 6. chaalaa baavundi. avagaahana kalginchelaa.. abburamgaa vraasaaru. chaalaa baavundi Sree gaaru.

  Thank you very much.

  ReplyDelete
  Replies
  1. చాలా ధన్యవాదాలు మీ ప్రశంసకి...
   మీకు నాభావం నచ్చినందుకు...
   వనజ గారూ!
   మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...
   @శ్రీ

   Delete
 7. బాగుందండీ.... మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

  ReplyDelete
  Replies
  1. సుభ గారూ!
   మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...
   ధన్యవాదాలు నా భావం నచ్చినందుకు.
   @శ్రీ

   Delete
 8. "శ్రీ" గారూ..
  'శరణు గణేశా'అంటూ వినాయకచవితి శుభాకాంక్షలతో పాటూ
  మంచి సందేశం కూడా బాగుందండీ..
  మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు..

  ReplyDelete
 9. రాజి గారూ!
  మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు...
  ధన్యవాదాలు మీ ప్రశంసకు,
  పర్యావరణ రక్షణ సందేశం నచ్చినందుకు.
  @శ్రీ

  ReplyDelete
 10. సర్, ఒకరోజు ఆలస్యంగా చెప్తున్నందుకు క్షమించాలి.
  మీకు ఎలాంటి విగ్నాలు కలగకుండా , మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
  మరోసారి మీ కవితల్లో అర్ధముందని దేవుని సాక్షితో ఆయన ముందే మీకవితాప్రసాదాన్ని పెట్టారు.

  ReplyDelete
 11. ధన్యవాదాలు మెరాజ్ గారూ!
  మీకు మీ కుటుంబాన్ని కూడా ఆ గణేశుడు
  సర్వదా కాపాడుతూ ఉండాలని కోరుతూ...
  @శ్రీ

  ReplyDelete
 12. మీ పర్యావరణ సందేశం బాగుంది.మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
   మీకు, మీ కుటుంబానికి కూడా ఆ గణేశుని ఆశీర్వాదం
   ఎపుడూ తోడు ఉండాలని కోరుకుంటూ...
   @శ్రీ

   Delete