21/09/2012

వారికెందుకు తెలియదంటావ్???
నీ కళ్లెప్పుడూ 
కలువరేకులతో
పోట్లాడుతూనే ఉంటాయి...

నీ చెవులెప్పుడూ 
శ్రీకారంతో
తగువులాడుతూనే  ఉంటాయి...

నీ గొంతు ఎప్పుడూ 
కోకిల పాటను
పరిహాసం చేస్తూనే ఉంటుంది...

నీ కనుబొమలెప్పుడూ
మదనుని  వింటిని 
వెక్కిరిస్తూనే ఉంటాయి...

నీ చూపులెప్పుడూ 
పూల బాణాలకు ధీటుగా 
బదులిస్తూనే ఉంటాయి...

నీ ఎర్రని పెదవులెప్పుడూ...
గులాబీ రేకులను
ఈసడిస్తూనే ఉంటాయి...

నీ మెడ ఎప్పుడూ
శంఖంతో 
పోరు పెట్టుకుంటూనే ఉంటుంది...

నీ  చేతులు 
తెల్లని తామరలని 
ఎదిరిస్తూ...
కాళ్ళని
కెందామరలతో కయ్యానికి 
కాలుదువ్వమంటూ  
ఉసిగొలుపుతూనే  ఉంటాయి...

అంతా 'నిన్ను' 'జగడాలమారి' 
అనుకుంటారు గానీ...
'సజాతి  ధ్రువాలు '
వికర్షించుకుంటాయని
వారికెందుకు తెలియదంటావ్???...@శ్రీ 

( చిత్రకారునికి కృతఙ్ఞతలు @శ్రీ )
           

22 comments:

 1. 'సజాతి ధ్రువాలు '
  వికర్షించుకుంటాయని
  వారికెందుకు తెలియదంటావ్???.
  అందమైన చిత్రానికి అమూల్యమైన భాష్యం. నా కైతే కలువ రేకులు,చెవులు వాటితో పాటు మిగతావన్నీ ఆమె సౌందర్యానికి అసూయ పడి, పోట్లాడుతున్నాయేమో అని అనిపించింది. Keep going Sree..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజ రావు గారూ!
   చక్కని ప్రశంసాపూర్వకమైన మీ స్పందనకు,
   మీ ప్రోత్సాహానికి...
   @శ్రీ

   Delete
 2. రమ్యమైన పోలిక. వర్ణన అద్భుతంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ!
   మీకు కవితా భావం నచ్చినందుకు
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 3. చక్కని చిత్రం అంతకు మించిన వర్ణన

  ReplyDelete
  Replies
  1. రవిశేఖర్ గారూ!
   ఎన్నుకున్న చిత్రం ,
   కవితలో వర్ణన మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 4. శ్రీ గారూ, మరో మారు నిరూపించుకున్నారు. చిత్రం, కవితా, పాట వేటికవే గొప్పగా ఎన్నుకోవటం లో మీదే పై చేయి అని.
  వర్ణనలో అశ్లీలత కానరాని భావ కవిత్వం మీది. ప్రతి లైన్ లోనూ ఏదో ఒక కొత్తదనం తేవాలనుకొనే మీ పద వరవడి బాగుంది....మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మేరాజ్ గారూ!
   ఎంపిక చేసుకున్న పాట,చిత్రం,
   వ్రాసిన కవితలోని భావం మీకు
   నచ్చి ,మెచ్చుకున్నందుకు
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 5. మంచి కవితకు చక్కని ముగింపు, అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ!
   ప్రతి టపాలోనూ ప్రోత్సాహంతో
   వెన్ను తట్టే మీ మిత్రత్వానికి ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 6. Replies
  1. సుభ గారూ!
   మీ చిరునవ్వులు కవిత నచ్చినట్లే చెప్తున్నాయి...:-)
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 7. మంచిభావం దానికి తగిన చిత్రం.

  ReplyDelete
  Replies
  1. మీ చక్కని ప్రశంసకు
   ధన్యవాదాలు
   పద్మారాణి గారూ!
   @శ్రీ

   Delete
 8. సజాతికి అంతతెలియక కాదులెండి, అలా నటిస్తేనే మీ మెప్పులు లభిస్తాయని:-)

  ReplyDelete
  Replies
  1. 'సజాతి' అలా ఉంటే...ఈ 'విజాతి'
   ఖచ్చితంగా మెచ్చుకుంటుంది పద్మ గారూ!:-)
   ధన్యవాదాలు మీ స్పందనకు...
   @శ్రీ

   Delete
 9. ఆ వికర్షణే పోట్లాటంటారా? ఏమో...
  చక్కని భావం...సుతిమెత్తగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. అవును చిన్ని ఆశ గారూ!
   అందుకేగా పోట్లాట...:-)
   మీకు కవితాభావం నచ్చినందుకు ధన్యవాదాలు
   @శ్రీ

   Delete
 10. Replies
  1. అవినేని భాస్కర్ గారికి
   'శ్రీ' కవితలు స్వాగతం పలుకుతోంది...
   ధన్యవాదాలు మీ ప్రశంసకు...
   @శ్రీ

   Delete
 11. సృష్టి ధర్మం.

  ReplyDelete
 12. అంతే...అంతే...:-)
  మీ స్పందనకు
  ధన్యవాదాలు శర్మ గారూ!

  ReplyDelete