24/10/2012

చలించని హృదయం
ఏటిలోని తెల్లకలువలు కోసి
నీకిచ్చే నేను...
         నిర్దాక్షిణ్యంగా వాటి రేకులను 
         ఒక్కక్కటే తుంచుతూ నీవు...

అక్షరమక్షరం కూర్చి నీకోసం
పత్రాలు వ్రాసే నేను...
         ప్రతి లేఖనూ చిన్నచిన్న ముక్కలు
         చేసి పైకెగరేసే నీవు...

నా మనో భావాల మాలికలల్లి
నీకు సమర్పించే నేను
         ఒక్క భావానికి కూడా 
         చలించని హృదయంతో నీవు...

ప్రేమ మందిరం కోసం 
చలువరాళ్ళు సేకరిస్తూ నేను 
          ప్రేమకు సమాధి కట్టేందుకు
          ఇటుకలు పేరుస్తూ నీవు...

ప్రేమ విజేతనవ్వాలనే
తపనతో నేను...
          ఈ పోటీలో గెలుపు 
          నీదేనన్న ధీమాతో నీవు...
        
నీ ప్రేమ కోసం అహరహం
ఎదురు చూపులు చూస్తూ నేను ...
          నా  ప్రేమను నీ ద్వేషాగ్నిలో 
          దగ్ధం చేస్తూ నీవు...                    @ శ్రీ  


14 comments:

 1. Replies
  1. thank u prince...for ur nice comment...@sri

   Delete
 2. పతి పనిలోనూ వ్యతిరేకంగా ఉన్న మనస్తత్వంతో ఎంతటి బాద ఉంటుందో మీ కవితలో తెలుస్తుంది.
  తన భావుకతను గుర్తించలేదని ఓ మనస్సు పడే వేదన కనిపిస్తుంది..
  కవిత చాలా సరళమైన భావాలతో స్వచ్చంగా సాగింది బాగుంది శ్రీ గారు.

  ReplyDelete
  Replies
  1. అవును మెరాజ్ గారూ!...
   భావుకత ఉన్న వ్యక్తి...ఆ భావుకతను
   ఆస్వాదించలేని హృదయంతో చేసే పోట్లాటని ఇతివృత్తంగా
   తీసుకున్నానీసారి...ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...@శ్రీ

   Delete
 3. వ్యతిరేక ధృవాలు ఆకర్షించబడతాయని అలా తను మీ నుండిగట్టి బంధాన్ని కోరుతూ....:-) అర్థం చేసుకోవాలి అంతే (ఇది కేవలం హాస్యానికేనండోయ్)

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ!
   ఏదో నా కవితలో సజాతి, విజాతి అన్నాను కదా!
   అలా అని అన్నిట్లో అదే అంటే ఎలా???
   అర్థం చేసుకొనే ప్రయత్నం తప్పక చేస్తా!...:-)
   ధన్యవాదాలు మీ స్పందనకు...@శ్రీ

   Delete
 4. హ్మ్...
  భిన్న ధృవాల ఆకర్షణ జీవం లేని వాటికే పరిమితం ఏమో.
  ప్రేమా, ద్వేషం ఎప్పుడూ జత కట్టలేవు కదూ.
  నిజమే....జతై మందిరం కట్టాలని ప్రయత్నించినా చివరికి మిగిలేది సమాధే...
  ఆలోచన కి కవితా రూపం చక్కగా ఇచ్చారండీ శ్రీ గారూ!

  ReplyDelete
  Replies
  1. అవును చిన్ని ఆశ గారూ!...
   ప్రేమ... ద్వేషం... ఒకదానికింకోటి విలోమానుపాతంలో
   (inversely proportional గా )
   ఉంటాయి కదా!...
   నా భావాన్ని విశ్లేషించినందుకు ధన్యవాదాలు మీకు...@శ్రీ

   Delete
 5. "నువు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
  మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా
  ప్రేమించు మించకపో ప్రేమిస్తునే ఉంటా ...
  నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంటా"

  అంటూ ఒక మనసు కోసం మరో మనసు పడే ఆవేదనను చక్కగా చెప్పారండీ..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజి గారూ!
   మొత్తం కవితాసారాన్ని అలా తేలికైన నాలుగు పంక్తులలో చెప్పారు...:-)
   చాలా బాగుంది...@శ్రీ

   Delete
 6. ఇంతగా వివరించి ప్రేమని వ్యక్తపరచిన తర్వాత కూడా.. ఆమె స్పందించకపోతే ? :(

  కానీ ప్రేమించడం మానకండి. వినిపించగా.. పించగా..పించగా.. ఆమె హృదయ క్షేత్రంలో ప్రేమ బీజం మొలకెత్తదా !

  ఓర్పు కావాలండి దేనికైనా..కవి హృదయానికే చెప్పాను..శ్రీ గారు. :)..

  ReplyDelete
  Replies
  1. కానీ ప్రేమించడం మానకండి. వినిపించగా.. పించగా..పించగా.. ఆమె హృదయ క్షేత్రంలో ప్రేమ బీజం మొలకెత్తదా !...:-)... :-)

   చాలా రోజులకి చక్కని సరదా వ్యాఖ్య మీనుంచి...:-)
   అంతే..అంతే...ప్రయత్నం మానకూడదని కవికి ఇప్పుడే మళ్ళీ చెప్పాను మీ మాటగా...:-)
   ధన్యవాదాలు వనజ గారూ!...@శ్రీ

   Delete
 7. వ్యకతపరచిన వాటికంతా వ్యతిరేకతేనా మరీనూ...
  మీరు కూడా భింకం వహించండి:) బాగుందండి మీ కవిత

  ReplyDelete
 8. పద్మా రాణి గారూ!
  ఒక్కక్కళ్ళు ఒకో సలహా ఇస్తున్నారు వారికి తోచింది...
  మీ సలహా పాటించేస్తాను...
  తేడా వస్తే...మీ బ్లాగ్ లోకి వచ్చి మరీ పోట్లాడుతాను...
  @శ్రీ

  ReplyDelete