ముఖంగా
చేసుకొని
చంద్రాననవే
అయ్యావు...
కనిపించవనేమో!..
చంద్రవంకను
రెండుగా తుంచి
కాటుక
అద్ది కళ్లపై
అలంకరించుకున్నావు!
శరచ్చంద్రికలు
నీ
దరహాసాల్లో దాగిన విషయం
నీవు
దాచినా
దాగేవి
కాదుగా!
వెన్నెలలో
తడిసి మురిసే
కలువ రేకులనే కదా
నీ
నేత్రద్వయం చేసుకున్నావు!
శశాంకునికి
ప్రియమైన
తారాకాంతులనే
కదా
కళ్ళలో
నింపుకున్నావు!
నెలవంకలను
నిలువుగా
చేసి
నీ
నడుము వంపులు
చేసుకోమని
చెప్పింది
ఎవరో?
జాబిల్లికి
జన్మనిచ్చిన
క్షీరసాగారాన్నే
ఉదరంగా
చేసుకున్నావే?
మందర
పర్వతం చిలికిన
గుర్తు
కూడా వదలకుంటివే?
చంద్రకాంతులు
కనిపించడమే
కాదు
వినిపిస్తాయి
కూడా
నీ
పాదాలనల్లుకొని!
శరద్వెన్నెలరాజు
సోయగం
చూడాలంటే
అంతా
ఓ సంవత్సర కాలం
వేచి
చూస్తారు...
నిత్యం
ఆ
శోభలు
నాకంటికి
శోభనిస్తాయనే విషయం
అందరికీ
ఎందుకు చెప్పనీయవూ ?... @ శ్రీ
enta baagaa varnistaro chaalaa baavundi.Nijamgaa akshara nakshatraale mi kavitaaksharaalu....
ReplyDeleteమీ అభినందనా సుమాలతో పరిమళించింది
Deleteనా అక్షర నక్షత్ర మాల....
మీ చక్కని ప్రశంసకు ధన్యవాదాలు మంజు గారూ!....@శ్రీ
ఆహా, ఏమి వర్ణన.....సో స్వీట్...
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారూ!
Deleteమీకు నా భావాలు నచ్చినందుకు....@శ్రీ
wow sri gaaru meeru kekoooo keka
ReplyDeleteఅమ్మో ప్రిన్స్!...కేకంటే...ఇంకేమంటాను?..:-)...అయినా మీరీమధ్య
Deleteమీ బ్లాగ్ లో కేక లాంటి పాటలేవో పెడుతున్నారు కదా!...:-)
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు...@శ్రీ
చిత్రానికి తగ్గ అధ్భుతమైన వర్ణన.....
ReplyDeleteఅభినందనలు అందుకోండి.....
పద్మ గారూ!
Deleteనిన్న శరత్పూర్ణిమ అని చంద్రుడికి పాయసం తో పాటు
ఓ కవిత కూడా నివేదిస్తే బాగుంటుందేమో అని వ్రాసాను
ఇది కవిత వ్రాసాకే చిత్రం వెదికాను...
ధన్యవాదాలు మీకు కవితాభావం నచ్చినందుకు...@శ్రీ
చందమామ వెన్నెలా సోయగం అంతా వడ్డాది గారు బొమ్మలో చూపిస్తే మీరు కవితలో కురిపించారు...
ReplyDeleteఈ ప్రశంసతో వెన్నెల కురిపించేసారు చిన్ని ఆశ గారూ!
Deleteఆయన చిత్రాలు అద్భుతం..వర్ణనాతీతం అనిపిస్తాయి...
కవితకి చిత్రానికి సారూప్యం ఉంటె అది నా భాగ్యం...
ధన్యవాదాలు మీకు...@శ్రీ
అమ్మాయి అందంపై అందమైన కవిత....బాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు అనికేత్
Deleteమీకు అందాన్ని వర్ణించిన తీరు నచ్చినందుకు...@శ్రీ
Nice!!!
ReplyDeletethank you very much harsha!
Deletefor your nice compliment...@sri
శ్రీ గారు, చిన్నప్పుడు చందమామ బుక్ మీద బొమ్మను చూసి
ReplyDeleteఎంత బాగుందో ఇలాంటి అక్క ఉంటె ఎంత బాగుందో అనుకునే దాన్ని,(అప్పట్లో అది వ,పా. గారి బొమ్మ అని తెలీదు, పసి మనసులు ఎప్పుడూ వయస్సులో ఉన్న స్త్రీ బొమ్మని చూస్తె ఆమెలో అక్కని చూస్తారేమో )
అయితే ఇన్నాళ్ళకి ఆ అక్కకి ఓ చక్కని మామని తెచ్చిపెట్టి, చల్లని కవిత రాసిపెట్టారన్న మాట.:-))
కవిత చాలా బాగుంది, మీ శైలిలో.
ధన్యవాదాలు మేరాజ్ గారూ!
ReplyDeleteమీ చల్లని స్పందనకు...
ఆయన చిత్రాల అందం మిగిలిన చిత్రకారుల చిత్రాలతో పోలిస్తే
భిన్నమైన అందం కనిపిస్తుంది...@శ్రీ
శ్రీ గారు,
ReplyDeleteవెన్నెల కురిపించేశారు భావంలో.........!! చాలా బాగుంది.
ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ!...
Deleteనేను చందమామ..వెన్నెల అని వ్రాస్తే...
మీ వ్యాఖ్య ఉంటుందన్దోయ్...
చల్లని కామెంట్ పెట్టి వెడతారు...
ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు!@sri