19/10/2012

యా దేవీ సర్వ భూతేషు



"శైల పుత్రి" గా ఉద్భవించావు. 
హిమవంతునికి తనయవయ్యావు...

శివుని కోరి తపమాచారించావు.
అకుంఠిత దీక్షతో "బ్రహ్మచారిణి" వైనావు...

దశ హస్తాలతో...దశాయుధాలతో దర్శనమిచ్చావు.
"చంద్రఘంట"వై చల్లగా చూసావు...

అష్ట సిద్ధులు నవనిధులు ఇచ్చే మాతవైనావు.
అష్టభుజివై..."కూష్మాండ" వై  కొలువు తీరావు... 

షణ్ముఖునికి జన్మనిచ్చి  "స్కందమాత"వైనావు.
ఆ రూపంతో కాళిదాసుని కరుణించిన అమ్మవైనావు...

త్రిమూర్తుల తేజస్సునే తీసుకున్నావు.
లోకహితం కోరి  "కాత్యాయని"గా అవతరించావు...

తంత్ర సిద్ధులు కోరే  తాంత్రికుల దేవతగా మారావు...
అనుచర గణాలతో  "కాళరాత్రి"వై పూజలందుకున్నావు...

వేల ఏళ్ళ  ఘోరతపానికి నల్లబడినావు..
శివుని స్పర్శతో గంగ శుద్ధితో "మహాగౌరి"వైనావు...

శివుని అర్చనకు నోచుకున్నావు...
అష్టాదశ సిద్ధులను అనుగ్రహించి "సిద్ధిధాత్రి "వైనావు...

పదవనాడు  భక్తుల పాలిటి విజయదుర్గవైనావు...
"విజయదశమి"నాడు విజయోత్సాహాన్ని పంచావు...

"యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః"                @ శ్రీ   




    









24 comments:

  1. "శ్రీ గారూ..
    నవదుర్గలను కీర్తిస్తూ మీ కవిత,పాట చాలా బాగున్నాయండీ..
    నాకు చాలా ఇష్టమైన అమ్మవారి పాట ఇది.
    మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..!

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!
      ఇప్పుడే మీ బ్లాగ్ లో సరస్వతి దేవి,
      స్కందమాత మూర్తులను చూసి వస్తున్నా...
      మీ ప్రశంసకు ధన్యవాదాలు...
      సప్త పదిలోని పాటలు చాలా బాగుంటాయి...
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  2. శ్రీ గారూ.!!
    శరన్నవరాత్రుల శుభాకాంక్షలు :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హర్షా...
      ఈ రోజు విజయవాడలో సరస్వతీ మాతగా కొలువుతీరే అమ్మ
      ఆశీస్సులతో విద్యాభివృద్ధి కలగాలని కోరుతూ...@శ్రీ

      Delete
  3. sree garu chaalaa baavundandi

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు రమేష్ గారూ...
      మీ చక్కని స్పందనకు..
      మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..@శ్రీ

      Delete
  4. చాలా బాగుందండి.
    చక్కటి కవితతో పాటు మంచిపాటను పోస్ట్ లో పెట్టారు.
    శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ!
      చాలా ధన్యవాదాలు మీకు...
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  5. చాలా బాగుందండి.శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ!
      మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు...
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాభినందనలు...@శ్రీ

      Delete
  6. దేవీ కటాక్షం మీకు, మాకు, అందరికీ ఉండాలని కోరుతూ.....

    ReplyDelete
    Replies
    1. లిపి భావన గారూ!
      స్వాగతం నా బ్లాగ్ కి...
      మీ పై కూడా ఆ దేవీ కటాక్ష వీక్షణాలు
      ఎల్లవేళలా ప్రసరించాలని కోరుతూ...@శ్రీ

      Delete
  7. "అమ్మ".. ని బాగా వర్ణించారు. కీర్తించారు. చాలా బాగుంది.
    అందరికి "అమ్మ " ఆశ్శీస్సులు లభించాలని కోరుకుంటూ.. శరన్నవ రాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు చాలా ధన్యవాదాలు వనజ గారూ!
      ఆ చల్లని తల్లి ఆశీస్సులు మీకు,మీ కుటుంబానికి కూడా
      ఎప్పుడూ ఉండాలని కోరుతూ...
      శరన్నవరాత్ర శుభాకాంక్షలతో ...@శ్రీ

      Delete
  8. ఇలాంటి కవితలు రాయటంలో మీదో ప్రత్యేకం.
    చాలా బాగుంది.
    నవరాత్రి శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
      మీ స్నేహపూర్వకమైన ప్రశంసకు...
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  9. చక్కటి పోస్ట్.

    చిత్రం, కవిత , పాట అన్నీ చాలా బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనూరాధ గారూ!
      కవిత , చిత్రం , పాట మీకు నచ్చినందుకు.
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  10. ఇందాక రాయటం మర్చిపోయానండి, మీకు మీ కుటుంబసభ్యులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలండి.

    ReplyDelete
  11. బాగుంది శ్రీ గారు,శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారూ!
      మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

      Delete
  12. శ్రీ గారూ, మీకు అమ్మ కటాక్షం, అమ్మ దీవెన ఉండాలని, మనసారా కోరుకుంటున్నాను, మీరు కీరిటించిన పదాలు గొప్పగా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారూ!
      విని స్తుతించిన విధానం మీకు నచ్చినందుకు
      ధన్యవాదాలు తెలుపుకుంటూ...
      మీకందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతూ...@శ్రీ

      Delete
  13. ఈ కవితకు పోగిడేందుకు మాటలు లేవండీ....అమ్మవారిని...నవ నారాయణిగా చక్కగా భావరహితంగా చాలా బాగా రాసారండీ .... రియల్లీ గ్రేట్ శ్రీ గారు ( మీరు ఎంత పుణ్యం చేసుకొన్నారో ఆ తల్లిని పోగిడేందుకు శక్తి నిచ్చి మీతో కవిత రాయించుకోంది....ఒమ్ శ్రీ మాత్రే నామః ___/\___ )

    ReplyDelete