03/11/2012

ప్రేమంటే నీకు తెలుసా?
ప్రేమంటే నీకు తెలుసా? 
అంటూ అలా ఒక్కసారిగా 
అడిగేస్తే ఎలా?

ప్రత్యూషపు కాంతి 
నిన్ను చూసి
ఇంకా తెలవారకుండా 
వచ్చానేమిటా???
అంటూ సందేహించే సమయంలో...
రాత్రంతా ధనుర్మాసం చలిలో 
మంచులో తడుస్తూ...
చుక్కల ముగ్గులేసేందుకు 
నువ్వెప్పుడొస్తావో...అనుకుంటూ 
నీకోసం  ఎదురు చూసే 
కళ్ళలోకి చూస్తే తెలిసేది 
నీవంటే నాకు ఎంత ఆరాధనో?

పొలం గట్లపై 
వయ్యారంగా నీవు నడుస్తూ 
మన్మథుని చేతి కొరడా లాంటి 
నీ వాల్జడ ఝుళిపిస్తే 
ఒక్క సారైనా 
నా ముఖంమీద 
తగలకపోతుందా?
అనుకుంటూ ఆశగా 
నీ వెనుక 
వేసే సడిలేని నా అడుగులు 
గమనిస్తే తెలిసేది 
నీవంటే నాకు  ఎంత ఇష్టమో?

నేను సైకిలు కొనుక్కున్నా,
దాన్ని నీకు పదడుగుల 
దూరంలో 
మెల్లగా నడిపిస్తూ
మనమధ్య దూరాన్ని మనో నేత్రం తో 
అంచనా వేస్తూ...
నీ సిగలో పువ్వో..
నీ నవ్వుల సిరిమల్లియో 
జారిపడితే 
ఎపుడు దోసిలి పడదామా?
అనుకొనే 
నా ఆరాటం చూస్తే తెలిసేది 
నీపై నాకు ఎంత ఇష్టమో!

క్లాసులో 
నీ అరచేతిలో పడిన 
బెత్తపు దెబ్బ
నా కంటికి ఛళ్ళున 
తగిలి తుళ్ళి పడిన 
నీటిచుక్కని చూస్తే తెలిసేది 
నీవంటే నాకెంత ప్రేమో!...

శరద్పూర్ణిమ నాటి 
జలతారు వెన్నెలలో...
చలువరాతి తీరాన్ని చూస్తూ 
నర్మదా ప్రవాహంలో 
నౌకా విహారం చేస్తూ...
మెలమెల్లగా నేను  చుక్కాని వేస్తూ....
నా ప్రేమ మీద నీకు సందేహమా?
అంటూ నిన్నడిగే ప్రశ్నకి 
బదులివ్వక 
మౌనమే  సమాధానమంటూ...
'చిన్నగా నవ్వే 
నీ మనసులో నామీద దాచుకున్న
అనంతమైన  ప్రేమ'ను 
అడిగితే తెలిసేది నీవంటే నాకెంత ప్రేమో?

ఎన్ని జన్మల బంధమో!
అని నీవంటే 
ఇదే 'తొలిజన్మ' అయితే 
ఎంత బాగుంటుంది ?
అనుకునే నా స్వార్థాన్ని 
అడిగితే తెలుస్తుంది నీవంటే 
నాకు ఎంత ప్రాణమో!

ఇన్నేళ్ళయినా 
తరగని ప్రేమ నాదంటే 
నాదని ఇప్పటికీ 
మనం  ప్రేమగా పోట్లాడుకొనే 
ఆ మధురమైన 
దృశ్యాన్ని చూస్తే....
తెలుస్తుంది 
.....
నీవంటే నాకు,
నేనంటే నీకు 
ఎంత ప్రేమో! అని .................                             -@శ్రీ  


  


25 comments:

 1. శ్రీ గారూ నా ఆటోగ్రాఫ్ సినిమాలో గుర్తుకొస్తున్నాయి పాట గుర్తొచ్చిందండీ.. ఇది చదవగానే. బాగుంది..మొత్తానికి ఇద్దరికీ తెలిసింది ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అని :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సుభ గారూ!
   మీకు నా కవిత లోని అన్ని భావాలు నచ్చినందుకు...
   కొన్ని స్వానుభవాలే లెండి...:-)...@శ్రీ

   Delete
 2. Simple గా కనిపిస్తున్నా చాలా లోతైన భావాలని పలికిస్తారు. సింపుల్ అండ్ సూపర్.

  ReplyDelete
  Replies
  1. రాజారావు గారూ!
   ప్రతి పోస్టులో మీరు ఆత్మీయంగా
   ప్రశంసించే తీరు నాకు ఇష్టం.
   కవితాంతరంగాన్ని చూడగలిగిన మీకు ధన్యవాదాలు!...@శ్రీ

   Delete
 3. తరగని ప్రేమ నాదంటే నాదని పోట్లాడగలిగేదే ప్రేమ...
  నిజమే, సుభగారన్నట్టు "గురుకొస్తున్నాయీ...." పాట గుర్తుకొచ్చింది చదువుతుంటే...
  ఎన్ని అందమైన గురుతులో ప్రేమా...ప్రేమా మధ్య...అన్నీ మీ కవితలో పదాల మధ్యన మరింత అందంగా చెప్పారు, చాలా చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశ గారూ!...:-)
   బాల్యం అంటే అందరికీ గుర్తుకొస్తున్నాయి...పాట తప్పక గుర్తోస్తుందేమో...:-)
   బోలెడు ధన్యవాదాలు మీ ప్రశంసాపద మాలికకు...@శ్రీ

   Delete
  2. http://srikavitalu.blogspot.in/2012/03/blog-post_21.html

   Delete
 4. అమ్మో...ఏది ఏమైనా మీ ఇరువురి ప్రేమ అమృతమయం:-)

  ReplyDelete
  Replies
  1. అంతే కదా పద్మ గారూ!.
   అపుడే గా జీవితం ఆనందమయం...
   ధన్యవాదాలు కవితాభావం గ్రహించినందుకు...:-)@శ్రీ

   Delete
 5. ప్రేమ గురించి మీదైన శైలిలో కవితని పండించారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనికేత్ గారూ!
   ప్రోత్సాహకరమైన మీ స్పందనకు...@శ్రీ

   Delete
 6. ammo sri gaaru elaa vrastunnaru andi... chaalaa bagundi andi

  ReplyDelete
  Replies
  1. మీరు పెట్టే మంచి పాటలు విని...
   మంచి మంచి భావాలు వచ్చేస్తున్నాయి మరి...
   మీ మంచి ప్రశంసకి ధన్యవాదాలు ప్రిన్స్....@శ్రీ

   Delete
 7. sri garu manchi kavitha tho patu manchi song kooda andinchaaru very very nice

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వీణ గారూ!...
   మీకు నా కవిత మెచ్చినందుకు ..
   ఎంచుకున్న పాట నచ్చినందుకు...@శ్రీ

   Delete
 8. శ్రీ గారు, కవిత బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. కవిత మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు వెన్నెల గారూ!...@శ్రీ

   Delete
 9. song and your poetry both are good.

  ReplyDelete
  Replies
  1. thank you for your nice compliment yohanth...@sri

   Delete
 10. ఒకరి కోసం ఒకరైన జంట ప్రేమ ఊసులు,ఊహలు చాలా బాగున్నాయండీ..

  ReplyDelete
 11. ధన్యవాదాలు రాజి గారూ!...
  మీ చక్కని ప్రశంసకు...
  ఈ పాట అతి కష్టం మీద డౌన్లోడ్ అయింది...
  లేకపోతే మీ హెల్ప్ తీసుకున్దామనుకున్నాను...@శ్రీ

  ReplyDelete
 12. అమ్మయ్య, మొత్తం మీద సుఖాంతమే కదా,..అభినందనలండి,.మంచి ఫీల్....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు భాస్కర్ గారూ!...
   ప్రేమకథలు సుఖాంతమైతే సంతోషమే...
   ప్రేమతో సుఖం "అంతం " అయితేనే కష్టం...ఏమంటారు?...@శ్రీ

   Delete
 13. చాలా బాగున్నాయి రాసినవి అన్ని. చాలా అందంగా,మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.ముందు ముందు ఇలాగే అందంగా ఆనందంగా రాయాలని కోరుతున్నాను ,చాలా కష్టపడి రాసినవి అన్ని ,

  ReplyDelete
 14. ధన్యవాదాలు లక్ష్మి గారూ!...మీ ప్రశంసాపూర్వకమైన స్పందనకు...@శ్రీ

  ReplyDelete