11/11/2012

ముఖపుస్తకపు మనోహరి




ఎవరో తెలియదు...
ముఖం చూడలేదు..
ఎక్కడుంటావో  తెలియదు..
ప్రత్యక్షంగా నీతో స్నేహం లేదు..
ముఖపుస్తకంలో కనిపిస్తుంటావు.
అందరితో బాటు మామూలుగా పలకరిస్తుంటావు.

భావ కవిత్వంలో భాషిస్తావు...
మణిమాలికలో మాధుర్యాన్ని చూపిస్తావు...
పద్యనగరిలో విహరిస్తావు...
ఏక్ తారలో హృదయ తంత్రిని మీటుతావు...
కవుల సమూహాల్లో కవితా సుమాలు వెదజల్లుతావు...


నీ ప్రతి అక్షరాన్ని ఆరాధిస్తాను 
వాటిలోని ప్రతిభావాన్నీ ఆస్వాదిస్తాను...
నీ భావానికి నేనేమని వ్యాఖ్యిడితే 
నీవు ఆనందిస్తావో అనుకుంటూ 
ఆలోచించే సమయం 
నేనో కవిత వ్రాసేందుకు పట్టే కాలం కంటే ఎక్కువే.

నా భావవ్యక్తీకరణకు నీ స్పందన కోసం,
ఎదురు చూడటం అలవాటుగా మారింది...
నీ స్పందన లేకుంటే గుండె పిండినట్లుంటుంది 
కనీసం ఇష్టపడ్డట్టు కనిపిస్తే సంతృప్తిగా ఉన్నట్లుంటుంది 


నా అక్షరాల్ని ప్రేమిస్తున్నట్లు..
నా భావుకత్వాన్ని ఇష్టపడుతున్నట్లు 
నా కవితలను క్రమం తప్పక చదువుతున్నట్లు..
వాటికై రోజూ ఎదురుచూస్తున్నట్లు...
తెలిసే నీ స్పందనలోని  పదపారిజాతాలు 
నా మదిలో నిత్యం గుబాళిస్తూ ఉంటాయి...

అనునిత్యం నాతొ ఉన్న మిత్రుల స్నేహం కంటే 
నీ స్నేహం ఎంత అపురూపంగా కనిపిస్తుందో తెలుసా?
మన భావ సారూప్యత వల్లనే ఏమో ఇదంతా!

నీ శుభ ప్రభాతంతో తెరుచుకొనే సందేశాల పెట్టె 
నీకు శుభరాత్రి అని చెప్పాకే మూత  పడుతుంది....
మధ్యలో ఆ పెట్టె ఎప్పుడు వెలిగినా 
నీ పలకరింపేమోనని ఆశగా తెరుస్తుంటాను...

ప్రత్యక్షంగా కనపడక,వినపడక 
వేల మైళ్ళ దూరంలో ఉన్నావో...
కూతవేటు దూరంలో ఉన్నావో తెలియదు గానీ,
నా మనసుకి మాత్రం నీ శ్వాస లోని 
వెచ్చదనాన్ని నేను గుర్తించేంత దూరంలో ఉంటావు...


నీ అక్షరాల్లోని అందమైన రూపాన్ని బట్టి 
నీ సౌందర్యం అంచనా వేసే ప్రయత్నం చేస్తుంటాను...
అయినా ముఖపుస్తకపు ముసుగు తీసి ఎన్నడూ 
నాకు కనిపించకు నేస్తం...
నాకు నచ్చేటి అందం నీలో లేదని నిరాశ పడతానని 
అనుకుంటున్నావా?
కాదు కాదు...
నా ఊహకందని సౌందర్యం నీలో కనపడితే..
అందని అందాన్ని అందుకోలేకున్నానని... 
నా కవితల్లో విరహం ఎక్కువైపోతే 
అది నా కవి మిత్రులు పసిగడతారని భయం...

శైలి మారితేనే  పసిగట్టే సత్తా ఉన్నవాళ్ళు వారు...
భావం మారితే ఆట పట్టించరూ! ...    @శ్రీ 














28 comments:

  1. Wow Extraordinary.....Congrats Srigaru!

    ReplyDelete
    Replies
    1. THANK YOU FOR YOUR
      WONDERFUL COMPLIMENT PADMA GAAROO!@SRI

      Delete
  2. chaalaa chakkagaa mi hrudayaanni chepparu...kavita chaalaa baavundi....mi korika tiraani korukuntu...

    ReplyDelete
    Replies
    1. అది ఫేస్ బుక్ లోని చాలా మందికి అనిపించే భావాలు..అని ఊహిస్తూ
      వ్రాసిన కవిత ఇది...ధన్యవాదాలు మీ స్పందనకు మంజు గారూ!@శ్రీ

      Delete
  3. మెచ్చి మెచ్చకుండా,తెగిడి తెగడకుండా, వ్యాఖ్య చేసినట్టు చేయకుండా.. ఇదిగో.. ఇలా.. :) :)అక్షర అభిషేకం కి నీరాజనాలు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ!
      అబ్బ!...ఇలాంటి పొగడ్త ...ప్రశంస అందరికీ దొరకదు...
      నీరాజనానికి మించినది ఇంకోటి లేదు మరి...
      మనఃపూర్వక మైన ధన్యవాదాలు @శ్రీ

      Delete
  4. చాల బాగుందండీ.

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారూ!
      స్వాగతం నా బ్లాగ్ కి...
      మీకు నా భావం నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  5. అక్షరాల్లో "శ్రీ" అన్న అక్షరం పరమ పవిత్రం !
    కవితల్లో "శ్రీ" గారి కవితలు భావాలకే ప్రతిరూపం!!
    మనోహరంగా చిలికించారు "శ్రీ" గారూ ఒక చిన్న భావాన్ని మీ కవితలో.
    Hats off to you!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ!
      ఏమి చెప్పారండీ?
      ఇంత అందంగా కూడా ఎవరినైనా ప్రశంసించవచ్చని
      మీ వ్యాఖ్యలు చూస్తె తెలుస్తుంది...
      మీకు నా భావం నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  6. ఇంత విభిన్న మైన కవిత మీనుండి రావటం ఇదే ప్రధమం అనుకుంటా!చక్కని పదాల అమరికతో చిక్కటి తెలుగును కుమ్మరించారు. ఇలాంటి ఊహ మీకెలా వచ్చిందా!అన్న ఆసక్తి. ఈ మధ్య మీ పుస్తకం(facebook) చూస్తున్నాను .చాలా చిత్రాలు ఉంచారు..

    ReplyDelete
    Replies
    1. రవి శేఖర్ గారూ!...
      ఈ మధ్య మీరు వ్యాఖ్యల్లోనే కాదు...మీ బ్లాగ్ లో కూడా కనిపించలేదు...
      ధన్యవాదాలు...సమభావాలున్న చోట ఈ ఆసక్తి అందరికీ ఉంటుందేమో!
      అనే భావాని తీసుకొని...నా పంథాలో అల్లుకుంటూ పోయాను..
      మీకు ధన్యవాదాలు....@శ్రీ

      Delete
  7. "ఎన్నడూ
    నాకు కనిపించకు నేస్తం..."

    "శ్రీ" గారూ..
    నిజమేనండీ కొన్ని పరిచయాలు,సంబంధాలు దూరంగా వుంటేనే మంచిదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.... ముఖపుస్తకపు మనోహరి కోసం మీ మనసులో వున్న స్థానం చాలా గొప్పది అనిపిస్తుంది మీ కవిత చదివితే..

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!...
      అలంటి భావాలు బ్లాగ్స్ లో కూడా ఉంటాయి...
      ఆ భావాల్ని ప్రేమ అని గానీ స్నేహం అని కానీ చెప్పలేం...
      సమ భావాలు ఉన్న చోట ఇలా అనిపించడం సహజమేమో!...
      ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...@శ్రీ

      Delete
  8. చాలా మంచి ఫీల్ తో రాసినట్లున్నారు, బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. సృజన గారూ!
      నా అనుభూతుల గుచ్చం
      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  9. abbaaaa eee sri gaaru ela rastarooo emoo vuhake andatam leee...chaalaa bagundi sir

    ReplyDelete
    Replies
    1. thank u prince...ilaanti prashamsalu...inkaa enno bhaavaalanu akshara roopamloki techchelaa protsahistundi nannu...@sri

      Delete
  10. Replies
    1. ప్రసూన మాలికలకు ధన్యవాదాలు...
      నా భావం నచ్చినందుకు...
      మీ బ్లాగ్ చాలా చక్కగా రూపొందించారు....@శ్రీ

      Delete
  11. ’శ్రీ’ గారు!
    ఈ కవితతో మీరు ’అప్రాప్త మనోహరి’ని అంతర్జాలంలో నిలిపారు.
    ’ఆధునిక భావ కవిత్వా’నికి అంకురార్పణ చేసారు.
    అభినందనలు!

    ReplyDelete

  12. ఆచార్య ఫణీంద్ర గారూ!
    స్వాగతం నా బ్లాగ్ కి...
    మీ వంటి వారు ఇచ్చిన ఈ ప్రశంస
    నాకెంతో అమూల్యమైనది...
    నేను వ్రాసేది కవితా ? కాదా?
    అనే సందేహం నేటితో తీరిపోయింది
    ధన్యవాదాలు...అభివాదాలు ...@శ్రీ

    ReplyDelete
  13. చిన్ననాటి నుండి మీ హృదయంలో పదిలపరచుకున్న భావావేశాలను తీరిక వేళల్లో సమయానుకూలంగా సాంకేతిక పరిజ్ఞానంతో భావితరాలకు అందిస్తున్న మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను . మీ ప్రయత్నానికి నా కవితా సుమాంజలి ...బంగారేశ్వర శర్మ పద్యకవి ,తెలుగు పండిట్,ఇంజరం

    ReplyDelete
    Replies
    1. నమస్సులు బంగారేశ్వర శర్మ గారూ!
      మీ ఆశీస్సులు శిరోధార్యం....
      మీ ప్రశంసకి స్పందనకి ...@శ్రీ

      Delete
  14. chaalaa chakkagaa raasaarandii.....
    sirulu kuripinchE Sree kavitaaksharaalu..poodota parimalaalu

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారూ!
      ధన్యవాదాలు మీ ప్రశంసా కుసుమాలను అందుకున్నాను
      @శ్రీ

      Delete
  15. భలే రాసారండీ.. చాలా బాగుంది.. థాంక్యూ సో మచ్.. లింక్ ఇచ్చినందుకు.. :)

    ReplyDelete
  16. ధన్యవాదాలు మధురవాణి గారూ!...చాలాకాలానికి మీ దర్శనం...:-)@శ్రీ

    ReplyDelete