09/11/2012

అందుకే నీవంటే నాకు ఎంతో ఎంతోకనురెప్పల చప్పుళ్లకే ఉలికి పడతావెందుకంటే...
'ఎంత అమాయకంగా అడుగుతావ్...
నీ  కళ్ళల్లో పెట్టి చూసుకుంటావే..
ఆ మాత్రం తెలియదూ?'
అంటూ ఎంత ముద్దుగా 
కసురుకుంటావ్?

గుండె చప్పుళ్ళకే 
బెదిరిపోతావెందుకంటే...
'ఆ గుండెలో ఉన్నది నేనే కదూ?'
అంటూ 'ఎంతో 'ప్రేమగానూ...
'కొంచెం 'సందేహంగానూ 
అడుగుతావ్...

నీ పేరు పలికిన ప్రతిసారీ 
సిగ్గుపడతావెందుకంటే...
'ఆ పెదవులు నా పేరును 
ముద్దాడితే సిగ్గు కాదా మరి?'..
అంటూ బిడియంగా 
బదులిస్తావు...

నన్నింతగా ఎందుకు
ఆరాధిస్తావంటే...
'ఆరాధనకు బదులుగా  
ఆరాధించడం...
నీవేగా నేర్పింది?'
అంటూ తెలివిగా 
సమాధానమిస్తావు...

నీకు నేనేమిచ్చానంటే... 
'నాకు మనసిచ్చావు, 
జీవితాన్నిచ్చావు,
గుప్పెడు గుండెకు 
పట్టని ప్రేమనిచ్చావు,'
అంటూ  నన్ను పొగుడుతూ 
నాకు లేని గొప్పతనాన్ని 
ఆపాదిస్తావు...

మరు జన్మలో 
తోడు ఉంటావు కదూ!
అంటే మాత్రం...
"మరొకర్ని కల్లో కూడా ఊహించకు "
అంటూ కళ్ళెర్ర జేస్తావు...

అందుకే నీవంటే నాకు ఎంతో ఎంతో ...@ శ్రీ           

29 comments:

 1. Replies
  1. నా బ్లాగ్ కి స్వగతం వినోద్ కుమార్ గారూ!...
   ధన్యవాదాలు మీ కు నా కవిత నచ్చినందుకు...@శ్రీ

   Delete
 2. ఎంతో..ఇది.. అని చెప్పడం మానేస్తే ఎలాగండీ!! :)

  మీ ప్రతి కవిత చాలా బాగుంటుంది. యూత్ ట్రెండ్ లా.. ! సెకండ్ ఇన్నింగ్స్ మొదలయినట్టు. :)

  ReplyDelete
  Replies
  1. చెప్పకనే చెప్పే భావాలే బాగుంటాయి కదా వనజ గారూ!...
   మీరన్నది నిజమే...2(20)+ అంటే డబుల్ యూత్ అన్నమాట...
   ధన్యవాదాలు మీ ప్రశంసకు,మీ ఆత్మీయ స్పందనకు...@శ్రీ

   Delete
 3. నువ్వంతా నేను, నేనంతా నువ్వు అన్న భావాన్ని మీ భావంలో అద్భుతంగా చెప్పారు. Keep going శ్రీ గారు.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రోత్సాహం ఎపుడూ మీరు మెచ్చుకునే పదాల్లో కనిపిస్తూ ఉంటుంది రాజారావు గారూ!
   ధన్యవాదాలు మీ భావ విశ్లేషణకు...@శ్రీ

   Delete
 4. "గుప్పెడు గుండెకు
  పట్టని ప్రేమనిచ్చావు,'
  అంటూ నన్ను పొగుడుతూ
  నాకు లేని గొప్పతనాన్ని ఆపాదిస్తావు..."

  శ్రీ గారు..ఇలాంటి మంచి పొగడ్తలు ఏ బంధానికైనా బలాన్నిస్తాయట..
  మరో అందమైన జంట ప్రేమ ఊసులు చాలా బాగున్నాయి..

  ReplyDelete
  Replies
  1. అవును రాజి గారూ!
   మీరు చెప్పింది సత్యం...
   ఒకరి గొప్పను మరొకరు గుర్తిస్తేనే ఆ బంధానికి బలం...
   మీ ప్రశంస నాకు ఆనందదాయకం...@శ్రీ

   Delete
 5. kavita mottam enta baavundo eddari estaalu bhale gaa vunnayi..paata kudaa baavundi

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మంజు గారూ!...
   మీరు కవితను మెచ్చినందుకు...@శ్రీ

   Delete
 6. wa wa waa sri gaaru mee kavita keka andi

  ReplyDelete
  Replies
  1. ప్రిన్స్...
   ఈ మధ్య ప్రతీదీ కేకే అంటున్నారు...
   ధన్యవాదాలు కేక తో చెప్పేస్తున్నాను...@శ్రీ

   Delete
 7. ఏ లైన్ కి ఆ లైన్ లో గొప్ప భావం...చాలాబాగుందండి.

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ!
   మీరు ప్రతి వాక్యంలో సౌందర్యం చూడగలగడం...
   చాలా సంతోషకర మైన విషయం...
   ధన్యవాదాలు నా భావాలు మీకు నచ్చినందుకు...@శ్రీ

   Delete
 8. అందమైన భావాల్ని అంతందంగానే చెప్పారీ కవితలో...
  మరు జన్మ తోడుకే ...సమాధానం సూటిగా రాలేదు...నిజమే అడిగితే రాదేమో ;)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!...
   మీరు ఇచ్చే ప్రశంస నన్ను మరింత ముందుకి నడిపిస్తుంది...
   అవును...ఏదైనా నర్మగర్భంగా చెప్పడంలోనే కదా ఆనందం!...@శ్రీ

   Delete
 9. చాలా బావుందండీ :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీకు సుభ గారూ!నా కవిత నచ్చినందుకు...@శ్రీ

   Delete
 10. భావాలన్నీ అందంగా చెప్పారండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు యోహాంత్ గారూ!
   నా భావాలు మీకు నచ్చినందుకు...@శ్రీ

   Delete
 11. చాలా బాగుంది ముఖ్యంగా ఇక్కడ పెట్టిన ఇమేజ్ కూడా

  ReplyDelete
  Replies
  1. స్వాగతం నా బ్లాగ్ కి చిన్ని గారూ!...
   మీకు నాకవితా భావం...
   ఎంచుకున్న చిత్రం నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

   Delete
 12. ఫోటోలోని పూరేకుల్లాగే మీ కవితలోని భావాలు గుభాళిస్తున్నాయండి.

  ReplyDelete
  Replies
  1. నా వ్రాతలలో గుబాళింపులు చూడగలిగిన
   మీ భావుకత్వానికి ధన్యవాదాలు లిపి భావన గారూ!...@శ్రీ

   Delete
 13. ఎంత సున్నితంగా చెప్పారు. చివరలో చెప్పకుండా వదిలేయడం మరీ బావుంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు జ్యోతిగారూ!...
   బహుకాల దర్శనం...
   మీ ప్రశంసకు ధన్యవాదాలు...
   ముగింపు అలా చేస్తేనే బాగుంటుందని అనిపించింది...@శ్రీ

   Delete
 14. శ్రీగారూ, మీ బ్లాగ్ ఓపెన్ కావటం లేదు అందుకే మెయిల్ చేస్తున్నాను,
  మీ కవిత చాలా బాగుంది. సున్నితమైన భావాన్ని అంటే అందమైన భావుకతను అద్ది పలికించారు.. మంచి కవి సమయం.

  ధన్యవాదాలు మెరాజ్ గారూ!
  మీరు మెయిల్ లో ఇచ్చిన కామెంట్ పైన పోస్ట్ చేసాను...
  మీ స్పందన నాకెప్పుడూ స్ఫూర్తిదాయకమే...@శ్రీ

  ReplyDelete
 15. చాలా బాగుంది.

  ReplyDelete
 16. ధన్యవాదాలు పద్మారాణి గారూ!
  మీకు నాకవిత నచ్చినందుకు...@శ్రీ

  ReplyDelete